iBam భాగవతం ఆణిముత్యాలు

ప్రథమ స్కంధం

1-60 మహదహంకార తన్మాత్రసంయుక్తుఁడై... (సీసము).
iBAA పద్య గానం
iBAP పద్యము
మహదహంకార తన్మాత్రసంయుక్తుఁడై
  చారు షోడశకళా సహితుఁ డగుచుఁ
బంచమహాభూతభాసితుండై
  శుద్ధసత్త్వుఁడై సర్వాతిశాయి యగుచుఁ
జరణోరుభుజముఖశ్రవణాక్షినాసాశి
  రములు నానాసహస్రములు వెలుగ
అంబరకేయూరహారకుండలకిరీ
  టాదులు పెక్కు వేలమరుచుండ

తేటగీతి

బురుషరూపంబు ధరియించి పరుఁడనంతుఁ
డఖిలభువనైక కర్తయై యలఘుగతిని
మానితాపార జలరాశి మధ్యమునను
యోగనిద్రావిలాసియై యొప్పుచుండు

iBAT సందర్భం

పరమపురుషుని ఇరవైయొక్క అవతాఆల్ను గురించి సూతమహాముని నైమిశారణ్యంలోని మునులకు వివరిస్తున్నాడు

iBAT తాత్పర్యము

మహత్తు, అహంకారము అనేవానితో శబ్దము, స్పర్శ, రూపము, రసము, గంధము అనే అయిదు జ్ఞానవిజ్ఞాన విషయాలతో కలిసి పదునారుకళలతో విరాజిల్లుతూ ఉంటాడు అయిదు మహాభూతాలు నింగి, గాలి, నిప్పు, నీరు, నేల అనే వానితో ప్రకాశిస్తూ శుద్దమైన సత్వగుణంతో అన్నింటినీ మించి హాయిగా ఉంటాడు. వేలకొలది కాళ్ళు, తొడలు, చేతులు, నోళ్ళు, చెవులు, కన్నులు, ముక్కులు, శిరస్సులు అతని అవయవాలుగా భాసిస్తూ ఉంటాయి. వానికి తగిన విధంగా అమూల్యములైన వస్తాలు, ఆభరణాలూ వేలకొలదిగా అమరుతూ ఉంటాయి. ఈ అన్నింటితో కూడిన పరమాత్మ పురుషరూపాన్ని ధరించి భువనాలన్నింటినీ హేలగా సృష్టిస్తూ అనంతమైన జలరాశిలో యోగ నిద్రతో ఒప్పారుతూ ఉంటాడు
1-187 తనయులతోడనే దహ్యమానంబగు... (సీసము).
iBAA పద్య గానం
iBAP పద్యము
తనయులతోడనే దహ్యమానంబగు
  జతుగృహంబందును జావకుండఁ
గురురాజు వెట్టించు ఘోరవిషంబుల
  మారుతపుత్రుండు మడియకుండ
ధార్తరాష్ట్రులు సముద్ధతిఁ జీరలొలువంగ
ద్రౌపది మానంబు దలఁగకుండ
గాంగేయ కుంభజకర్ణాది ఘనులచే
  నాబిడ్డ లనిలోన నలఁగకుండ

తేటగీతి

విరటుపుత్రిక కడుపులో వెలయుచూలు
ద్రోణనందన శరవహ్నిఁ ద్రుంగకుండ
మఱియు రక్షించితివి పెక్కుమార్గములను
నిన్ను నేమని వర్ణింతు నీరజాక్ష!

iBAT సందర్భం

కురుక్షేత్రయుద్ధం ముగిసి ద్వారకకు పయనమవుతున్న పరమేశ్వరుని దరికి కుంతి కొడుకులను, కోడలిని వెంటబెట్టుకొని వచ్చింది. నిలువెల్లా భక్తియే కాగా చల్లగా ఇలా పలికింది

iBAT తాత్పర్యము

అందరినీ అన్ని వేళలా కంటికి రెప్పలా కాపాడే గోపాలకుడవు నీవు. అయినా మేము మా తెలివితక్కువతనంతో కొన్నింటినే లెక్కలో వేసుకుంటాము. ఎదురుగానో, చాటుగానో నీవు మమ్ములను కాపాడిన ఘట్టాలను కొన్నింటిని గుర్తుకు తెచ్చుకుంటాము. లక్కయింటిలో నన్నూ నా కొడుకులనూ కాపాడినదీ, దుర్యోధనుడు వింతవింతదారులలో మారుతికి పెట్టిన విషాలకు విరుగుడు చేసినదీ, నిండు కొలువులో బండ గుండెలవారు బట్టలొలువగా ద్రౌపది మానానికి మచ్చరాకుండా కాపాడినదీ, అతిరథమహారథులైన భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు మొదలైన వీరుల పోరులో నా బిడ్డలు నలగకుండా నిలిపి గెలుపుకూర్చినదీ, ఇప్పటికిప్పుడు ఉత్తరకడుపులోని పసికూన ప్రాణాలను పరమాద్భుతంగా పరిరక్షించినదీ, స్వామీ! నీవే కదా!
1-231 సంపూర్ణవృష్టిఁ బర్జన్యుండు గురియించు... (సీసము).
iBAA పద్య గానం
iBAP పద్యము
సంపూర్ణవృష్టిఁ బర్జన్యుండు గురియించు
  నిలయెల్లఁ గోర్కులు నీనుచుండు
గోవులు వర్షించు ఘోషభూములఁ బాలు
  ఫలవంతములు లతాపాదపములు
పండు సస్యములు దప్పక ఋతువుల నెల్ల
  ధర్మ మెల్లెడలను దనరియుండు
దైవభూతాత్మతంత్రములగు రోగాది
  భయములు సెందవు ప్రజల కెందుఁ

ఆటవెలది

గురుకులోత్తముండు ధర్మజుండు
సత్యవాక్యధనుఁడు సకలమహీరాజ్య
విభవభాజియైన వేళయందు

iBAT సందర్భం

శౌనక మహర్షి సూతుని బంధువులను చంపిన పాపాత్ముడనే భావన గుండెనిండుగా ఉన్న ఆ ఉత్తమ పురుషుడు రాజ్యమేలటానికి ఎలా అంగీకరించాడు? అని అడుగగా సూతుడిలా బదులు చెప్పాడు. ధర్మరాజుకు రాజ్యం మీద మమకారం లేదు. వంశంకురమైన పరీక్షిత్తు బాలుడు కావటంచేత నారాయణుడు ధర్మరాజును రాజ్యమేలవలసినదిగా నియోగించాడు. అతని మాట కాదనలేక ఇతడు ఇష్టం లేకపోయినా సింహాసనం అధిష్టించి, సర్వము పరమేశ్వరాధీనమే అనీ, స్వతంత్రమైనది ఏదీ లేదనీ భీష్ముని మాటలలో శ్రీహరి బోధనలలో తెలుసుకొన్న ధర్మరాజునకు విజ్ఞానం వృద్ధి పొందింది. శంకలు సమిసిపోయాయి. కనుక తమ్ముల సాయంతో నిర్లిప్తుడై రాజ్యమేలాడు.

iBAT తాత్పర్యము

వానదేవుడు నెలకు మూడు వానలు కురిపించాడు. భూదేవి కోరిన కోరికలనన్నింటినీ తీరుస్తున్నది. ఆవుల మందలు పాలను వర్షిస్తున్నాయి. చెట్లు తీగలు పండ్లను నిండారా అందిస్తున్నాయి. ఋతువుల ననుసరించి పంటలు సమృద్ధిగా పండుతున్నాయి. ప్రజలు ధర్మం తప్పకుండా బ్రదుకు తున్నారు. ఆధిదైవికము, ఆధిభౌతికము, ఆధ్యాత్మికము అనే తాపాలు మచ్చునకు కూడా కానరావు. కుంతి కొడుకు, కురువంశశిరోమణి, దానాల మన్ననలోఘనత కెక్కినవాడు అయిన ధర్మరాజు పాలనలో ప్రజల సుస్థితి ఇలా ఉన్నది.
1-283 మేఘంబు మేఁది క్రొమ్మెఱుఁగు కైవడి మేని... (సీసము).
iBAA పద్య గానం
iBAP పద్యము
మేఘంబు మేఁది క్రొమ్మెఱుఁగు కైవడి మేని
  పైనున్న పచ్చని పటమువాఁడు
గండభాగంబులఁ గాంచన మణిమయ
మకరకుండల కాంతి మలయువాఁడు
శరవహ్ని నణఁగించు సంరంభమునఁ జేసి
  కన్నుల నునుగెంపు గలుగువాఁడు
బాలార్కమండల ప్రతిమాన రత్న
  హాటక విరాజిత కిరీటంబువాఁడు

తేటగీతి

కంకణాంగద వనమాలికావిరాజ
మానుఁ డసమానుఁ డంగుష్ఠమాత్రదేహుఁ
డొక్క గద జేతఁ దాల్చి నేత్రోత్సవమున
విష్ణుఁడావిర్చవించె నవ్వేళయందు.

iBAT సందర్భం

ఉత్తరాగర్భస్తుడైన పసికందు అశ్వత్థామ ప్రయోగించిన బ్రహ్మాస్త్రం మంటలకు అల్లాడిపోతూ నన్ను కాపాడు నా తండ్రి ఏడీ? రాడా? అంతటా ఉండే వాసుదేవుడు ఇక్కడ లేకపోవటం ఎలా? బాపని నిప్పులు కక్కేబాణాన్ని లీలతో తొలగించి నాకు అభయం ఇవ్వడా? ఇంతకూ నా కర్మం ఎలా ఉందో! అని అదవదలయి పోతున్నాడు. ఇంతలో -

iBAT తాత్పర్యము

అదిగో భక్తపరాధీనుడు రానేవచ్చాడు. నల్లనిమేఘం మీద క్రొత్తమెఱుపులాగా పచ్చని ఉత్తరీయం తళతళలాడుతున్నది. నిగనిగలాడే బుగ్గలమీద మణులు కూర్చిన మకరకుండలాల కాంతి వింతగా మెరిసి పోతున్నది. అశ్వత్థామ అస్త్రపుమంటను మట్టుపెట్టే తొందరలో కంటిలో ఎర్రజీర కమనీయంగా ఉంది. తలపై ఉన్న కిరీటం బాలభానుని బంగారు కాంతులు విరజిమ్ముతున్నది. కంకణాలు, అంగదాలు, వనమాలికా ఆ సుందరుని దేహకాంతితో క్రొత్త అందాలను కూర్చుకుంటున్నాయి. అంతా కలిసి బొట్టనవేలంత ఉన్నాడు. అయినా సాటివచ్చే మేటి మరొకడు లేడు. చూడముచ్చటగా ఉన్న ఆ సుందరుడు ఒక గద చేతబట్టుకొని అక్కడ ఆవిర్భవించాడు.
1-291 సమదర్శనంబున జలజాతభవుఁడనఁ... (సీసము).
iBAA పద్య గానం
iBAP పద్యము
సమదర్శనంబున జలజాతభవుఁడనఁ
  బరమప్రసన్నత భర్గుఁ డనఁగ
నెల్లగుణంబుల నిందిరావిభుఁడన
  నధికధర్మమున యయాతి యనఁగ
ధైత్యసంపద బలిదైత్యవల్లభుఁడన
  నచ్యుతభక్తిఁ బ్రహ్లాదుఁడనఁగ
రాజితోదారత రంతిదేవుండన
నాశ్రితమహిమ హేమాద్రి యనఁగ

తేటగీతి

యశము నార్జించుఁ, బెద్దల నాదరించు
సణ్యమేధంబు లొనరించు నాత్ర్మసుతుల
ఘనులఁ బుట్టించు, దండించు ఖలులఁ బట్టి
మానధనుఁడు నీ మనుమండు, మానవేంద్ర!

iBAT సందర్భం

ధర్మరాజు జ్యోతిశవిద్వాంసులతో చక్రం వేయించి బాలుని బ్రతుకుతీరెలా ఉందో చెప్పవలసినదిగా ప్రార్థించాడు. వారిలా అన్నారు.

iBAT తాత్పర్యము

సమదర్శనంలో బ్రహ్మ, ప్రసన్నతలో శివుడు, సర్వసద్గుణాలలో లక్ష్మీపతి, ధర్మవిషయంలో యయాతి. ధైర్యంలో బలి. భగవద్భక్తిలో ప్రహ్లాదుడు, ఔదార్యంలో రంతిదేవుడు. ఆశ్రయించినవారి నాదుకోవటంలో బంగారుకొండ అనదగి బ్రదుకుతాడు. గొప్పకీర్తి సంపాదిస్తాడు. పెద్దలను ఆదరిస్తాడు. అశ్వమేధాలు ఆచరిస్తాడు. ఉత్తములైన కొడుకులను పొందుతాడు. ఖలులను కాలరాచివేస్తాడు. నీ మనుమడు మానధనుడు.
1-367 చెలికాఁడ రమ్మని చీరు నన్నొకవేళ... (సీసము).
iBAA పద్య గానం
iBAP పద్యము
చెలికాఁడ రమ్మని చీరు నన్నొకవేళ
  మన్నించు నొకవేళ మఱఁది! యనుచు
బంధుభావంబునఁ బాటించు నొకవేళ
  దాతయై యొకవేళ ధనము లిచ్చు
మంత్రియై యొకవేళ మంత్ర మాదేసించు
బోద్ధయై యొకవేళ బుద్ది సెప్పు
సారధ్య మొనరించుఁ జనవిచ్చు నొకవేళఁ
  గ్రీడించు నొకవేళ గేలిసేయు

తేటగీతి

నొక్క శయ్యాసనంబున నుండుఁ గన్న
తండ్రి కైవడిఁ జేసిన తప్పుఁగాంచు
హస్తములు వట్టి పొత్తున నారగించు
మనుజవల్లభ! మాధవు మఱవరాదు.

iBAT సందర్భం

అర్జునుడు శ్రీకృష్ణుడు తనను ఆదరించిన తీరుసు తలచుకొని కుమిలిపోతున్నాడు.

iBAT తాత్పర్యము

ప్రభూ! నన్నెన్ని విధాల మన్నించాడో తలచుకొంటే ఆ కరుణకు, ఆ ప్రేమకు అవధులు ఉన్నాయా? అనిపిస్తుంది. ఒక్కొక్కప్పుడు ఒక్కొక్కతీరున పిలిస్తూ నన్ను తన హృహయంలో నిలుపుకొన్నాడు. కన్నతండ్రిలా తప్పులన్నీ సహించేవాడు. చేయి చేతితో పట్టి నాతో విందులు ఆరగించాడు. తన ప్రియభామలు తనపై అలిగితే వారిని సరిదిద్దటానికి నన్ను పంపేవాడు. తనప్రియకాంతలు ఏకాంతంలో ఆడిన ముచ్చటలు నాతో చెప్పి మురిసిపోయేవాడు. అటువంటి మాధవుని మహారాజా! మరువలేను.

ద్వితీయ స్కంధం

2-49 అలరు జొంపములతో నభ్రంకషమ్ములై... (సీసము).
iBAA పద్య గానం
iBAP పద్యము
అలరు జొంపములతో నభ్రంకషమ్ములై
  బ్రదుకవే వనములన్ బాదపములు?
ఖాదనమేహనాకాంక్షలఁ బశువులు
జీవింపవే గ్రామసీమలందు?
నియతిమై నుచ్చ్వాస విశ్వాసపవనముల్
  ప్రాపించవే చర్మభస్త్రికలును?
గ్రామసూకర శునకశ్రేణు లింటింట
  దిరుగవే దుర్యోగదీనవృత్తి?

తేటగీతి

నుష్ట్రఖరములు మోయవే యురుభరములు
పుండరీకాక్షు నెఱుఁగని పురుషపశువు
లడవులందు నివాసములందుఁ బ్రాణ
విషయభరవృత్తితో నుంట విఫల మధిప?

iBAT సందర్భం

మోక్షకామి అయిన పరీక్షిన్మహారాజుతో సుకమహర్షి ఇలా అంటున్నాడు. మహారాజా! సంసారంలో ప్రయేశించినవానికి తపస్సూ యోగమూ మొదలైన మోక్షమార్గాలు ఎన్నో ఉన్నాయి. కానీ వానిలో భక్తిమార్గంకంటె సులభమైనదేదీ లేదు. సర్వభూతాలలో ఆత్మరూపంలో విష్ణువును వందనాదుల ద్వారా అందుకోవటానికి చేసే ప్రయత్నమే భక్తి

iBAT తాత్పర్యము

పరీక్షిన్మహారాజా! పరీక్షించవయ్యా! ఎంత వివేకధనమో ఉండవలసిన మనుజుడు పశువులకంటె చెట్లకంటె జడపదార్థములకంటె చెడిపోవాలా? ఆకాశం అంచులదాకా హాయిగా పెరుగుతున్న వృక్షాలు ఎవరినైన దేహి అంటున్నాయా? మనిషి పశువులలాగానే అన్నంకోసం, అంగనలకోసం అంగలార్చుతూ ఉంటే వాడేమి మనిషి? ఉచ్చ్వాస నిశ్శ్వాసాలకోసమే బ్రదుకు అనుకుంటే కొలిమి దగ్గర గాలితిత్తులు ఆ పని చేయటం లేదూ? లేకిగా ధనాదుల కోసం వెంపరలాడితే మనిషికీ ఇల్లిల్లూ సిగ్గులేకుండా తిరిగే కుక్కలకూ పందులకూ తేడా ఏమిటి?
2-50 విష్ణుకీర్తనములు వినని కర్ణంబులు... (సీసము).
iBAA పద్య గానం
iBAP పద్యము
విష్ణుకీర్తనములు వినని కర్ణంబులు
  కొండల బిలములు కువలయేశ!
చక్రి పద్యంబులు చదువని జిహ్వలు
  కప్పల జిహ్వలు కౌరవేంద్ర!
శ్రీమనోనాథు వీక్షింపని కన్నులు
  కేకిపింఛాక్షులు కీర్తిదయిత!
కమలాక్షు పూజకుఁగాని హస్తంబులు
  శవము హస్తంబులు సత్యవచన!

ఆటవెలది

హరిపదతులసీ దళామోదరతిలేని
ముక్కు పందిముక్కు మునిచరిత్ర!
గరుడగమను భజనగతిలేని పదములు
పాదపముల పాదపటల మనఘ!

iBAT సందర్భం

విష్ణుభక్తి మహాత్మ్యాన్ని గురించి పరీక్షిత్తుకు ఇలా విఅవరిసున్నారు శుకయోగీంద్రులు

iBAT తాత్పర్యము

విష్ణుకీర్తనములు వినని చెవులు కొండగుహలు. చక్రిపద్యాలు చదువని నాలుకలు కప్పనాలుకలు. హరిని చూడని కన్నులు నెమలి కన్నులు. కమలాక్షుని పూజింపని చేతులు శవాల చేతులు. విష్ణుపాదం దగ్గర తులసిని వాసన చూడని ముక్కు పంది ముక్కు, నారాయణుని దరిచేరని కాళ్ళు చెట్లవ్రేళ్ళు
2-231 క్షాళితాఖిల కల్మషవ్రఆఆమరనదీ... (సీసము).
iBAA పద్య గానం
iBAP పద్యము
క్షాళితాఖిల కల్మషవ్రఆఆమరనదీ
  జనక కోమలపదాబ్జములవాని
నఖిల సంపత్కారణాపాంగలక్ష్మీ
  విలాసిత వక్షఃస్థలంబువాణీ
పద్మమిత్రామిత్రభాసిత కరుణా
  తరంగిత చారు నీత్రములవాని
భువన నిర్మాణనైపుణభవ్య నిజజన్మ
  కారణానాభిపంకజమువాని

తేటగీతి

సహిహితాహితశయన వాహములవాని
సేవితామరతాపసశ్రేణివాని
నఖిలలోకంబులకు గురుండైన వానిఁ
గాంచెఁ బరమేష్ఠి కన్నుల కరపుదీర.

iBAT సందర్భం

శుక్రయోగీంద్రులు పరీక్షిన్మహారాజుతో బ్రహ్మసృష్టిగురించి ఇలా వివరిస్తున్నారు.

iBAT తాత్పర్యము

సర్వపాపాలను సమూలంగా నాశనం చేసే పవిత్రగంగ తన పాదపద్మాలలో ప్రభవించింది. అన్ని లోకాలకూ అన్నివేళలా అన్ని సంపదలనూ తడకంటి చూపుతో అందించే జగదంబ లక్ష్మి తన రొమ్ముపై విలాసంగా వాసం చేసున్నది. పద్మాలకు బాంధవుడైన భాస్కరుడూ పగవాడైన చంద్రుడూ చెరొక కన్నుగా అయి కరుణాతరంగాలను విరిజిమ్ముతున్నారు. లోకాలన్నింటినీ నిర్మించే నేర్పుగల బ్రహ్మపుట్టుకకు కారణమైన బొడ్డుతామర పొంకంగా అమరి ఉన్నది. పాముల చెలికాడు శేషుడు శయనాన్నీ, పగవాడు గరుడుడు పయనాన్నీ సంతరిస్తున్నారు. దేవతలందరూ నెట్టుకొని సేవిస్తున్నారు. అట్టి సర్వలోకగురువైన శ్రీమన్నారాయణుని లోకపితామహుడు కన్నుల కరవు తీరేట్లుగా కనుగొన్నాడు.

తృతీయ స్కంధం

3-83 మునిజనముఖపద్మములు ముకుళింపఁగ... (సీసము).
iBAA పద్య గానం
iBAP పద్యము
మునిజనముఖపద్మములు ముకుళింపఁగ
  ఖలజనలోచలోత్పలము లలర
జారచోరుల కోర్కి సఫలత నొందఁగ
  దానపదర్పాంధతమన మదర
పరయోగిజనచక్రవాకంబు లడలంగఁ
  కలుషజనానురాగంబు పర్వ
భూరిదోషాగమస్ఫూర్తి వాటిల్లంగ
  నుదిత ధర్మక్రియ లుడిగి మదఁగ

తేటగీతి

మానుషాకారరుచికోటి మందపఱిచి
యనఘ! యేమన నేర్తుఁ గృష్ణాభిధాన
లోకబాంధవుఁ డుత్తమశ్లోకమూర్తి
మించుతేజంబుతో నస్తమించెనయ్య

iBAT సందర్భం

ఉద్దవుడు విదురునితో శ్రీకృష్ణనిర్యాణం గురించి ఇలా చెప్తున్నాడు. మహానుభావా! ఆ యముడనే కాలానాగం యాదవుల నందరినీ ఒడిసిపట్టుకున్నదయ్యా! దానితో నామనస్సు కళవళపడిపోతున్నది. ఏమి చెప్పను? ఎలా చెప్పను?

iBAT తాత్పర్యము

భగవద్భావనతో ఎల్లవేళాలా వికసించే ఉండే మునుల ముఖ పద్మాలు ముకుళించుకుపోయయి. నిలువెల్లా విషమే అయి లోకాలను పీకుకొని తినే ఖలుల కన్నులు కలువలలాగా వికసించి పోతున్నాయి. జారులూ చోరులూ మాపంట పండిందనుకొంటున్నారు. రక్కసుల పొగరనే చీకట్లు బాగా క్రమ్ముకొంటున్నాయి. యోగాభ్యాసంతో పరమాత్మను పట్టుకొనే ప్రయత్నంతో ప్రపంచాన్ని మరచిపోయే యోగి జనులనే చక్రవాకపక్షులు అదలిపోతున్నాయి. మహాపాతకాలనే కారు చీకట్లు క్రమ్ముకొంటున్నాయి. పాడుబుద్ధులవారి అనురాగం విజృంభిస్తున్నది. ధర్మకార్యాలన్నీ అణగి పోయాయి. అస్తంమించాడయ్యా సర్వ లోకాలకూ వెలుగులను విరజిమ్మే అనందమూర్తి, నాకు సర్వమూ అయి శ్రీకృష్ణవాసుదేవుడనే లోక బాంధవుడు! క్రమ్ముకొన్నాయయ్యా కారుచీకట్లు!
3.89 మానవైకవిశాసమానమై తనకును... (సీసము).
iBAA పద్య గానం
iBAP పద్యము
మానవైకవిశాసమానమై తనకును
  విస్మయజనకమై వెలయునట్టి
యాత్మీయయోగమాయాశక్తిఁ జేపట్టి
  చూపుచు నత్యంతసుభగమనుచు
భూషణంబులకును భూషణంబై
  వివేకముల కెల్లను పరాకాష్టయగుచు
సకలకల్యాణ సంస్థానమై సత్యమై
  తేజరిల్లెడు నట్టి దివ్యమూర్తి

తేటగీతి

తాన తన మూర్తి నిజశక్తిఁ దగ ధరించి.
యమతనూభవు రాజసూయాధ్వరంబు
నందు నెవ్వని శుభమూర్తి నర్థితోడ
నిండు వేడుకఁ జూచి వర్ణించుచుందు

iBAT సందర్భం

విదురమహాశయా! నీకు కూడా తెలుసు. భాగవత శ్రేష్ఠులు తమ చూపులను, బుద్ధిని, సర్వవ్యాపారములను, అతనియందే నిక్షేపించుకొని, ఆ భాగ్యం ఇంకా కావాలి, ఇంకా కావాలి అనుకొంటూ ఉంటారు. ఆ విషయంలో వారికి తృప్తి తీరదు. ఆ స్వామికూడా వారికి ఆత్మగా అయి పోతూ ఉంటాడు. విశ్వానికంతటికీ వెలుగులనన్నింటినీ ప్రసాదించే వెలుగులమూర్తి ఆ పరబ్రహ్మము, శోకాన్నీ, విశోకాన్నీ కూడా రూపుమాపుతాడు. ఆదిలక్ష్మికి మూలభాగధేయం. పరమశాంతమూర్తి కోరి తెచ్చుకొన్న మానవదేహాన్ని కోరి వదలించుకొని అంతర్థానం చెందాడు

iBAT తాత్పర్యము

విదురా! ఆ స్వామిమూర్తిని పట్టుకోవటానికి కన్నులు చాలవు. వర్ణించటానికి వాక్కులు చాలవు. భావించటానికి బుద్ధిబలం తికమకపడు తుంది. అయినా అవి ఊరుకోవు కదా! వాని చాపలం వానిది.

ఆ పరమాత్ముడు తనదైన యోగమాయాశక్తిని తనచేతిలో కీలు బొమ్మగా చేసికొని ఆడిస్తూ ఉంటారు. అది మానవులందరకు నిరంత రమూ వికాసాన్ని కలిగిస్తూ ఉంటుంది. విస్మయం పుట్టిస్తుంది. ఆ అందమే వేరు ఆ చందమే వేరు. అది భూషణాలకు భూషణం. వివేకాలకు చిట్టచివరి దిక్కు సమస్త సన్మంగళాలూ విరాజిల్లే గొప్ప తావు అది. మూడు కాలాలలోను ఏకరూపంగా ఉండే దివ్యమూర్తి అట్టి విశ్వవిభుడు తన శక్తిని తనమూర్తిలో నిలుపుకొని ధర్మనందనుని రాజసూయమహా యజ్ఞంలో అందరికీ దర్శనాన్ని అనుగ్రహించాడు. అతని మాయాశక్తి ఆ దివ్యమంగళస్వరూపాన్నీ తనివితీరా వర్ణిస్తూ ఉంటుంది. ఆ సందర్భంలో జ్ఞానం పొలాల పొలిమేరలలో విహరించే యోగివరులందరూ ఆహా! ఈ స్వామియే కదా సర్వలోకాలను సృష్టించే సృష్టికర్తకు సృష్టికర్త – అని ఆనందంలో పరవశించిపోయారు.
3.118 శరదాగమారంభ సంపూర్ణ పూర్ణిమా ... (సీసము).
iBAA పద్య గానం
iBAP పద్యము
శరదాగమారంభ సంపూర్ణ పూర్ణిమా
  చంద్ర సాంద్రాతపోజ్జ్వలితమగుచు
వెలయు బృందాటవీవీధియందొకనాడు
  రాసకేళీమహోల్లాసుఁ డగుచు
రుచిక సౌభాగ్య తారుణ్య మనోరమ
  స్ఫూర్తిఁ జెన్నొందిన మూర్తిఁ దనర
సలలిత ముఖచంద్రచంద్రికల్ గోపికా
  నయనోత్పలముల కానందమొసఁగ

తేటగీతి

భవ్యచాతుర్య భంగిఁ ద్రిభంగి యగుచు
నజ్జనాభుఁడు సమ్మోదద మతిశయిల్ల
లీలఁ బూరించు వరమురళీ నినాద
మర్థి వీతేర విని మోహితాత్ము లగుచు

iBAT సందర్భం

కృష్ణస్వామి గోవర్ధనపర్వతం చిటికెన వ్రేలిమీద ఏడురోజులు నిలబెట్టి గోవులనూ, గోపాలకులనూ అందరినీ సంరక్షించాడు. ఇంద్రునికి శృంగభంగం అయ్యింది. నందగోకులం వారందరూ ఆనందంతో కేరింతలు. కొట్టారు

iBAT తాత్పర్యము

పరమాత్మ ధరణికి దిగివస్తే ఆయన చేసే వనులన్నీ ఆయన స్థాయికి తగినట్లే ఉంటాయి. ఆ మహాత్ముడు కృష్ణచంద్రుడు అంటు సొంటులు లేకుండా అందరికీ ఆనందం అందించటానికి కొన్ని లీలలు ప్రదర్శించారు. అందులో ప్రధానమైనవి వేణుగానం, రాసక్రీడలు. వేణు గానం అంటే పరమాత్మనుండి ప్రథమంగా పుట్టిన ఆకాశాన్నంతా నాదమయం చేయటం. నాదం పరమేశ్వరుని తనువు అంటారు తత్త్వం తెలిసినవాళ్ళు. శరత్కాలం జీవకోటికి చాలా భయంకరమైన సమయం. ఎందుకంటే వర్షాకాలంలో వానలవలన అతలాకుతలం అయిపోయిన ప్రకృతి అంతా సూక్ష్మక్రిముల పరివ్యాప్తితో ప్రాణులకు అనేక రోగాలను సంక్రమింపజేస్తుంది. దానికి సామూహిక చికిత్స చాలా అవసరం. వేణు గానంతో కృష్ణచంద్రుడు జనాలను ఆకర్షించి వాతావరణకాలుష్యానికి ప్రజలను దూరంగా ఉండేట్లు చేశాడు. మనుష్యులే కాదు, ఆనాద మాధుర్యానికి పశువులు, పక్షులు, పాములు మొదలైన ప్రాకే జంతువులు కూడా పరవశించిపోతాయి. ఆనాదం వచ్చే వైపు తమ శరీరం చేరుకుంటే కలుషిత వాతావరణంనుండి బయట పడతారు. ముఖ్యంగా రాత్రి సమయాలలో ఈ క్రిముల వ్యాప్తి చాలా ఎక్కువగా ఉంటుంది. ఆరుబయట హాయిగా ఉండే అవకాశం అధికంగా ఉంటుంది
3-133 సంపూర్ణ పూర్ణిమా చంద్రచంద్రిక నొప్పు... (సీసము).
iBAA పద్య గానం
iBAP పద్యము
సంపూర్ణ పూర్ణిమా చంద్రచంద్రిక నొప్పు
  రమణీయ శారదరాత్రులందు
సలలితకాంచనస్తంభసౌధోపరి
  చంద్రకాంతోపలస్థలములందు
మహితకరేణుకామధ్య దిగ్గజముల
  గతిని సౌదమనీలతల నడిమి
నీలమేఘంబులలీల ముక్తాఫల
  లలిత మధ్యస్ధనీలముల భాతి

తేటగీతి

సతత యౌవన సుందరీయుత విహారుఁ
డగుచు సతులెందఱందఱ కన్నిరూప
ములను గ్రీడించెఁ బెక్కబ్దములు సెలంగి
నందనందనుఁ దభినవానందలీల.

iBAT సందర్భం

చల్లనిరూపులతో, అమృతపు వంటి పలుకులతో, లక్ష్మీదేవికి నిత్యనివాసమైన దేహంతో పాండవులను, వారి వారిని యదుకులం వారినందరినీ లీలతో పాలిస్తున్నాడు. ఆర్తరక్షణ విషయంలో ఏమరుపాటు ఏమాత్రమూ లేనివారై కదలుతున్నారు.

iBAT తాత్పర్యము

శ్రీకృష్ణస్వామికి ఒకటే లక్ష్యం. ఎవరు ఏది అపేక్షస్తారో వారికి అదే ప్రసాదించి ఆనందపరవశుడై ఆపనిలో అన్నీ తానై క్రీడిస్తూ ఉంటారు. నిండుపున్నమినాడు జాబిల్లి వెన్నెలలు జగత్తునంతా మత్తెక్కించే శరత్కాల రాత్రులలో, బంగారు భవనాల పైభాగాలలో చంద్రకాంతమణులు పొదిగిన తావులలో, ఆడు ఏనుగులమందలో తిరిగే గజరాజులాగా, విద్యుల్లతల మెరుపులతో వింతవింతసోయగాలతో కన్పట్టే నల్లని మేఘంలాగా, స్వచ్ఛమైన కాంతితో తళతళలాడే ముత్యాలరాశిలో ఇంద్రనీలమణిలాగా కృష్ణయ్య యువతీసమూహంలో ఆనందవిహారం చేస్తూ ఉండేవాడు. ప్రతి యువతికీ, ఇతడు నావాడే, నా ఒక్కనిదానివాడే అనిపించే విధంగా అందరికీ అన్నిరూపాలతో కన్పట్టేవాడు. విభూతి అంటే అదేకదయ్యా! వివిధంగా అయిపోవటం. అది మానవమాత్రునకు సాధ్యమవుతుందా? ఈవిధంగా నందనందనుడు నిత్యనూతనమైన ఆనందలీలతో పెక్కు సంవత్సరాలు గడిపాడు
3-145 అస్మత్ప్రియస్వామి నచ్యుతుఁ బదు... (సీసము).
iBAA పద్య గానం
iBAP పద్యము
అస్మత్ప్రియస్వామి నచ్యుతుఁ బదు
  సత్త్వ గుణగరిష్టుని రజోగుణవిహీను
సురుచిర ద్వారకాపుర సమాశ్రయు వనా
  శ్రయు నీలనీరదశ్యామవర్ణు
దళదరవిందసుందర పత్రనేత్రు ల
  క్ష్మీయుతుఁ బీతకౌశేయవాసు
విలసిత వామాంక విన్యస్త దక్షిణ
  చరణారవిందు శశ్వత్ప్రకాశు

తేటగీతి

ఘనచతుర్బాహు సుందరాకారు ధీరుఁ
జెన్నుగల లేతరావిపై వెన్ను మోపి
యున్న వీరాసనాసీను నన్నుఁ గన్న
తండ్రి నానందపరిపూర్ణు దనుజహరుని

iBAT సందర్భం

"ఉద్దవా! మనస్సులో ఏ శండలూ పెట్టుకోకు. ఇవి నా ఆజ్ఞగా భావించు. నీవు బదరీవనానికి వెళ్ళి అక్కడ తపస్సు చేసుకో" అని పలికారు. వదలిపోవటానికి ఇష్టం లేదు. కాదనటం కష్టం. శ్రీస్వామి అదేశం మేరకు నేను బదలీవనానికి చేరుకొన్నాను. కానీ లీలామానుషవిగ్రహుడైన స్వామిని దర్శించుకోవాలనే గాఢమైన ఉత్కంఠతో మునుపటి తావునకు తిరిగి రాగా ఆ మహాత్ముడు ఆచెట్టు క్రింద తన దేహప్రభలు పరివ్యప్తం చేస్తూ ఉండగా చూచాను. ఎలా ఉన్నాడు?

iBAT తాత్పర్యము

నాకు ప్రియమైన స్వామి, ఏకోశానా జారుబాటు లేనివాడు. ప్రపంచానికి ఆవల ఉండేవారు. సత్త్వగుణం ఆకారం పొందినదా అన్నట్లు ఉండే వాడు. రజోగుణం రవ్వంతైనా లేనివాడు. చూడముచ్చటు అయిన ద్వారకా పురాన్ని నిర్మించుకొని దానిని ఆశ్రయంగా చేసికొన్నవాడు. నీలమేఘం వంటి కాంతితో అలరారే దేహంవాడు. వికసిస్తున్న పద్మం రేకులవంటి కన్నులున్నవాడు. నిలువెల్లా లక్ష్మీదేవి ఆవేశించినట్లు కన్పట్టేవాడు. పచ్చని పట్టువస్త్రం కట్టేవాడు. ఎడమతొడపై ఉంచిన కుడికాలు విచ్చుకొన్న తామర పూవులాగా కానవస్తున్నవాడు. వేలసూర్యులు ఒక్కమారుగా వెలిగి పోతున్న కాంతితో అలరారుతున్నవారు. నాలుగు హస్తాలు జగత్తులనన్నీ భరింపగలము అన్నవిధంగా ఒప్పారుతున్నాయి. సృష్టిలోని అందచందాలన్నీ రాశిపోసినట్లున్నవాడు. ధీరుడై, ఒక సుందరసుకుమారమైన రావిచెట్టుకు వెన్నుమోపి వీరాసనంలో కూర్చున్నాడు. నన్ను గన్నతండ్రి. ఆనందం రూపం ధరించినట్లున్నాడు. తాను వచ్చిన పని - రక్కసులను మట్టుపెట్టటం - అయిపోయి అమ్మయ్య - ఇక్కడ మనకేమి పని ఉంది అన్నట్లు కన్పట్టుతూ ఉండగా చూచాను.
3-180 ఘనసారరుచివాలుకా సముదంచిత... (సీసము).
iBAA పద్య గానం
iBAP పద్యము
ఘనసారరుచివాలుకా సముదంచిత
  సైకతవేదికా స్థలమునందు
యమనియమాదియోగాంగక్రియానిష్టఁ
  బూని పద్మాసనాసీనుఁ డగుచు
హరిపాదసరసీరుహన్యస్త చిత్తుఁడై
  బాహ్యేంద్రియవ్యాప్తిఁ బాఱఁ ద్రోలి
సకలవిద్వజ్ఞన స్తవనీయ సముచితాచార
  వ్రతోపవాసములఁ గ్రుస్సి

తేటగీతి

యున్న పుణ్యాత్ము విగతవయోవికారు
వినుత సంచారు భువనపావన విహారు
యోగిజనగేయు సత్తతిభాగధేయు
నాశ్రితవిధేయు మైత్రేయు నచటఁ గాంచె

iBAT సందర్భం

విదురునికి జ్ఞానవిజ్ఞానాల పట్టు సాధించాలని పట్టుదల కలిగింది. ఉద్దవుని సూచనమేరకు మైత్రేయమహర్షిని వెదకుకుంటూ బయలు దేరాడు. ఆ మహర్షి జ్ఞానదీప్తులతో వెలిగిపోతూ ఉంటాడు. మంచివారికి మేలు చేసే శీలం కలవాడు. తలలు పండిన విద్యావంతులు కూడా ఆయనను ఆశ్రయిస్తారు. గొప్ప తపస్సంపదకల మహర్షి. ఆయనను వెదకుకొంటూ విదురుడు గంగానదిని చేరుకొన్నాడు. అందులో తనివి తీరా స్నానమాచరించాడు. మెల్లగా మైత్రేయులవారిని సందర్శించు కొన్నాడు. ఆ మహాత్ముడు.

iBAT తాత్పర్యము

విదురుని కంటికి మైత్రేయుడు మానవమాత్రుడుగా కనబడ లేదు. ఆ గంగానది ఇసుకతిన్నె పచ్చకర్పూరం పలుకుల అరుగులా ఉన్నది. దానిమీద మహర్షి కూర్చున్నాడు. యమము, నియమము మొదలైన ఎనిమిది అంగాల యోగప్రక్రియలను కూర్చుకొని ఉన్నారు. పద్మాసనం వేసికొని ఉన్నాడు. చిత్తంలో శ్రీహరిపాదపద్మాలను భద్రంగా నిక్షేపించు కొని ఉన్నాడు. కన్ను, ముక్కు, చెవి, చర్మము, నాలుక అనేవి వెలుపలి వస్తువుల వైపు పోవటంలేదు. గొప్ప విద్వాంసులు కూడా మెచ్చుకొనే వ్రతాలూ, ఉపవాసాలూ ఆచరిస్తూ శరీరాన్ని ఎండగడుతున్నారు. వయస్సుకు సంబంధించిన ఏ వికారమూ ఏ కోశానా ఆయనలో కానరాదు. ఆయన అడుగు పెట్టిన తావు పవిత్రమై అలరారుతుంది. యోగిజనులందరు అతనిని కొనియాడుతూ ఉంటారు. సత్పురుషులు జ్ఞానంకోసం ఆశ్రయిస్తారు. అట్టి మైత్రేయ మహర్షిని విదురమహాశయుడు దర్శించుకొన్నాడు
3-743 తరణిసుధాకర కిరణసమంచిత... (సీసము).
iBAA పద్య గానం
iBAP పద్యము
తరణిసుధాకర కిరణసమంచిత
  సరసీరుహోత్పల ప్రగ్విలాసుఁ
గంకణనూపురగ్రైవేయ ముద్రికా
  హారకుండల కిరీటాభిరాముఁ
గమనీయసాగరకన్యకాకౌస్తుభ
  మణిభూషణోద్భాసమానపక్షు
సలలితదరహాసచంద్రికాధవళిత
  చారు దర్పణ విరాజత్కపోలు

తేటగీతి

శంఖచక్రగదాపద్మచారుహస్తు
నళికులాలకరుచి భాస్వదళికఫలకుఁ
బీతకౌశేయవాసుఁ గృపాతరంగి
తస్మిరేక్షణుఁ బంకజోదరుని హరిని

iBAT సందర్భం

కృతయుగం ప్రారంభంలో పరమేష్టి కర్దమప్రజాపతిని ప్రజాసృష్టి చేయవలసినదిగా ఆజ్ఞాపించినారు. సంతోషించిన కర్దమప్రజాపతి సరస్వతీ సరీతీరంలో పదివేల దివ్యసంవత్సరాలు జనసమాధిలో ఏకాగ్రచిత్తుడై ఉన్నాడు. అతని త్రికరణాలలో సుదర్శనమహాస్వామియే నిరంతరం కదలాడుతూ ఉండేవారు. ఆ స్వామికి అతనిపై అనంతమైన కరుణ కలిగింది. గగనతలంలో నెలకొని అతనికి దర్శనభాగ్యం అనుగ్రహించాడు

iBAT తాత్పర్యము

స్వామి కంఠసీమలో పద్మాలు, కువలయాలహారాలు అందాలు సంతరించుకొంటున్నాయి. వానిని సూర్యచంద్రులకిరణాలు మరింత దేదీప్యమానం చేస్తున్నాయి. కరములకు పెట్టుకొన్న కంకణాలు కాళ్ళకు పెట్టుకొన్న నూపురాలు మెడలో వేసుకొన్న సువర్ణతారహారాలు వ్రేళ్ళకు ధరించిన ఉంగరాలు, కర్ణములకు అలంకరించుకొన్న కుండలాలు, శిరస్సుపై అందాలు చిందిస్తున్న కిరీటము సృష్టినంతా వెలుగొందజేస్తు న్నాయి. మంగళదేవత విశాలవక్షఃస్థలంమీద దరహాసకాంతులతో విరాజిల్లుతున్నది. ఆమె నానుకొని కౌస్తుభమణి తొంగితొంగిచూస్తూ నన్ను కూడా కొంచెం గమనించండి అని వేడుకొంటున్నట్లున్నది. చెక్కిళ్ళ నుండి పొంగుకొని వస్తున్న కాంతిరేఖలు స్వామి మోమునుండి వెలువడు తున్న చిరునగవు కాంతులతో సరసాలాడుతున్నాయి. ఒకచేతిలో శంఖం, మరొకచేతిలో చక్రం, ఇంకొకచేతిలో గదా, వేరొకచేతిలో కమలం ఒదిగి ఉన్నాయి. విశాలమైన నెన్నుదురు మీద నిగనిగలాడుతూ ముంగురులు కదలాడుతున్నాయి. ఆ సోయగం చూడటానికి రెండుకన్నులు చాలవు. నీలమేఘశ్యామలమైన దేహం మీద పచ్చని పట్టుపుట్టం మెరిసిపోతున్నది. పెదవులమీదా, కన్నులలోను కృపాతరంగాలు దోబూచులాడుతున్నాయి. నాభిమండలాన్ని మనోహరమైన పద్మం అలంకరిస్తున్నది.
3-830 అయ్యవసరమున నాకాశమున దేవ... (సీసము).
iBAA పద్య గానం
iBAP పద్యము
అయ్యవసరమున నాకాశమున దేవ
  తూర్యఘోషంబులు దుములమయ్యె
నందిత దేవతా బృందంబు లందంద
  కురిసిరి మందారకుసుమవృష్టి
గంధర్వ కిన్నరగానంబు వీతెంచె
  నప్సరోగణముల యాట లొప్పె
వావిరి దిక్కులఁ గావిరి విరిసెను
  దవిలి వార్ధుల కలంకువలు మానె.

తేటగీతి

సాధుజనముల మనములు సంతసిల్లె
హెూమవహ్నులు ప్రభలఁ జెన్నొంది వెలిఁగె
గుసుమఫలభారముల నొప్పెఁ గుజములెల్ల
సర్వసస్యాళి చేనొప్పి జగతి యెల్ల.

iBAT సందర్భం

దేవహూతికి పరమానందం కలిగింది. పతి చెప్పిన విధానాన్ని పరమ శ్రద్ధతో ఆచరించింది. ఆ కొన్ని యేండ్లకాలం గడచి పోయింది. దానవాంతకుడైన దామోదరుడు కర్దముని తేజస్సుతో ఆమెగర్భంలోనికి ప్రవేశించాడు. శమీగర్భంనుండి వైశ్వానరుడు (అగ్నిదేవుడు) వెలువడినట్లుగా స్వామి అవతరించారు

iBAT తాత్పర్యము

ఆసమయంలో ఆకాశం దేవదుందుభులు మ్రోత చెలరేగింది. ఆనందంతో పారవశ్యం చెందిన దేవతలు గుంపులుకట్టి మందారపూల వానలు కురిశారు. గంధర్వులు, కిన్నరులు అద్భుతమైన ఆవేశంతోపాటు పాటలు పాడారు. అప్సరసలు ఆటలాడారు. దిక్కులందంతటా నీలి కాంతులు వెల్లివిరిశాయి. సముద్రాలు అలల ఆర్భాటాలు లేకుండా ప్రశాంతంగా ఉండిపోయాయి. ఉత్తమశీలంకల జనులందరూ సంతోషించారు. హెూమాగ్నులు మనో హరమైన కాంతులతో అలరారాయి. పండ్లతో పూవులతో వృక్షజాతులన్నీ బరువెక్కిపోయాయి. నేలతల్లి అన్ని పంటలతో కళకళలాడుతూ ప్రకాశించింది. దేవహూతికి పరమానందం కలిగింది. పతి చెప్పిన విధానాన్ని పరమశ్రద్ధతో ఆచరించింది. ఆ అర్చనలతో కొన్ని యేండ్లకాలం గడచి పోయింది. దానవాంతకుడైన దామోదరుడు. కర్దముని తేజస్సుతో ఆమెగర్భంలోనికి ప్రవేశించాడు. శమీగర్భంనుండి వైశ్వానరుడు (అగ్నిదేవుడు) వెలువడినట్లుగా స్వామి అవతరించాడు
3-913 దరదరవింద సుందరపత్ర రుచిరాక్షు... (సీసము).
iBAA పద్య గానం
iBAP పద్యము
దరదరవింద సుందరపత్ర రుచిరాక్షు
  సలలిత శ్రీవత్స కలితపక్షు
నీలనీరద నీల నీలోత్పలశ్యాము
  నళికులాకుల మాలికాభిరాముఁ
గౌస్తుభ కలిత ముక్తాహారయుతకంఠు
  యోగిమానస పంకజోపకంఠు
సతతప్రసన్న సస్మిత వదనాంభోజు
  దినకరకోటి సందీప్తతేజు

తేటగీతి

సలలితానర్ఘ రత్నకుండల కిరీట
హారకంకణ కటక కేయూర ముద్రి
కాతులాకోటిభూషు, భక్తప్రపోషుఁ
గింకిణీయుత మేఖలాకీర్ణ జఘను

iBAT సందర్భం

కపిలుడు తల్లికి చెప్పిన యోగవిద్యను గురించి తెలుపుతూ సాక్షాత్కరించే శ్రీమధ్యగాయలను రూపు రేఖలను వివరిస్తున్నాడు

iBAT తాత్పర్యము

ఆ భంగిమలో శ్రీమన్నారాయణుని దివ్యదర్శనం చేస్తూ ఉండాలి. ఆ స్వామి కొంచెంగా వికసిస్తున్న పద్మపత్రాలవంటి కన్నులతో పరమ సుందరంగా ఉంటారు. ఆయన రొమ్మపై శ్రీవత్సం అనే పుట్టుమచ్చ అలరారుతూ ఉంటుంది. నల్లని మబ్బుల, నల్లకలువలకాంతులన్నీ ఒక చోట రాశిపోసినట్టుగా ఉంటుంది ఆయన దేహం. ఆయన వేసుకొన్న పూలమాలలో తుమ్మెదలు పరవశించి తిరుగుతూ ఉంటాయి. కౌస్తుభం నాయకమణిగా ఉన్న ముత్యాలహారం మెడలో జాలువారుతూ ఉంటుంది. యోగిజనుల మనస్సు అనే తామరపూవులా ఉంటుంది ఆయన కంఠం, నిరంతరం చిరునవ్వు చిందులాడుతూ ఉంటుంది. ఆయన మోముదమ్మి వెలిగిపోతూ ఉంటుంది ఆయన తేజస్సు. రత్నకుండలాలూ, కిరీటము, హారాలూ, వలయాలు, ఉంగరాలు మొదలై నవి ఆ స్వామి దేహకాంతి నుండి అందచందాలను పెంపొందించుకొని మురిసిపోతూ ఉంటాయి. చిరుమువ్వల గలగలలతో ఒడ్డాణం నడుము ను అంటిపెట్టుకొని ఉంటుంది
3-915 ఇంకా ఆ మహాప్రభువు... (సీసము).
iBAA పద్య గానం
iBAP పద్యము
కంజాత కింజల్క పుంజరంజిత పీత
  కౌశేయవాసు జగన్నివాసు
శత్రుభీకర చక్రశంఖగదా పద్మ
  విహిత చతుర్బాహు విగతమోహు
సురభక్తలోక మనోనేత్ర వర్ధిష్ణు
  లాలితసద్గుణాలంకరిష్టు
వరకుమారక వయః పరిపాక
  సుశ్లోకు సుందరాకారు యశోవిహారు

తేటగీతి

సకలలోక నమసృత చరణకమలు
భక్తలోకపరిగ్రహ ప్రకటశీలు
దర్శనీయు మనోరథదాయిఁ గీర్త
నీయ తీర్ధయశోమహనీయ మూర్తి

iBAT సందర్భం

ఇంకా ఆ మహాప్రభువు

iBAT తాత్పర్యము

బంగారుకాంతులను విరజిమ్మే పట్టు పీతాంబరం తాల్చి ఉంటాడు. లోకాలన్నీ ఆయనలో ఉన్నవాడు. శత్రువులకు గుండెదడ పుట్టించే చక్రము, శంఖము, గద, పద్మము నాలుగు చేతులలో స్వామి యెప్పుడు తమ్ము అనుగ్రహిస్తాడో అన్నట్లుగా మెలకువతో ఉంటాయి. జీవులలో ఉండే ఏవిధమైన మోహమూ ఆ స్వామిలో కానరాదు. తన్ను కొనియాడే దేవతల మానవభక్తుల కన్నులను, మనస్సును సంతోషింపజేస్తూ ఉంటారు. సద్గుణమే ఆయనకు గొప్ప భూషణం. బాల్యం గడచిన తరువాతి కౌమార కమైన వయస్సు పరిపాకానికి వచ్చినట్లు ఉంటుంది ఆ స్వామిరూపం, పరమసుందరమైన ఆకారం, పరమఆదరణీయమైన యశస్సు, ఆయన పాదపద్మాలకు -నమస్కరిస్తూ సర్వలోకవాసులూ నెట్టుకొంటూ ఉంటారు. భక్తులను నిరంతరం తల్లి పిల్లలనువలె దగ్గరకు తీసుకుంటాడు. ఎంత చూచినా తనివి తీరదు. అందరి మనోరథాలూ తీరుస్తూ ఉంటాడు. ఆయన మహనీయమూర్తి సర్వదా కొనియాడదగినది. అది ఒక తీర్ధం.

చతుర్ధ స్కంధం

4-902 ఘనమేరుశృంగ సంగత నీలమేఘంబు... (సీసము).
iBAA పద్య గానం
iBAP పద్యము
ఘనమేరుశృంగ సంగత నీలమేఘంబు
  నెఱి గరుడస్కంధనివసితుండు
కమనీయనిజదేహకాంతి విపాటితా
  భీలాఖిలాశాంతరాళతముఁడు
సుమహితాస్టాయుధ సుమనోమునీశ్వర
  సేవకపరిజనసేవితుండు
మండిత కాంచనకుండలరుచిరోప
  లాలితవదనకపోతనుఁదు

తేటగీతి

జారునవరత్నదివ్యకోటీరధరుఁడుఁ
గౌస్తుభప్రవిలంబమంగళగళుందు
లలితపీతాంబర ప్రభాలంకృతుండు
హారకేయూరవలయమంజీరయుతుఁడు

iBAT సందర్భం

విదురమహాశయా! ప్రచేతసులు తండ్రి యాజ్ఞమేరకు సముద్ర గర్భంలో జపయజ్ఞంతో తపస్సు చేశారు. అది పదివేలయేండ్లు సాగింది. వారి తపస్సును గమనించి దయకు నిదానమైన అంతరంగం గలవాడూ, అభయం అనుగ్రహించేవాడూ, సనాతనుడూ అయిన అచ్యుతుడు తన దేహకాంతులతో వారి తపోవేదనలు శాంతి పొందే విధంగా చేస్తూ వారికి ప్రత్యక్షమయ్యాడు.

iBAT తాత్పర్యము

గరుత్మంతుని మూపుపై ఉన్న అస్వామి మేరుపర్వతం శిఖరాలమీద కదలాడుతున్న నీలమేఘంలా ఉన్నాడు. చూడముచ్చట అయిన దేహకాంతి దిక్కుల నడుమ నిక్కుతున్న చీకట్లను తుక్కుదూగరగా కొట్టివేస్తున్నది. గొప్పశక్తి సంపందగల ఎనిమిది ఆయుధాలు, దేవతలు, మహర్షులు, పరిజనులు స్వామిని సేవించుకొంటూ వెనుక నడిచి వస్తున్నారు. బంగారు కుండలముల కాంతులను మోముకాంతీ, చెక్కిళ్ళకాంతీ రెట్టింపు చేస్తున్నది. మనోజ్ఞమైన నవ రత్నాలు కూర్చిన దివ్యకిరీటం శిరస్సుమీద వెలిగిపోతున్నది. మెడలో కౌస్తుభమణిహారం వ్రేలాడుతూ ప్రకాశిస్తున్నది. కట్టిన పట్టుపుట్టం ప్రభలు పట్టశక్యం కాకుండా ఉన్నాయి. అనేకమైన భూషణాలు నిలువెల్లా అందచందాలను క్రుమ్మరిస్తున్నాయి.

పంచమ స్కంధం

5-43 అంత విషృత కాంత చతుర్భుజం... (సీసము).
iBAA పద్య గానం
iBAP పద్యము
అంత విషృత కాంత చతుర్భుజం
  బులును బీతాంబరంబును వెలుంగ
శ్రీవత్సకౌస్తుభశ్రీరమా చిహ్నంబు
  లురమందు రమ్యమై యిరవుపడఁగ
శంఖచక్రగదాంబుజాత ఖడ్గాదిది
  వ్యాయుధంబులు చేతులందు మెఱయ
నతులిత నవరత్న హాటకాంకిత నూత్న
  ఘనకిరీటద్యుతుల్ గడలుకొనఁగఁ

తేటగీతి

గర్ణకుండల కటిసూత్రకనకరత్న
హారకేయూర వర నూపురాది భూష
ణముల భూషితుఁడైన శ్రీనాయకుండు
దంపతుల కప్పుడెదురఁ బ్రత్యక్షమయ్యె.

iBAT సందర్భం

ఆగ్నీధ్రుని పెద్దకొడుకు నాభి సంతానంకోసం తన అంగనతో కలసి యజ్ఞపురుషుడైన వాసుదేవుని అతుల భక్తిశ్రద్ధలతో ఆరాధించాడు. ఇంకా అనేక యజ్ఞధర్మాలతో, శ్రద్ధ మొదలైన వాని యోగాలతో పరమేశ్వరుని మెప్పించాడు. సాధారణంగా అంత సులభంగా ప్రసన్నుడు రాని పుండరీకాక్షుడు భక్తవత్సలుడై మనోహరములైన అవయవాలతో అతని హృదయంలో పీటపెట్టుకొని కూర్చున్నవాడు తన రూపాన్ని అతనికి దృష్టి గోచరం చేయాలని సంకల్పించాడు

iBAT తాత్పర్యము

ఓహెూ! ఏమి ఆస్వామి దివ్యరూపం! లోకరక్షణకోసమే అప్పుడే పుట్టాయా అన్నట్టి నాలుగు భుజాలు బంగారువన్నె పట్టుపుట్టం, శ్రీవత్సం అనే పుట్టుమచ్చ, కౌస్తుభమనే దివ్యమణి, అమ్మవారు శ్రీమహాలక్ష్మి చక్కగా సద్దుకొని ఆ వక్షస్థలంమీద కదలాడుతున్నారు. శంఖము, చక్రము, గద, పద్మము, ఖడ్గము మొదలైన దివ్యాయుధాలు తమతో స్వామికి ఏక్షణంలో పనిపడుతుందో అని సర్వసన్నద్ధంగా అలరారుతున్నాయి. శిరసుపైని కిరీటం చూస్తే సృష్టిలో ఉన్న మిక్కిలి విలువగల రత్నాలన్నీ చక్కగా అమర్చిన సువర్ణమయమై అలరారుతున్నది. కర్ణములకు కాంతులను విరజిమ్ము తున్న కుండలాలు, నడుమున బంగారు మొలత్రాడు, కనకరత్నహారాలు కేయూరాది భూషణాలు, దివ్యంగా మెరిసిపోతున్నాయి. అటువంటి శ్రీ నాయకుడు ఆ దంపతుల కన్నులముందు ప్రత్యక్షమయ్యాడు.

షష్ఠ స్కంధం

6-218 భర్మాచలేంద్ర ప్రపాత ద్వయంబునఁ... (సీసము).
iBAA పద్య గానం
iBAP పద్యము
భర్మాచలేంద్ర ప్రపాత ద్వయంబునఁ
  గలిగిన నీలంపు గనులనంగ
మొనసి తార్ క్క్ష్యుని యిరుమూపు పైనిడినట్టి
  పదముల కాంతులు పరిఢవిల్లఁ
జండ దిఙ్మ్ండల శుండాలకరముల
  కైవడి నెనిమిది కరములమరఁ
జక్రకోదందాసిశంఖనందకపాశ
  చర్మగదాదుల సరవిఁ బూని

ఆటవెలది

నల్లమేను మెఱయనగు మొగంబలరంగఁ
జల్లచూపు విబుధసమితిఁ బ్రోవ
బసిఁడి కాసెఁ బూని బహుభూషణ కిరీట
కుండలములకాంతి మెండుకొనఁగ.

iBAT సందర్భం

తత్త్వమును నిర్ణయించి చూపే భావాలను ప్రోది చేసుకొని దక్షుడు పరమాత్మను స్తుతించాడు. అప్పుడు భక్తవత్సలుడైన పరమాత్మ దక్షునికి సాక్షాత్కరించాడు

iBAT తాత్పర్యము

అదేమిటి? ఓహో బంగారుకొండలా ఉంది. దానికి అటువైపు ఒకటి ఇటువైపు ఒకటీ రెండు జల పాతాలు తెల్లనికాంతులను విరజిమ్ముతూ జాలువారుతున్నాయి. కాదండీ! ఆ బంగారుకొండ గరుత్మంతుడు. రెండు జలపాతాలు ఇటూ ఇటూ చాపి కూర్చున్న స్వామిపాదాలు. ఓహోూ! ఎంత అద్భుత, ఆనందదాయకమైన దృశ్యం. అవేవో ఎనిమిది వస్తువులు చాలా గొప్ప తేజస్సుతో మెరిసిపోతున్నాయి. తేరిపారజూస్తే అవి స్వామి ఎనిమిది చేతులలో విరాజిల్లుతున్న సుదర్శనమనే చక్రము, శార్ ఙ్మమనే ధనుస్సు, వాడియైన బాణాలూ, నందకమనే ఖడ్గమూ, పాంచజన్యమనే శంఖమూ, పాశమూ, డాలూ. కామోదకి అనే గద - అనే ఆయుధాలుగా బుద్ధికి తెలియవస్తున్నాయి. నీలమేఘంవంటి దేహశోభతో అలరారు తున్నాడు. నవ్వుమొగంతో ఒప్పారుతున్నాడు. చల్లని చూపులతో తిలకిస్తున్నాడు. బంగారపు ఒడ్డాణం నడుముచుట్టూ బిగించుకొని కాంతిపుంజాలను పుక్కిలిస్తూ ఉన్నది. రత్నాలూ, వజ్రాలూ, వైడూర్యాలూ విక్షేపించిన కిరీటం వెలుగులను చిమ్ముతూ తలపై అలరారుతున్నది. కుండలాల కాంతి దిగంతాలవరకు వ్యాపిస్తూ ఉన్నది. ఆ విధంగా విరాజమానుడైన శ్రీమన్నారాయణమూర్తి దక్షునికి సాక్షాత్కరించాడు.
6-355 అర్ధంబు వేడెడు నర్థులు గలరుగా... (సీసము).
iBAA పద్య గానం
iBAP పద్యము
అర్ధంబు వేడెడు నర్థులు గలరుగా
  కంగంబు వేడెది యర్ధిఁ గలఁడె?
తగఁ గోరికల నిచ్చు దానశీలుఁడు కల్గుఁ
  దన దేహమీనేర్చు దాత కలఁడె?
యీనేర్చువాఁదు దన్నిచ్చిన రోయక
  చంపెడు నట్టి యాచకుఁదు గలఁడె?
చంపియుఁ బోవక శల్యంబులన్నియు
  నేరి పంచుకుపోవువారు గలరె?

ఆటవెలది

రమణ లోకమెల్ల రక్షించువారికి
హింససేయు బుద్ధి యెట్లు వొడమె?
బ్రాఁతియైన యట్టి ప్రాణంబుపైఁ దీపు
తమకుఁ బోలె నెదిరిఁ దలఁప వలదె?

iBAT సందర్భం

దేవతలు త్వష్టను అతని దేహాన్ని తమ ప్రయోజనం కోసం ఇవ్వమని అడుగగా ప్రతిజీవీ బ్రతికి ఉండాలి అనుకొంటాడు. అన్నింటికంటె అతి ప్రియమైనది దేహం. సాక్షాత్తు అచ్యుతుడే వచ్చి అర్థించినా తన దేహం ఇచ్చే దాత ఉంటాడా?

iBAT తాత్పర్యము

ధనాలూ, ధాన్యాలూ కోరే బిచ్చగాండ్రు ఉంటారు కానీ ఎక్కడైనా నీ దేహం ఇవ్వవయ్యా అని అడిగే యాచకుడు ఉంటాడా? ఒకవేళ అడిగితే మాత్రం తీసుకోండయ్యా అంటూ ఇచ్చే దాత ఉంటాడా? ఒకవేళ ఇస్తే మాత్రం దేహాన్ని చంపి పబ్బం గడుపుకొనే నీచులు ఉంటారా? పైగా అదేహంలోని ఎముకలు ఏరుకొనిపోయే కర్కశహృదయులు ఉంటారా నిజానికి మీరు దేవతలు. లోకాలన్నింటినీ రక్షించవలసిన కర్తవ్యం ఉన్న వారు. అట్టి మీకు హింసాత్మకమైన బుద్ధి ఎలా పుట్టింది? ఎవరైనా అడిగితే మీప్రాణాలు మీరు ఇవ్వగలరా? ప్రాణం ఎవరికైనా చాలా ఇష్టమైన వస్తువు కదా! ఎదుటివానిని మీవంటివాడే అన్నట్లు చూడగలిగిన బుద్ధి ఉండవద్దా? అని దధీచి దేవతలను కడిగి పారవేశాడు
6-441ఉత్వరఁగల రేణువులకన్న దట్టమై... (సీసము).
iBAA పద్య గానం
iBAP పద్యము
ఉత్వరఁగల రేణువులకన్న దట్టమై
  కడునొప్పు జీవసంఘములు గలవు.
ఆ జీవములలోన నరయ ధర్మాయత
  మతి వసించినవారు మనుజజాతి
ఆ మనుష్యులలోనఁ గామంబు బెడఁబాసి
  మోక్షార్థులగు వారు మొదలనరిది
మోక్షమార్గం బాత్మమూలంబుగా నుండు
  వారిలో ముక్తులు వేరుతఱచు

తేటగీతి

ముక్తులైనట్టివారిలో యుక్తిఁ దలఁప
జాల దుర్లభుఁ డమితప్రశాంతపరుఁడు
పరమసుజ్ఞాననిరతుండు భద్రగుణుఁడు
రమణ శ్రీవాసుదేవ పరాయణుందు.

iBAT సందర్భం

యోగివరేణ్యా! శుకమహామునీ! ఈ సందర్భంలో నా మనస్సులో ఒక ప్రశ్న కదలాడుతున్నది. వృత్రుడు పాపాత్ముడు అని తెలియవస్తున్నది. వాడు నిరంతరం రజస్తమోగుణాలు లోపలా వెలుపలా నింపుకొన్న నికృష్టుడు. అట్టివానికి మాధవపదభర్తీ ఎలా గలిగింది? సత్వగుణం నిలువెల్లా నిలుపుకొన్న సమబుద్దులకు కూడ ఇటువంటి విష్ణుభక్తి అలవడదంటారే?.

iBAT తాత్పర్యము

సృష్టిలో నేలమీద దుమ్ము కణాలెన్ని ఉన్నాయో అంతసంఖ్యలో ప్రాణి కోటి ఉన్నది. అందులో ధర్మాధర్మవివేకం ఒక్క మానవజాతికి మాత్రమే ఉన్నది. ఆ మనుష్యులలో కూడ పెద్దశాతంలో జనులు అర్థకామాల కోసమే అంగలారుస్తూ ఉంటారు. మోక్షం కోసం ప్రయత్నించేవారు చాలా తక్కువ. ఒకవేళ పూర్వజన్మ పుణ్యకర్మవిశేషంవలన మోక్షమార్గంలోనికి ప్రవేశించినా మోక్షసిద్ధిపొందేవారు చాలా దుర్లభంగా ఉంటారు. అందులోనూ విశిష్టంగా చెప్పుకోదగినవాడు శ్రీమన్నారాయణునియందు నిరంతర భక్తిభావన కలవాడు మాత్రమే. ఇట్టిస్థితిలో అసుర సంపదను అణువణువునా నింపుకొన్న వృత్రుడు శ్రీమన్నారాయణభక్తుడెలా అయినాడు?
6-467 తారహారపటీరధవళదేహమువాని ... (సీసము).
iBAA పద్య గానం
iBAP పద్యము
తారహారపటీరధవళదేహమువాని
  రమణీయ నీలాంబరంబువాని
మణికిరీటస్ఫురన్మస్తకంబులవాని
  కంకణకేయూరకరమువాని.
గర్భురమయదీప్తకటిసూత్రములవాని
  దరళయజ్ఞోపవీతములవాని
నతి సుప్రసన్న వక్త్రాంబుజంబులవాని
  దరుణ వివృత్తనేత్రములవాని

ఆటవెలది

సిద్ధమండలంబు సేవింపఁ బుణ్యప్ర
సిద్ధివెలసినట్టి యిద్ధచరితుఁ
బద్మలోచనునకుఁ బాదపీఠంబైన
ఘనునిఁ బన్నగేంద్రుఁ గాంచెనతఁదు.

iBAT సందర్భం

చిత్రకేతుడు నారదులవారు చెప్పినట్లుగా నిద్రాహారాదులు మాని వైచి సమాధిస్థితిని అలవరచుకొని నారాయణరూపమైన విద్యను ఏడు దినములు రాత్రి అనక, పగలనక పరమనిష్టతో జపించి, ఆహద్దు ముగిసిన వెంటనే విద్యాధరులనే ఒక దేవజాతివారికి అధిపతిగా పదవి పొందినాడు. చాలా గొప్ప మేలు జాతి వస్తువులతో ఏర్పడిన ఒక దివ్యవిమానం కూడా అతనికి లభించింది. దానితో అతడు మనోవేగంతో మూడులోకాలూ తిరుగుతున్నాడు.పిమ్మట కొన్నిదినాలకు -

iBAT తాత్పర్యము

ఆ చిత్రకేతునకు ఆదిశేషుని రూపంలో శ్రీమహావిష్ణుదర్శన భాగ్యం కలిగింది. నిలువెల్లా తెల్లనికాంతులు వెలిగిపోతున్నాయి. రమ ణీయమైన నీలవర్ణపు వస్త్రంతో అలరారుతున్నాడు. మణికిరీటాలు వేయి తలలపైనా ప్రకాశిస్తున్నాయి. కంకణాలూ, కేయూరాలూ చేతులందు వెలుగొందుతున్నాయి. వింతవింతకాంతులు విరజిమ్మే కటిసూత్రం (ఒడ్డాణం వంటిది) నడుమును చుట్టుకొని ఉన్నది. తెల్లనికాంతులతో జన్నిదం ఒప్పారుతున్నది. ముఖాలన్నీ పద్మములవలె ప్రసన్నంగా చూడముచ్చటగా ఉన్నాయి. చక్కగా కదలాడుతున్న కన్నులకాంతులు అందరినీ ఆకర్షిస్తున్నాయి. అటు వంటి ఆదిశేషభగవానుని దివ్యసాక్షాత్కారం లభించింది చిత్రకేతునకు.

సప్తమ స్కంధం

7-124 వైకుంఠచింతా చేష్టుఁడై... (సీసము).
iBAA పద్య గానం
iBAP పద్యము
వైకుంఠచింతా చేష్టుఁడై
  యొక్కఁడు నేడుచు నొక్కచోట
నశ్రాంతహరిభావనారూఢచిత్తుఁడై
  యుద్ధతుఁడై పాడు నొక్కచోట
విష్ణుఁడింతియ కాని వేరొండు లేదని
  యొత్తిలినగుచుండు నొక్కచోట
నలినాక్షుఁడను నిధానముఁ గంటి నేనని
  యుబ్బి గంతులు వైచు నొక్కచోటఁ

ఆటవెలది

బలుకు నొక్కచోటఁ బరమేశుఁ గేశవుఁ
బ్రణయ హర్షజనితబాష్పసలిల
మిళితవులకుఁడై నిమీలితనేత్రుఁడై
యొక్కచోట నిలిచి యూరకుండు.

iBAT సందర్భం

ప్రహ్లాదుని విష్ణుభక్తి తత్పరతను ధర్మరాజుకు నారదమహర్షి ఇంకా ఇలా వివరిస్తున్నారు.

iBAT తాత్పర్యము

ధర్మరాజా! ఆ పిల్లవానికి ఏ కారణంగా ఏ క్షణాననైనా విష్ణు భావన హృదయవీధిలో కదలాడకపోతే గుండె పగిలిపోయినంత దుఃఖం వచ్చేది. హరిభావన కదలాడినపుడు ఎగిరెగిరి గంతులు వేస్తూ పాట పాడుతూ పరవశించేవాడు. విష్ణుడంటే ఇంతేనయ్యా! అని పగలబడి నవ్వుతూ ఉండేవారు. పరమాత్మ ఆనంద స్వరూపుడని తెలియజేయటానికి అతనికి ఆ నవ్వు సంకేతం. నాకు పరమనిధానం (గొప్పనిధి) దొరికిందని పొంగిపోతూ గంతులు వేస్తూ ఉండేవాడు. ఒక్కొక్కమారు నేరుగా శ్రీమహావిష్ణువుతో మాటాడుతూ ఉండేవారు. అట్టి సందర్భాలలో ఆనందాన్ని తెలియజేసే పులకలూ ఆనందాశ్రువులూ మాత్రమే అతనికి దేహంమీద వస్తూ ఉండేవి.
7-160 అడుగడ్గునకు మాధవానుచింతన సుధా... (సీసము).
iBAA పద్య గానం
iBAP పద్యము
అడుగడ్గునకు మాధవానుచింతన సుధా
  మాధుర్యమున నేను మఱచువాని
సంభోజగర్భాదులభ్యసింపఁగ లేని
  హరిభక్తి పుంభావమైనవాని
మాతృగర్భము సొచ్చి మన్నది మొదలుగాఁ
  జిత్తమచ్యుతు మీఁదఁ జేర్చువాని
సంకించి తనలోన నఖిలప్రపంచంబు
  శ్రీవిష్ణుమయమని చెలఁగువాని

తేటగీతి

వినయకారుణ్యబుద్ధి వివేకలక్ష
ణాదిగుణముల కాటపట్టయినవాని
శిష్యు బుధలోకసంభావ్యుఁ జీరి గురుఁడు
ముందఱికి ద్రొబ్బి తండ్రికి మ్రొక్కుమనుచు.

iBAT సందర్భం

బాబూ! మేము చెప్పిన పాఠాలను నీభావాలకు అనుగుణంగా త్రిప్పుబోకు. మేము బోధించిన వానిని యథాతథంగా మీ తండ్రిగారికి అప్పగించు. మీతండ్రికి విరోధి అయినవాని నీతులను విప్పుకు. బాబ్బాబూ! మా పరువు దక్కించు. అని బుజ్జగించి బ్రతిమాలి చెప్పి మెల్లగా తండ్రి దగ్గరకు తీసు కొనిపోయాడు. ప్రహ్లాదుడు తనలోకంలో తానున్నారు.

iBAT తాత్పర్యము

పాపం శండాచార్యులవారు నిండైన నమ్మకంతో ఉన్నాడు. ప్రహ్లా దుడు తన శిక్షణలో తానాశించిన విధంగా తయారయ్యాడని. కాని ప్రహ్లాదుడు ‘తన’ దారి తనదిగా ఉండిపోయాడని గుర్తించలేక పోయాడు.

అడుగుతీసి అడుగు వేస్తున్న కొంచెంపాటి కాలంలోకూడా ఆ బాలుడు మాధవచింతన మానలేదు. అదే అతని పాలిటి అమృతమై ఒళ్ళు తెలియని స్థితికి తీసుకొనిపోతున్నది. బ్రహ్మదేవుడు మొదలైనవారికి కూడా అలవడని హరిభక్తి రూపం తాల్చిందా అన్నట్లున్నాడా పిల్లవాడు. పుట్టిన తరువాత పుట్టిన బుద్ధి కాదిది. తల్లికడుపున పడినప్పటినుంచీ అదియే ధోరణి. తనలోను, సర్వప్రపంచంలోను అణువణువునా నిండి యున్నది శ్రీమహావిష్ణువే అన్న నమ్మకాన్ని నిశ్చలంగా నిలుపుకొన్న మహాత్ముడు ఆ బాలుడు. అయితే లోకసామాన్యంగా ఉండవలసిన వినయము, భూతదయ, మంచిబుద్ధి, వివేకము మొదలైన గుణాలన్నీ అతనిలో సమృద్ధిగా ఉన్నాయి. మహామహాపండితులు కూడా అతని తీరుతెన్నులను సంభా విస్తూ ఉంటారు. అటువంటి ప్రహ్లాదుణ్ణి గురువు. రాక్షసరాజు ముందు నకు ‘త్రోసి’, తండ్రిగారికి మ్రొక్కు అని ఆదేశించాడు. మహారాజా! నీ కుమారుణ్ణి మేము సరియైన పద్ధతిలో తీర్చిదిద్దాము. ఇప్పుడతనిలో శత్రుపక్షం భావాలు లేవు. నీతిమార్గంలో ఆరితేరిన వాడయ్యాడు. అతని విద్యాబలం ఎలా ఉందో పరీక్షించి తెలుసుకో - అని విన్నవించుకున్నాడు.
7-291 పంచాననోద్భుత పావకజ్వాలల... (సీసము).
iBAA పద్య గానం
iBAP పద్యము
పంచాననోద్భుత పావకజ్వాలల
  భూనభోంతర మెల్లఁ బూరితముగ
దంష్ట్రాకురాభీల ధగధగాయితదీప్తి
  నసురేంద్రు నేత్రంబులంధములుగఁ
గంటక సన్నిభోత్కట కేసరాహతి
  నభ్రసంఘము భిన్నమై చరింపఁ
బ్రళయాభ్రచంచలాప్రతిమభాస్వరములై
  ఖరనఖరోచులు గ్రమ్ముదేర

తేటగీతి

సటలు జళిపించి గర్జించి సంభ్రమించి
దృష్టి సారించి బొమలు బంధించి తెరలి
జిహ్వయాడించి లంఘించి చేత నొడిసి
పట్టె నరసింహుఁడా దితిపట్టి నధిప!

iBAT సందర్భం

నరసింహస్వామి పామును ఒడిసిపట్టుకొన్న గరుత్మం తునిలాగా హిరణ్యకశివుని చేజిక్కించుకొన్నాడు. వాడు సందు చూచుకొని జారిపోవటానికి ప్రయత్నించాడు. స్వామి వానికా అవకాశం ఇవ్వలేదు. మహారణ్యంలో సింహం లేడిని తరిమి తరిమి కొట్టి పట్టినట్లు రక్కసుణ్ణి చేతులలో ఇరికించుకొన్నాడు

iBAT తాత్పర్యము

పెద్దగా తెరచిన నోటినుండి దూసుకొని వస్తున్న అగ్నిజ్వాలలు మంటినీ మింటినీ క్రమ్మివేశాయి. కోరల చివళ్ళనుండి భయంకరంగా వెలువడుతున్న ధగధగలాడే కాంతులతో హిరణ్యకశివుని కన్నులు గ్రుడ్డివైపోయాయి. ముళ్ళలాగా పొడుచుకొని వస్తున్న స్వామి ఒడలిమీది వెంట్రుకల తాకిడికి గగనంలోని మేఘాలు చీలిపోతున్నాయి. ప్రళయ కాలపు మేఘాల మెరుపులలాగా గోళ్ళకాంతులు తళతళలాడుతున్నాయి. స్వామి జూలు విదిలిస్తున్నారు. గాండ్రిస్తున్నారు. చూపులతో రక్కసుని గ్రుచ్చివేస్తున్నారు. బొమముడిని బిగిస్తున్నారు. నాలుకను ఆడిస్తున్నారు. ఒక్కదూకు దూకి రక్కసుని చేతితో ఒడిసి పట్టుకొన్నారు.
7-297 వక్షః కవాటంబు ప్రక్కలు సేయుచో... (సీసము).
iBAA పద్య గానం
iBAP పద్యము
వక్షః కవాటంబు ప్రక్కలు సేయుచో
  ఘనకుఠారంబున కరణి నొప్పు
గంభీరహృదయపంకజము భేదించుచోఁ
  గుద్దాలములభంగి కొమరు మిగులు
ధమనీవితానంబుఁ దగిలి ఖండించుచోఁ
  బుటులవిత్రంబులు పగిది మెరియు
జఠరవిశాలాంత్రజాలంబుఁ ద్రెంచుచోఁ
  గ్రకచ సంఘంబుల గరిమఁ జూపు;

తేటగీతి

నంకగతుఁడైన దైత్యుని నాగ్రహమున
శస్త్రచయముల నొంపక సంహరించి
యమరు నరసింహు నఖరంబులతివిచిత్ర
సమరముఖరంబులై యుండె జనవరేణ్య!

iBAT సందర్భం

నరసింహస్వామి రక్యసుని గుండెను చీల్చివేశాడు. నెత్తురు టేకులు పాలించారు. ఒకపట్టాన త్రెంచటానికి వీలుకాని నాడీమండలాన్ని త్రెంచి పోగులు పెట్టాడు. విశాలమైన రొమ్మును ముక్కలు ముక్కలు చేశారు. మాంసాన్ని తుక్కుదూగరగా కొట్టాడు. ప్రేగులను మెడలో హారాలుగా వేసుకొన్నాడు. గోళ్ళు పదునైన ఆయుధాలుగా తళతళలాడుతూ కన్పిస్తున్నాయి

iBAT తాత్పర్యము

రాజా! శ్రీనరసింహస్వామి పదునైన గోళ్ళు విశాలమైన రొమ్మును చీల్చే సమయంలో పెద్దగొడ్డళ్ళలాగా ప్రకాశించాయి. లోపల ఎక్కడో ఉన్న గుండెను పగులగొట్టేటప్పుడు వాడితేరిన గునపాలలాగా అయ్యాయి. రక్త నాళాలను ముక్కలు చేసేటప్పుడు వేటకొడవళ్ళవలె కన్పట్టినాయి. కడుపులో ఉండే ప్రేగులను చీలికలు చేసే సమయంలో ఱంపాలలాగా పనిచేశాయి. ఒడిలో ఉన్న రక్కసుని చంపటానికి వేరే ఆయుధాలేమీ గ్రహింపలేదు స్వామి. అన్ని ఆయుధాలూ చేసే అన్ని విధాలైన పనులను గోళ్ళే సర్వసమర్ధంగా చేసివేశాయి.
7-367 నీ గృహాంగణభూమి నిటలంబు మోవంగ... (సీసము).
iBAA పద్య గానం
iBAP పద్యము
నీ గృహాంగణభూమి నిటలంబు మోవంగ
  మోదించి నిత్యంబు మ్రొక్కఁడేని
నీమంగళస్తవనికరవర్ణంబులు
  పలుమాఱు నాలుకఁ బలుకఁదడేని
నీయధీనములుగా నిఖిల కృత్యంబులు
  ప్రియభావమున సమర్పింపఁడేని
నీవదాంబుజముల నిర్మలహృదయుఁడై
  చింతించి మక్కువఁ జిక్కఁడేని

ఆటవెలది

నిన్నుఁ జెవులార వినఁడేని నీకు సేవ
సేయరాఁడేని బ్రహ్మంబుఁ జెందఁగలఁడె
యోగియైనఁ దపోవ్రతయోగియైన
వేదియైన మహాతత్వవేదియైన.

iBAT సందర్భం

ఈ తత్త్వం తెలిసిన విద్వాంసులు చిత్తశుద్ధికోసం మొదట వేదాధ్యయనం చేయటం, యజ్ఞయాగాదులు చేయటం మొదలైన మహా కార్యాలను అవలంబించినా తత్త్వం తెలిసిన తరువాత ఆ అన్నింటినీ మానివేసి వేదాంతం విస్పష్టంగా తెలియజేసే నీ తత్వాన్ని మాత్రమే పట్టుకొని నిన్ను అందుకొంటారు. అని ప్రహ్లాదుడు స్వామిని ప్రార్ధిస్తున్నారు

iBAT తాత్పర్యము

స్వామీ! అతడు నిజమైన భక్తుడైతే నీమందిరంముందు నొసలు నేలకు ఆనునట్లుగా చేసి సంతోషంతో పొంగిపోతూ మ్రొక్కుతూ ఉండాలి. అలాగే మంగళమైన నీ స్తుతులకు సంబంధించిన అక్షరాలను నోరు నొప్పి పుట్టినా మానకుండా నాలుకతో పలుకుతూ ఉండాలి. ఏపని చేయటానికి పూనుకొన్నా అది నీకోసమే అనే భావంతో చేసి ఫలితాన్ని నీకు సమర్పించుకోవాలి. నీ పాదపద్మాలను, నిర్మలహృదయంతో భావిస్తూ మక్కువతో నీకు వశుడై పోవాలి. చెవులారా నిన్ను గురించియే వింటూ ఉండాలి. సేవ నీకే చెయ్యాలి. అలా కాకపోతే అతడు యోగి అయినా తపస్సు, వ్రతము మొదలయినవానిని అంటిపెట్టుకొని ఉండేవాడయినా, లోకతత్వం తెలిసినవాడైనా, మహాతత్త్వం నాకు తెలిసిపోయింది అనుకొనే వాడైనా బ్రహ్మముతో ఒక్కటిగా అయిపోలేడు.

కనుక, పరమపురుషా! నాకు నీ దాస్యమును అనుగ్రహించు. అని ప్రహ్లాదుడు స్వామికి నివేదించుకొన్నాడు.
7-432 భూమి సుద్యోగియై భోగియై యుండెడి... (సీసము).
iBAA పద్య గానం
iBAP పద్యము
భూమి సుద్యోగియై భోగియై యుండెడి
  నరుని కైవడి, మునినాథ నీవు
ఘనశరీరము దాల్చి కదలవు చిత్రము
  ద్యుమహుక్తునకుఁ గాని ధనము లేదు
ధనవంతుడుకుఁ గాని తగు భోగములు లేవు
  భోగికిఁగాని సంపూర్ణమైన
తనువులే దుద్యోగధనభోగములులేక
  నేల నూరకవడి నిద్రవోపు

ఆటవెలది

నీకు నెట్లు గలిగె నిరుపమదేహంబు
సముఁడ వార్యుఁడవు విశారదుఁడపు
బుద్ధినిధిని జనులఁ బొగడపు దెగడవు
నిద్రప్రతిదినంబు నిలుపనేల?

iBAT సందర్భం

ప్రహ్లాదుడు అజగరవ్రతంలో ఉన్న మునిని చూచి దగ్గరకు వెళ్ళి యథావిధిగా పూజించి ఆయన పాదాలకు తనతల ఆన్చి మెల్లగా అతని తత్వం తెలుసుకోగోరి యిలా పలికారు.

iBAT తాత్పర్యము

మహాత్మా! గొప్పప్రయత్నంతో లప్పలుగా డబ్బు సంపాదించి భోగాలనుభవించే వ్యక్తిగా పైకి కన్పిస్తున్నావు. నీదేహం చాలా పెద్దగా ఉన్నది. అయినా నీలో కదలికలజాడలు ఏమాత్రమూ లేవు. ఇది చాలా ఆశ్చర్యం. ఏదో ఒక పెద్ద పూనికతో పనిచేస్తే కానీ ధనం కలుగదు. ధనం చాలా ఎక్కువగా ఉంటే కానీ భోగాలు కలుగవు. భోగాలు బాగా పొందే వారికి మాత్రమే నిండైన దేహం ఉండదు. నిన్ను చూస్తే ఉద్యోగమూ, ధనమూ, భోగాలూ ఉన్న జాలు ఏమాత్రమూ కనబడటం లేదు. అట్టినీకు ఇట్టి పెద్దదేహం ఎలా కలిగింది? పైగా నీవు అందరి విషయంలో సమవృత్తితో ఉంటావు. అందరూ నిన్ను పూజ్యభావంతో చూస్తారు. గొప్ప వివేకసంపద కలవాడనై ఉన్నావు. ఎవరినీ పొగడవు, తెగడవు. ఎప్పుడూ నిద్రలోనే మునిగి ఉంటావు. ఇదేమిటి?
7-434 ఆంతరంగకదృష్టి నంతయు నెఱుఁగుదు... (సీసము).
iBAA పద్య గానం
iBAP పద్యము
ఆంతరంగకదృష్టి నంతయు నెఱుఁగుదు
  వార్యసమ్మతుఁడ వీవసురవర్య!
విశ్వజంతువుల ప్రవృత్తినివృత్తిఁల
  క్షణముల నీయెఱుంగనివి లేవు
భగవంతుఁడగు పరిపాయక నీమనో
  వీథి రాజిల్లుచు వెలుఁగుఱేని
క్రమమున బహుళాంధకారంబుఁ బరిమార్చుఁ
  బరమసాత్త్వికుఁడవు భద్రబుద్ధి

ఆటవెలది

వైన నీవు నన్ను నడిగెదు గావున
విన్న ధర్మమెల్ల విస్తరింతు
నిన్నుఁజూడఁ గలిగె నీతోడిమాటల
నాత్మశుద్ధి గలిగె ననఘచరిత.

iBAT సందర్భం

అజగర వ్రతంలో ఉన్న ఆమునివరేణ్యుడు ఆ మాటలన్నీ చర్యగా విన్నాడు. మెల్లమెల్లగా సమాధిస్థితినుండి లౌకికస్థితికి తన దేహేంద్రియాలను తెచ్చుకొన్నాడు. దానివలన మొట్టమొదటగా మోములో చూడముచ్చట అయిన వెలుగు రేఖలు విప్పారినాయి. ఆరాజు వాక్కులనే అమృతధారలతో చెవులు నిండిపోయాయి. కన్నులు విప్పారజేసి అతనిని చూచి మెల్లగా ఇలా అన్నాడు

iBAT తాత్పర్యము

అయ్యా! అసురవర్యా! నీహృదయంలో అన్నివిషయాలూ క్షుణ్ణంగా ఎరిగినవాడవు. విశ్వంలో ఉన్న అన్ని ప్రాణుల ప్రవృత్తులు, నివృత్తులూ వాని లక్షణాలూ నీకు తెలియనివి లేవు. భగవంతుడు నిన్ను విడచి ఒక్క క్షణమైనా ఉండదు. నీ హృదయమనే ఆలయంలో సూర్య భగవానునిలాగా నిరంతరమూ వెలుగుతూ, కాఱుచీకట్లను రూపు మాపుతూ ఉంటాడు. పరమసత్వగుణం ఆకారం ధరించిందన్నట్లుగా ఉంటావు, భద్రమైన బుద్ధి కలవాడవు. అన్నీ తెలిసికూడా మర్యాదకు నన్ను అడుగుతున్నావు. కాబట్టి నేను విన్న ధర్మాన్ని మొత్తంగా తెలియజేయటం నాధర్మం. నేను నిన్ను చూడగలిగినందులకు, నీతో మాటాడ గలిగినందులకు ఎంతో ఆనందం కలుగుతున్నది. పుణ్యాత్మా! నాకు ఆత్మశుద్ధి కలిగింది.

అష్టమ స్కంధం

8-10 సృష్టిచే నెవ్వఁడు చేతనపడకుండ... (సీసము).
iBAA పద్య గానం
iBAP పద్యము
సృష్టిచే నెవ్వఁడు చేతనపడకుండ
  సృష్టి యెవ్వనిచేతనే జనించు
జగములు నిద్రింప జాగరూకత నొంది
  యెవ్వండు బ్రహ్మాండమెఱుఁగుచుండు
నాత్మకాధారంబు నఖిలంబు నెవ్వఁడే
  నెవ్వనినిజధనం బింతపట్టుఁ
బొడగాన రాకుండ బొడఁగను నెవ్వఁడే
  నెవ్వని దృష్టికి నెదురులేదు

ఆటవెలది

జననవృద్ధివిలయసంగతిఁ జెందక
యెవ్వఁడెడపకుండు నెల్లయెడలఁ
దనమహత్వసంజ్ఞఁ దత్త్వమెవ్వఁడు దాన
విశ్వరూపుఁడనఁగ విస్తరిల్లు.

iBAT సందర్భం

శతరూప పతి అయిన స్వాయంభువునకు కానుభోగాలయందు విరక్తి కలిగింది. అడవులకు వెళ్ళ నూరేండ్లు సునందానదీతీరంలో ఒంటి కాలిమీద నిలిచిఉండి శరీచేష్టలను, వాక్కుల వికారాలను సాగకుండా నిలువరించి దోషాలన్నింటినీ విడనాడి తపస్సు చేశాడు. ఆ తపస్సు మహిమను లోకాలన్నీ గమనించి కీర్తించాయి. అలా తపస్సు చేస్తూ అతడు మనస్సులో ఇలా సంభావించారు.

iBAT తాత్పర్యము

ఆ మహాత్ముడు తన సృష్టికి తానే కారణం. సృష్టి అంతటికీ ఆయనయే కారణం. లోకాలన్నీ నిద్రపోయి ఉన్నప్పుడు ఆయన మేల్కొని ఉండి బ్రహ్మాండాన్నంతటినీ గమనిస్తూ ఉంటారు. సమస్తమైన ఆత్మకూ ఆయనయే ఆధారం. ఆయన ధనసంపత్తి యెంత అని ఎవ్వడూ తెలుసుకోలేడు. ఆయన చూపునకు ఎదురు అణువంత కూడా లేదు. పుట్టటం, వృద్ధిచెందటం, లయంకావటం అనే వికారాలు ఆయనకు ఎప్పుడూ లేవు, విశ్వమంతా వ్యాపించి ఉన్న వాడా మహాత్ముడు. అట్టి తన మహత్వంతో ఆ స్వామిని తత్త్వజ్ఞులు విశ్వరూపుడని వ్యవహరిస్తూ ఉంటారు.
8-78 భవము దోషంబు రూపంబు కర్మంబు నా... (సీసము).
iBAA పద్య గానం
iBAP పద్యము
భవము దోషంబు రూపంబు కర్మంబు నా
  హృయమును గుణము లెవ్వనికి లేక
జగములఁ గలిగించు సమయించు కొరకునై
  నిజమాయ నెవ్వఁడిన్నియును దాల్చు
నాపరేశునికి ననంతశక్తికి బ్రహ్మ
  కిద్ధరూపికి గూపహీనునకును
జిత్రకారునికి సాక్షికి నాత్మరుచికినిఁ
  బరమాత్మునకుఁ బరబ్రహ్మమునకు

ఆటవెలది

మాటల నెఱుకల మనములఁ జేరంగఁ
గాని శుచికి సత్త్వగమ్యుం డగుచు
నిపుణుఁడైన వాని నిష్కర్మతకు మెచ్చు
వానికే నొనర్తు వందనములు.

iBAT సందర్భం

స్వామీ! నిన్ను తెలుసుకోవాలంటే ముందు భౌతికవిషయాలమీది తగులాన్ని తగులబెట్టాలి. మౌనవ్రతాన్ని పాటించాలి. నిన్ను చూడాలనే గాఢమైన కోరిక ఉంటే సర్వతములయందూ హితబుద్ధి ఉండాలి. పరమ సాధువైన చిత్తాన్ని సర్వప్రయత్నాలలో సాధించాలి. సాటిలేని వ్రతచరణతో అందరూ కొనియాడే సద్గతిని సమ కూర్చుకోవాలి. ఇట్టి శీలంతో ఎవని దివ్యపదాన్ని సేవిస్తారో అట్టి మహాత్ముడు నాకు దిక్కు అని గజేంద్రుడు పరమాత్మను వేడుకొంటున్నాడు

iBAT తాత్పర్యము

స్వామీ! నీకు పుట్టటం, తెలిసియో తెలియకయో ఏదో కానిపని చేయటం, రూపం, కర్మము, పేరు, గుణాలూ అనేవి లేనే లేవు. కానీ జగత్తును సృష్టించటానికి, రూపుమాపటానికి అవసరమైన నామరూపాదులను నీమాయతోనే చేసికొని ఈ అన్నింటినీ పొందుతూ ఉంటావు. అటువంటి అనంతమైన శక్తిగల, పరతత్త్వమైన బ్రహ్మమునకు నీకు నా నమస్కారములు. ఒకవేళ నీవు ఏదైనా రూపం ధరిస్తే అది కన్నులు పట్టుకోలేనంత దివ్యకాంతితో విరాజిల్లుతూ ఉంటుంది. ఎందుకంటే అనంతమైన శక్తితో అలరారుతూ ఉండేది కదా! దానిని ఆసరాగా తీసు కొని నిన్ను చూడాలనుకొంటే అది గగనమే అయిపోతుంది. ఇటువంటి చిత్రాలు చాలా నీవు చేస్తూ ఉంటావు. సాక్షిమాత్రంగా ఉండేవాడవని నిన్ను తెలుసుకోవాలి. నీకాంతిని పోల్చి చెప్పటానికి వీలైన మరొక వస్తువు సృష్టిలో లేదు. నీవు పరమాత్మవు. పరబ్రహ్మమవు. మాటలు కానీ మనస్సుకానీ నిన్ను చేరుకోలేవు. మౌనమూ, సద్బుద్ధీ మాత్రమే నిన్ను అందుకోవటానికి సాధనాలు. ఉపనిషద్విజ్ఞానం నిన్ను ‘శుచి’ అంటున్నది. శుచి అంటే అగ్ని. నీవు అగ్నివై అన్నిటినీ అందరినీ పవిత్రం చేస్తావు. రజస్సు, తమస్సు అనే గుణాల స్పర్శకూడా లేని సత్త్వం పంటకు వస్తే నిన్ను తెలిసికోవటం సాధ్యమౌతుంది. నేర్పుతో నిండిన సాధన సంపత్తితో నిష్కర్మతను సాధించినవానికి నీనిండైన అనుగ్రహం లభిస్తుంది. (నిష్కర్మత అంటే ఏ ఫలాన్నీ కోరకుండా, ఏదైనా ఫలం కలిగినా దానిని బ్రహ్మార్పణబుద్ధితో, కర్మములను ఆచరించటం). అట్టి పరమాత్మకు నీకు వందలకొలదిగా వందనాలు.
8-79 శాంతున కపవర్గ సౌఖ్యసంవేదికి... (సీసము).
iBAA పద్య గానం
iBAP పద్యము
శాంతున కపవర్గ సౌఖ్యసంవేదికి
  నిర్వాణభర్తకు నిర్విశేషు
నకు ఘోరునకు, గూఢునకు గుణధర్మికి
  సొమ్యున కధిక విజ్ఞానమయున
కఖిలేంద్రియద్రష్ట కధ్యక్షునకు
  బహు క్షేత్రజ్ఞునకు దయాసింధుమతికి
మూలప్రకృతి కాత్మమూలునకు జితేంద్రి
  యజ్ఞపకునకు దుఃఖాంతకృతికి

ఆటవెలది

నెఱి నసత్యమనెడి నీడతో వెలుఁగుచు
నుండు నెక్కటికి మహెుత్తమునకు
నిఖిలకారణునకు, నిష్కారణునకు న
మస్కరింతు నన్ను మనుచుకొఱకు.

iBAT సందర్భం

ఇంకా ఆర్తి తీరక గజేంద్రుడు పరమాత్మ లక్షణాలను ఏకరువు పెడుకున్నాడు

iBAT తాత్పర్యము

స్వామీ! నీవు శాంతుడవు. అంటే ఎట్టి పరిస్థితులలో ఎట్టి ఉద్వేగాలకూ లోనుకానివాడవు. మోక్షానందం గుట్టుమట్టులన్నీ నీకు మాత్రమే సమగ్రంగా తెలియును. నిర్వాణమును పట్టి నిలిపే సామర్థ్యం నీరు మాత్రమే ఉన్నది. (నిర్వాణమంటే దుఖం మొదలైన చెడులక్షణాలు తొలగిపోయే స్థితి). నీవు ఏవిశేషములు లేనివాడవు. అనగా అందరి యందూ, అన్నిటియందూ ఒకేవిధంగా ఉండే తత్త్వానివి. ఒక్కొక్కమారు నిలువెల్లా రజోగుణంతో నిండి ఉన్న కారణంగా ప్రాణికోటికి వెరపు కలిగించే విధంగా ఉంటావు. అప్పటి నీవ్యవహారం ఘోరంగా ఉంటుంది. అందువలన ఘోరుడవు, గూఢుడవు గుట్టుగా -ఎవరికీ తెలియరాకుండా ప్రాణుల హృదయగుహలలో ఉండే అంతర్యామివి. గుణధర్మివి - సత్వము, రజస్సు, తమస్సు అనే గుణాల ధర్మాలు నిన్నాశ్రయించి ఉంటాయి. కానీ వానికి నీవు లోబడి ఉండవు. సౌమ్యుడవు - పరమసుందరస్వరూపం కలవా డవు. అధికవిజ్ఞానమయుడవు సృష్టిలోని శిల్పశాస్త్రాల వికాసం అంతా నీలోనే నిండి ఉన్నది. అఖిల - ఇంద్రియాద్రష్టను కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మము అనే అన్ని యింద్రియాలు నీదర్శనం వలననే కదలుతూ మెదలుతూ ఉంటాయి. అధ్యక్షుడవు - సృష్టిలోని క్షేత్రాలనబడే సర్వశరీరా లలో ఉండి వాని తత్త్వాలను తెలిసి ప్రవర్తించేవాడవు. దయాసింధుమతివి- సర్వప్రాణికోటియందూ ప్రవర్తించే దయ అనే సముద్రం నీ బుద్ధిలో కదలాడుతూ ఉంటుంది. మూల ప్రకృతివి - ఆకాశం మొదలైన అయిదు భూతాలూ ఎందులో నుండి వెలువడినవో అదియే నీ మూలతత్వం. ఆత్మమూలుడవు - ఆత్మతత్త్వానికి ఆధారం అయినవాడవు, అఖిల ఇంద్రియ జ్ఞాపకుడవు- ఇంద్రియాలన్నీ ఓహెూ మేము చేయవలసిన పనులు ఇవి కాబోలు అని నీవలననే గుర్తిస్తాయి. దుఃఖఅంతకృతి- సర్వ ప్రాణుల దుఃఖాలను అంతం చేసేవాడవు. అసత్యమనే నేడతో ప్రకాశిస్తూ మాయ అనే ముసుగులో జనులను ఉంఛి వెలుగొందుతూ ఒక్కడవై ఉండే వాదవు, మహోత్తరుడవు – దేవాధిపతులకంటె గొప్ప మహిమ కలవాడవు, సర్వమునకు కారణమైనవాడవు, నీకు మాత్రము ఏ కారణమూ లేదు – అట్టి నిన్ను, నన్ను కాపాడటం కోసం నమస్కరిస్తాను.
8-81 సర్వాగమామ్నాయజలధికి... (సీసము).
iBAA పద్య గానం
iBAP పద్యము
సర్వాగమామ్నాయజలధికి
  నవవర్ణమయునికి నుత్తమమందిరునకు
సకలగుణారణిచ్ఛన్నబోధాగ్నికిఁ
  దనయంత రాజిల్లు ధన్యమతికి
గుణలయోద్దీపిత గురుమానసునకు సం
  వర్తిత కర్మనిర్వర్తితునకు
దిశలేని నాబోటి పశువుల పాపంబు
  లడఁచువానికి సమస్తాంతరాత్ముఁ

ఆటవెలది

డై వెలుంగువాని కచ్ఛిన్నునకు భగ
వంతునకుఁ దనూజపశునివేశ
దారసక్తులయిన వారి కందగఁరాని
వాని కాచరింతు వందనములు

iBAT సందర్భం

స్వామీ! నిన్ను సరిగా తెలియటానికి పెద్ద అడ్డుగోడగా కర్మమార్గం అనేది ఒకటి ఉన్నది. దాని రూపుమాపటానికి సాధ్యమైనది యోగ మార్గం ఒక్కటే. అట్టి వారిని ఆశ్రయించి కర్మలవలన సిద్దించే సంసారాన్ని కాల్చి పారవేసుకోగలిగే మహాత్ములు యోగులలో సర్వశ్రేష్ఠులు. ఆయోగ సిద్ధి పొందినపుడు వారి మనములు సత్పదార్థంతో, నీవే అయిన సత్, చిత్, ఆనంద లక్షణాలతో, మనస్సును మహోదాత్తంగా ప్రకాశించేదిగా చేసుకొని నిన్ను దర్శిస్తారు. అట్టి పరమాత్మను నిన్ను భజిస్తాను

iBAT తాత్పర్యము

పరమాత్మా! నీవు అన్ని ఆగమశాస్త్రాలకూ, వేదాలకూ సముద్రమైన వాడవు. మోక్షపురూపుడవు. ఉత్తములహృదయాలే నీకు మందిరం, కట్టెలలో తెలియరాకుండా గుట్టుగా ఉండే అగ్నిలాగా జ్ఞానమనే అగ్ని నీలో దాగి ఉంటుంది. లోకంలో సర్వవస్తువులూ వ్యక్తులూ ఎవరిమీదనో, దేనిమీదనో ఆధారపడి జీవిస్తూ ఉంటాయి. అట్టి దేని అవసరమూ లేకుండా స్వయంగా నిలువగల మహాశక్తిసంపద నీకు ఉన్నది. సత్త్వము, రజస్సు, తమస్సు అనే మూడు గుణాలూ లయమైపోతే అప్పుడు నీగొప్ప దైన భావన జాజ్వల్యమానంగా వెలుగుతుంది. కర్మమార్గంనుండి దాటు కొనగల మహాత్ములలో నీవు మెలగుతూ ఉంటావు. దిక్కులేని నావంటి కర్మపాశంలో చిక్కుకొన్న పశువుల పాపాలను రూపుమాపు జాలిగుండె కలవాడవు. జీవులందరి గుండె గుడులలో అరనిదీపమై ఒప్పారే పరం జ్యోతిఃస్వరూపుడవు. ఏవిధమైన వికారములూ లేకుండా ఏకమైన ఆకారంతో సర్వ కాలాలలో సర్వదేశాలలో ప్రకాశించే భగవంతుడవు. ఇల్లూ, ఇల్లాలూ, పిల్లలూ, కొంపా గోడూ అనే బంధాలలో చిక్కుకొన్న వారు ఎన్నటికీ నున్ను తెలుసుకోలేరు. అట్టి నీకు నేను నమస్కరిస్తూ ఉంటాను.
8-83 పరధర్మకామార్థవర్జితకాములై... (సీసము).
iBAA పద్య గానం
iBAP పద్యము
పరధర్మకామార్థవర్జితకాములై
  విబుధులెవ్వానిసేవించి యిష్ట
గతిఁ బొందుదురు, చేరి కాంక్షించువారి క
  వ్యయదేహ మిచ్చు నెవ్వాఁడు కరుణ
ముక్తాత్ములెవ్వని మునుకొని చింతింతు,
  రానంద వార్ధి మగ్నాంతరంగు
లేకాంతు లెవ్వని నేమియుఁ గోరక
  భద్రచరిత్రంబుఁ బాడుచుందు,

ఆటవెలది

రామహేశు నాద్యు నవ్యక్తు నధ్యాత్మ
యోగగమ్యూఁ బూర్ణు నున్నతాత్ము
బ్రహ్మమైనవానిఁ బరుని నతీంద్రియు
నీకు స్థూలు సూక్ష్ము నే భజింతు.

iBAT సందర్భం

పద్భక్తుల లక్షణాలను, వారిని అనుగ్రహించే స్వామి కరుణను పేర్కొంటున్నాడు గజేంద్రుడు

iBAT తాత్పర్యము

సరియైన భగవద్ జ్ఞానసంపదగలవారు ధర్మము, అర్ధము, కామము అను పురుషార్ధాలమీద చూపు పెట్టరు. ఆ పరమాత్ముని ఒక్కనినే సేవించి కోరిన, కోరదగిన, మహాపురుషార్థాన్ని పొందుతారు. ఒకవేళ ఏదైనా కోరి ఆ మహాత్ముని సేవించే వారి కోరికకు తగిన అవ్యయమైన దేహాన్ని అనుగ్రహిస్తాడు. (అవ్యయ దేహమంటే భగవంతునితో ఒక్కటి యగుటయే). మనస్సు త్రిప్పులను ఆపివైచి దానిని ఆ పరమాత్మునందు లగ్నం చేస్తే అట్టివారికి ఆ స్వామి పరిపూర్ణమైన ఆనందమనే అమృతసముద్రంలో మునిగే అంతరంగాన్ని ప్రసాదిస్తాడు. ఇంకా గొప్ప వివేకకథనం కూర్చుకొన్న మహానుభావులు ఏమీ కోరరు. నిష్కారణంగానే హరిభజనం చేస్తూ ఉంటారు. నారాయణుడు అట్టివాడు. ఆద్యుడు. అవ్యయుడు. ఆధ్యాత్మయోగాన్ని అవలంబించినవారికే పొందదగిన వాడు. ఉన్నత మైన ఆత్మ పరబ్రహ్మము. పరుడు, ఇంద్రియాలకు అతీతమైనవాడు. ఈశ్వరుడు మహత్తులకే మహత్తు. అణువులలో అణువు అయినవాడు. అట్టి పరమాత్మను నేను భజిస్తాను.
8-85 పావకుండర్చుల భానుందు దీప్తుల... (సీసము).
iBAA పద్య గానం
iBAP పద్యము
పావకుండర్చుల భానుందు దీప్తుల
  నెబ్భంగి నిగిడింతు రెట్టడంతు
రాక్రియ నాత్మకరావళిచేత బ్ర
  హ్మాదుల వేల్పుల నఖిలజంతు
గణముల జగముల ఘననామరూపభే
  దములతో మెఱయించి తగ నడంచు
నెవ్వఁడు మనము బుద్ధీంద్రియమ్ములు
  దాన యై గుణసంప్రవాహమ్ము బఱపు

తేటగీతి

స్త్రీ నపుంసకపురుష మూర్తియును గాక
తిర్యగమరనరాదిమూర్తియును గాక
కర్మగుణభేద సదసత్ప్రకాశి గాక
వెనుక నన్నియుఁ దానగు విభుఁ దలంతు.

iBAT సందర్భం

సర్వమూ తానే అయిన ఆ పరమాత్మను సకల భూతరాశులలో నిండియున్నవానిని నేను భజిస్తాను. అంటున్నాడు గజేంద్రుడు

iBAT తాత్పర్యము

అగ్నిదేవుడు తన జ్వాలలను ఉవ్వెత్తున విరజిమ్ముతాడు. మళ్ళీ లోపలికి తీసుకొంటాడు. సూర్యదేవుడు తన కిరణాలను అన్ని దిక్కులకు ఎంత దూరమైనా ప్రకాశింపజేస్తాడు. తిరిగి వాని వెలుగులను ఉపసంహరిస్తాడు. పరమాత్మ అదే విధంగా బ్రహ్మ మొదలుకొని చీమవరకు అన్నింటినీ, అందరినీ వెలువరిస్తాడు. తనలో లీనం చేసుకొంటాడు. వెలువరించి నప్పుడు పెక్కువిధములైన నామములను, రూపములను వానికి కల్పిస్తాడు. లోపలికి తీసుకొన్నప్పుడు ఆ నామరూపగుణాలనన్నింటినీ లేకుండా చేసి ఒక్కడై మిగిలిపోతాడు. మనస్సు, బుద్ధి, ఇంద్రియములు అన్నీ తానే సత్త్వము, రజస్సు, తమస్సు అనే గుణాలప్రవాహం కూడా తానే. లోకంలో అవయవాల కూర్పును బట్టి ఆడుది, మగవాడు, పేడి అనే వ్యవహారాలు ఉంటాయి. అలాగే ఇవి మృగాలు, ఇవి పక్షులు, ఇవి ప్రాకే జంతువులు, ఇవి వృక్షాలు, ఇవి పురుగులు మొదలైన అనేక జాతులుగా తెలియవచ్చే సర్వమూ తానే అయినవాడు ఆ పరమాత్మ. ఆయా నామరూపాదులతో ఉన్నప్పుడు తాను వేరు, అవి వేరు అన్నట్లు తోచటం సంభవిస్తుంది కానీ నామరూపాదులను తీసి ప్రక్కను పెట్టి చూడగలిగితే సర్వమూ తానే. అట్టి విభుని నేను తలంచుకొంటూ ఉంటాను.
8-154 ఎవ్వనిమాయకు నింతయు మోహించుఁ... (సీసము).
iBAA పద్య గానం
iBAP పద్యము
ఎవ్వనిమాయకు నింతయు మోహించుఁ
  చఱిమి యెవ్వనిమాయ దాట రాదు
తన మాయ నెవ్వఁడింతయు గెల్చినట్టి వాఁ
  డెవ్వనిఁ బొడగాన రెట్టి మునులు
సర్వభూతములకు సమవృత్తి నెవ్వఁడు
  చరియించుఁ దనచేత జనితమయిన
ధరణిపాదములు చిత్తము సోముఁ దగ్నిము
  ఖంబు గన్నులు సోమకలమహితులు

తేటగీతి

చెవులు దిక్కులు రేతంబు సిద్ధజలము
మూడు మూర్తుల పుట్టిల్లు మొదలి నెలవు
గర్భమఖిలంబు మూర్ఖంబు గగనమగుచు
మలయు నెవ్వఁడు వాని నమస్కరింతు.

iBAT సందర్భం

బ్రహ్మదేవుడు 'అజితుని' ' సదనానికి దేవతలనందరినీ తీసుకొని పోయాడు. మంత్రమయములైన వాక్యాలతో, ఇంద్రియాలన్నింటినీ అదుపులోనికి తెచ్చుకొని యిలా స్తుతించాడు

iBAT తాత్పర్యము

స్వామీ! నీమాయ ఎవ్వరికీ దాటరానిది. నిన్ను మహర్షులు, తప స్సంపన్నులు కూడా చూడలేదు. సర్వ భూతముల విషయంలో నీవు సమ వృత్తితో ఉంటావు. నీపాదాలు భూమి, నీచిత్తం చంద్రుడు. అగ్నిదేవుడు నీముఖం, దిక్కులు నీ చెవులు. నీకన్నులు సూర్యచంద్రులు. సృష్టినీ, స్థితినీ, లయాన్నీ చేసే ముగ్గురు మూర్తులూ నీనుండి ఏర్పడిన వారే. సృష్టికి మొదలితావు నీగర్భమే. నీ శిరస్సు గగనమే. ఇట్టి పరమాత్మ స్వరూపునకు నేను నమస్కరిస్తూ ఉంటాను.
8-202 సవరవై లక్షయోజనముల వెడలుపై... (సీసము).
iBAA పద్య గానం
iBAP పద్యము
సవరవై లక్షయోజనముల వెడలుపై
  కడు కఠోరమునైన కర్పరమును
నదనైన బ్రహ్మాండమైన నాహారించు
  ఘనతరంబగు ముఖగహ్వరంబు
సకలచరాచర జంతురాశులు నెల్ల
  మ్రింగి లోఁగొనునట్టి మేటికడుపు
విశ్వంబుపై వేటు విశ్వంబు పైబడ్డ
  నాగినఁ గదలని యట్టి కాళ్ళు

తేటగీతి

వెలికి లోనికిఁ జనుదెంచు విపులతుండ
మంబుజంబులఁ బోలెడు నక్షియుగము
సుందరంబుగ విష్ణుండు సురలతో
కూర్మి చెలువొంద నొక మహాకూర్మమయ్యె

iBAT సందర్భం

మందరపర్వతాన్ని పాలకడలి మధ్యలోకి తోశారు. అంతలో అది కాస్తా అందులో పోవటంవలన, మునిగిపోయింది. పట్టు చిక్కక దేవతలు రాక్షసులూ సముద్రం ఒడ్డున విసరివేసినట్టుగా పడి పోయారు. ఇంతవరకూ ఉత్సాహంతో ఊగిపోతున్న వారి మొగాలలో కళాకాంతులు లేకుండా పోయాయి. బిక్కమొగాలతో నిలుచుండి పోయారు. అప్పుడు -

iBAT తాత్పర్యము

పైడిప్ప లక్షయోజనాల వైశాల్యంతో ఉన్నరా అనిపిస్తున్నది. పిడుగులు పడినా చెక్కుచెదరని గట్టితనంతో అలరారుతున్నది. పెద్దగా తెరచిన నోటిలోనికి బ్రహ్మాండమంతా ఒక్కపెట్టున దూరిపోతుందా అన్నంత విశాలంగా ఉన్నది. సృష్టిలో ఉన్న చరాచరజంతురాశులన్నీ చొర బారినా ఇంకా చోటు చాలా ఉన్నది అనిపించే పొట్ట కన్పట్టుతూ ఉన్నది. పదునాలుగు లోకాల సముదాయం మీద మళ్ళీ పదునాలుగు లోకాల విశ్వం వచ్చిపడినా అవలీలగా నిలద్రొక్కుకోగల పాదాలు చూడముచ్చట గా ఉన్నాయి. ముట్టెను లోపలికీ, వెలుపలికి వింతగా కదలిస్తున్నది. బాగా వికసించిన నూరురేకులపద్మాలు రెండు అటూ ఇటూ కదలాడుతూ ఉంటే ఒహూ ఇవి కన్నులు కాబోలు అనుకొంటున్నారు అచ్చటి జనులు. ఈ విధంగా పరమసుందరమైన మహాకూర్మం (తాబేలు) అక్కడ ఆవిర్భవించింది.
8-222 భూతాత్మ భూతేశ భూతభావనరూప... (సీసము).
iBAA పద్య గానం
iBAP పద్యము
భూతాత్మ భూతేశ భూతభావనరూప
  దేవ మహాదేవ దేవవంద్య
యీలోకములకెల్ల నీశ్వరుండవు నీవ
  బంధమోక్షములకుఁ బ్రభుఁడవీవ
ఆర్తశరణ్యుఁడవగు గురుండవు నిన్నుఁ
  గోరి భజింతురు కుశలమతులు
సకలసృష్టిస్థితి సంహారకర్తవై బ్రహ్మ
  విష్ణుశివాఖ్యఁ బరఁగు దీవు

ఆటవెలది

పరమగుహ్యమయిన బ్రహ్మంబు సదసత్త
మంబు నీవ శక్తిమయుఁడ వీవ
శబ్దయోని వీవ జగదస్తరాత్మవు
నీవ ప్రాణమరయ నిఖిలమునకు.

iBAT సందర్భం

దేవతలందరూ మొగాలు వ్రేలచేసుకొని దీనతతో తనముందు నిలిచి మొఱలు పెడుతున్నారు. నిలువెల్లా జాలినింపుకొన్న స్వామి అమ్మ వారిని కలుపుకొని వారికి దర్శనం అనుగ్రహించాడు. వారందరూ ఒక్క పెట్టున సాష్టాంగ ప్రణామాలు చేశారు. స్వామి గొప్పతనాన్ని కొనియాడ నారంభించారు

iBAT తాత్పర్యము

ప్రభూ! భూతాత్ముడవు. భూతాలకు ఈశ్వరుడవు. భూతాలన్నీ భావించవలసిన రూపం నీది. దేవుడవు, మహాదేవుడవు. దేవతలు కూడా నిన్ను త్రికరణాలతో పూజిస్తారు. సర్వలోకాలకూ ఏలికవు నీవు. జీవుల బంధమోక్షాలకు కారణమైన ప్రభుడవు నీవు. ఆర్తులకు శరణమిచ్చేవాడవు నీవే. సర్వలోకాలకు గురుడవు నీవే. జ్ఞానసంపదకలవారు నిన్ను కోరి భజిస్తారు. సృష్టికార్యంలో నిన్ను బ్రహ్మ అంటారు. సృష్టిని నిలిపి ఉంచే పూనికతో ఉన్న నిన్నే విష్ణువంటారు. ప్రళయకాలంలో సర్వాన్నీ లోపలకు తీసుకొనే నిన్ను శివుడంటారు. ఎట్టివారికినీ తెలియరాని బ్రహ్మమవు నీవే. నిత్యస్వరూపమూ, వస్తూ పోతూ ఉండే జగత్తత్త్వమూ రెండూ నీవే. సర్వశక్తిమయుడవు నీవే. వేదవాదం నీవలెనే సనాతనమైనది. అనంత మైనది. అట్టి శబ్దాత్మకతత్వానికి పుట్టుకస్థానం. నీవే జగత్తులకు వెలుపల, లోపల నిండి ఉన్నది నీవే! సర్వజీవకోటికి ప్రాణశక్తివి నీవే. నీవు కానిదీ, నీవు లేనిదీ ఈ బ్రహ్మాండంలోపలా, వెలుపలా మరేదీ లేదు.
8-224 అగ్నిముఖంబు పరాపరాత్మక మాత్మ... (సీసము).
iBAA పద్య గానం
iBAP పద్యము
అగ్నిముఖంబు పరాపరాత్మక మాత్మ
  కాలంబుగతి రత్నగర్భపదము
శ్వసనంబు నీయూర్పు రసన
  జలేశుండు దిశలు కర్ణంబులు దివము నాభి
సూర్యుండు కన్నులు శుక్లంబు సలిలంబు
  జఠరంబు జలధులు చదలు శిరము
సర్వౌషధులు రోమచయములు శల్యంబు
  లద్రులు మానస మమృతకరుఁడు

ఆటవెలది

ఛందములు ధాతువులు ధర్మసమితహృదయ
మాస్యపంచక ముపనిషదాహ్వయంబు
నయిన నీరూపు పరతత్త్వమై శివాఖ్య
మై స్వయంజ్యోతియై యొప్పు నాద్యమగుచు.

iBAT సందర్భం

క్షీరసాగరంనుండి వెలువడిన హాలాహలంనుండి తమను రక్షించమని వేడుకొంటూ ఆ పరమాత్మను ఇంకా ఇలా వేడుకొంటున్నారు దేవతలు

iBAT తాత్పర్యము

నీ ముఖం అగ్ని. నీ ఆత్మ పరాత్మకము, నీగతి కాలము. నీ అడుగు రత్నాలు కడుపునిందా ఉన్న భూదేవి. వాయుదేవుడు నీ ఊర్పు. నీనాలుక వరుణదేవుడు, దిక్కులు నీ చెవులు. స్వర్గము నీ బొడ్డు. సూర్యుడు నీ కన్నులు. శుక్లము జలములు. పొట్ట సముద్రాలు. ఆకాశం తల, వృక్షాల జాతులన్నీ నీ రోమములు. కొండలు నీ యెముకలు, చంద్రుడు నీ మనస్సు. వేదములు ధాతువులు, (దేహంలోని మూలపదార్థాలు). ధర్మము నీ హృదయము. నీ అయిదుముఖాలు (సద్యోజాతము, వామదేవము, తప్పు రుషము, అఘోరము, ఈశానము) ఉపనిషత్తులు (జ్ఞానవిద్యకు సంబంధించిన వాజ్ఞ్మయము). అట్టి నీ రూపము ‘శివ’ అను పేరుతో అలరారే పర తత్త్వము. అది స్వయంజ్యోతి, ఆద్యము.
8-266 పాలమున్నీటిలోపలి మీదిమీఁగడ... (సీసము).
iBAA పద్య గానం
iBAP పద్యము
పాలమున్నీటిలోపలి మీదిమీఁగడ
  మిసిమి జిడ్డునఁ జేసి మేను వడసి
క్రొక్కారు మెఱుఁగుల కొనల క్రొత్తళుకుల
  మేనిచేగల నిగ్గు మెఱుఁగు సేసి
నాటినాటికిఁ బ్రోదినవకంపుఁ దీవల
  నునుబోదనెయ్యంబు నూలుకొలిపి
క్రొవ్వారుకెందమ్మి కొలఁకునఁ బ్రొద్దునఁ
  బొలసిన పలపునఁ బ్రోది పెట్టి

తేటగీతి

పసిడి చంపకదామంబు బాగుఁ గూర్చి
వాలుక్రొన్నెల చెలువున వాఁడి దీర్చి
జాణతనమునఁ జేతులు జడ్డువిడిచి
నలువ యీ కొమ్మ నొగిఁ జేసినాఁదు నేఁడు.

iBAT సందర్భం

పాలకడలిని ఇంకా చిలుకుతూనే ఉన్నారు. పుట్టిన మహావస్తువులు గొప్పవే కానీ కావలసిన మహావస్తువు ఇంకా రాలేదు కనుక పట్టువదలకు దేవదానవులు పంతంతో పాలకడలిని త్రచ్చుతూనే ఉన్నారు.

ఇంతలో అందరి కన్నులూ జిగేలుమనేట్లుగా ఒక మహాశక్తి స్వరూపం అక్కడ ఆవిర్భవించింది. భావించగా భావించగా ఆ శక్తి మహాలక్ష్మీస్వరూపమని తెలియవచ్చింది

iBAT తాత్పర్యము

అది అసలే పాలసముద్రం. దానిమీద బంగారువన్నెతో దట్టంగా పేరుకొన్న మీగడ, జిడ్డును భద్రంగా తీసికొని బ్రహ్మయ్య ఆమె చర్మసౌంద ర్యాన్ని తీర్చిదిద్దాడు. వానకాలపు తొలిదినాలలో చట్టంగా విస్తరించిన కారు మబ్బులలో చిందులు ద్రొక్కుతున్న మెరుపుకాంతులు ఆమె దేహానికి వన్నె చిన్నెలను సంతరిస్తున్నాయి. కుదుటి లోనుండి వయ్యారంగా సుతారంగా పైపైకి అల్లుకొనిపోతున్న పూలతీగ నిగనిగలు కన్నులకు విందు చేస్తున్నాయి. ఎర్రదామరల కొలనులో సూర్యోదయ సమయంలో వెల్లివిరిసే పరమశోభ ఆమెయందు లాస్యమై అలరారుతున్నది. నడుమున బంగారు వడ్డాణం జిగేల్మంటున్నది. అది విదియచందురుని అందాన్ని వెక్కిరిస్తున్నది. బ్రహ్మదేవుడు పెద్దకాలానికి తన చేతులలోని జడిమను ప్రయత్నంతో విదలించి వదిలించుకొని ఈ అందాల బరిణెను రూపొందించి ఉండక పోతే ఇంత రూపసౌందర్యరాశి ఎలా రూపొందుతుంది?
8-273 పలుకుల నమృతంబు చిలుక నెవ్వానితో... (సీసము).
iBAA పద్య గానం
iBAP పద్యము
పలుకుల నమృతంబు చిలుక నెవ్వానితో
  భాషించె వాఁడె పో బ్రహ్మయనఁగ
నెలయించి కెంగేల నెవ్వని వరియించె
  వాఁడె లోకములకు వల్లభుండు
మెయిదీగె నెవ్వని మేనితోఁ గదియించె
  వాఁడె పో పరమసర్వజ్ఞమూర్తి
నెలఁతుక యెప్పుడు నివసించె నే యింట
  నాయిల్లు పరమగు నమృతపదము

ఆటవెలది

నింతి చూపు వాఱె నెచ్చోట కచ్చోటు
జిష్ణు ధనద ధర్మజీవితంబు
గొమ్మ పిన్ననగవు గురుతర దుఃఖని
వారణంబు సృష్టికారణంబు.

iBAT సందర్భం

సకలదేవతలు ఆ తల్లికి అనేకములైన కానుకలను సమర్పించుకొన్నారు. ఆ తల్లి మహాత్మ్యాన్ని పోతన మహాకవి ఇలా వర్ణిస్తున్నాడు

iBAT తాత్పర్యము

ఆ తల్లి ముగురమ్మల మూలపుటమ్మ కనుక పలుకులతో అమృతం చిలికిస్తే ఆ వ్యక్తి బ్రహ్మ అవుతాడు. ప్రేమతో చేపట్టినవాడు పురుషోత్తముడవుతాడు. తన లతవంటి మేనుతో ఎవ్వనినైనా తాకితే వాడు పరమ సర్వజ్ఞమూర్తిగా రూపొందుతాడు. ఎవనియింటిలోనైనా ఆమె పీఠం పెట్టుకొని కూర్చుంటే ఆ యిల్లు పరమైన అమృతపదం అవుతుంది. ఆ తల్లి కడకంటి చూపు ఒకసారి సోకినంతమాత్రాన ఆ చోట్లు దేవేంద్రస్థానం కుబేరస్థానం ధర్మస్థానం అయి విరాజిల్లుతుంది. ఆమె చిరునవ్వు చాలు. సంసారం అనే మహాదుఃఖసాగరం నశించిపోవటానికి. అదియే సృష్టికి కూడా కారణం అవుతుంది.
8-275 భావించి యొకమాటు బ్రహ్మాండమంతయు... (సీసము).
iBAA పద్య గానం
iBAP పద్యము
భావించి యొకమాటు బ్రహ్మాండమంతయు
  నాటల బొమ్మరిల్లని తలంచుఁ
బోలించి యొకమాటు భువనంబు లన్నియుఁ
  తనయింటిలో దొంతులని తలంచుఁ
బాటించి యొకమాటు బ్రహ్మాదిసురులను
  దనయింటిలో బొమ్మలని తలంచు
గొనకొని యొకమాటు కుంభినీచక్రంబు
  నలవడ బొమ్మపీటని తలంచు

ఆటవెలది

సొలసి యొక్కమాటు సూర్యేందురోచుల
నచటి దీపకళికలని తలంచు
భామయొక్కమాటు భారతీదుర్గల
నాత్మసఖులటంచు నాదరించు.

iBAT సందర్భం

అంతేకాదు, ఆమె లీలావిలాసాలు అనంతాలు. ఆ లీలావిలాసాలను మహాకవి ప్రోదిపోస్తున్నాడు

iBAT తాత్పర్యము

ఆ తల్లికి బ్రహ్మాండమంతా ఒక చిన్న క్రీడారంగమైన బొమ్మరిల్లు, పదునాలుగు లోకాలూ ఆమె యింటిలో ఒకదానిపై నొకటిగా పేర్చిన పాత్రల దొంతి. బ్రహ్మాదిదేవతలు ఆమె రూపొందించుకొన్న ఆటబొమ్మలు. భూచక్ర మంతా ఆమె చక్కగా ఏర్పాటుచేసుకొన్న బొమ్మల పీట. సూర్యచంద్రులు ఆపీటమీద పరమసుందరంగా పెట్టుకొన్న చిన్నదీపాలు, మహాసరస్వతీ, మహాకాళీ తన చెలికత్తెలు, ఈవిధంగా ఆమె సంభావిస్తూ ఉంటుంది.

ఆ లోకమాత ఒక్కపెట్టున బ్రహ్మ మొదలైన దేవతలముందరా, రక్కసులముందరా తన దివ్యమైన ఆకారాన్ని చూపిస్తూ కలువలతో కూర్చిన ఒక పెద్దమాలను ధరించి నవ్వుమోముతో నిలబడింది.

ఆ సాక్షాత్కారానికి అందరూ బిత్తరపోయారు. కనులలో చూచే శక్తి తగ్గిపోతున్నది. బెదరిపోయారు. ఒక్క శ్రీహరి మాత్రం చిరునవ్వులు చిందిస్తూ పురుషోత్తముడై ఆమెవైపే చూపులను ప్రసరింపజేస్తూ నిల్చిపోయాడు.
8-293 తరుణుండు దీర్ఘదోర్దండుండు గంబుకం... (సీసము).
iBAA పద్య గానం
iBAP పద్యము
తరుణుండు దీర్ఘదోర్దండుండు గంబుకం
  ధరుఁదు పీతాంబరధారి స్రగ్వి
లాసిత భూషణాలంకృతుఁ డరుణాక్షుఁ
  డున్నతోరస్కుఁడత్యుత్తముండు
నీలకుంచిత కేశనివహుండు జలధర
  శ్యాముండు మృగరాజసత్త్వశాలి
మణికుండలుండు రత్నమంజీరుఁ
  డచ్యుతు సంశాంశసంభవుండమల మూర్తి

ఆటవెలది

భూరియాగభోగభోక్త ధన్వంతరి
యనఁగ నమృతకలశహస్తుఁ డగుచు
నిఖిల వైద్యశాస్త్రనిపుణుఁ డాయుర్వేద
వేల్పు వెజ్జు గడలి వెడలి వచ్చి.

iBAT సందర్భం

అన్నీ లభించాయి. అమృతం ఇంకా ఇదిగో అదిగో అన్నట్లుగా ఉన్నది. పట్టువదలని దేవదానవులు. కవ్వపు కొండతో వాసుకి తలాతోకా పట్టుకొని పాలకడలిని చిలుకుతూనే ఉన్నారు. ఇంతలో ‘వారుణి’ అనే ఒక కన్యక పుట్టుకొని వచ్చింది. (వారుణి - మధ్యము) రాక్షసులు ఇది మాకు కావాలి అన్నారు. శ్రీహరి సన్నతో దేవతలు సరే మీరే తీసుకోండి అన్నారు.

అప్పుడు-

iBAT తాత్పర్యము

మంచి వయస్సులో ఉన్నాడు. పొడవైన చేతులతో అలరారు తున్నాడు. కంఠం శంఖంలాగా చక్కగా అమరి ఉన్నది. పట్టుపీతాంబరం కట్టి ఉన్నాడు. పరిమళాలు విరజిమ్మే దివ్యమైన పూలమాలలు ధరించి ఉన్నాడు. సువర్ణభూషణాలు కాంతులను విరజిమ్ముతున్నాయి. కన్నులలో లేతఎరుపుకాంతి కమనీయంగా ఉన్నది. విశాలమైన రొమ్ము పెద్దవేదిక లాగా విరాజిల్లుతున్నది. సాక్షాత్తూ పురుషోత్తముడే దిగివచ్చాడా అనిపిస్తు న్నాడు. శిరస్సుపై నల్లని వెంట్రుకలు నిగనిగలాడుతూ నొక్కులతో అలరారుతున్నది. దేహం నీలమేఘచ్ఛాయతో చూడముచ్చటగా ఉన్నది. సింహ బలుడనిపిస్తున్నాడు. చెవులకు మణికుండలాలు, పాదాలకు రత్నమంజీరాలూ శోభను తెచ్చిపెడు తున్నాయి. శ్రీమహావిష్ణువు అంశలో అంశం ఇలా పుట్టుకొని వచ్చిందని బ్రహ్మాదులు సంభావన చేస్తున్నారు. అమల మైన మూర్తి. మహాయజ్ఞాలలో హవిస్సులను ఆదరంతో గ్రహిస్తూ ఉంటాడు. పేరు ధన్వంతరి. అని వ్యాసులవారు చెప్పారు. ఆయన చేతిలో అమృత కలశం అత్యద్భుతంగా కనిపిస్తున్నది. వైద్యశాస్త్రమంతా ఆయన అరచేతిలో ఉసిరికాయ. ఆయుర్వేదానికి మూలపురుషుడు. దేవతలకు వైద్యుడు. మెల్లగా దేవదానవులు చిలుకుతున్న పాలసముద్రంనుండి వెలువడి అందరికీ దర్శనాన్ని అనుగ్రహించాడు.
8-301 మెత్తనియడుగుల మెఱుగారు జానువు... (సీసము).
iBAA పద్య గానం
iBAP పద్యము
మెత్తనియడుగుల మెఱుగారు జానువు
  లరఁటి కంబముల దోయైన తొడలు
ఘనమగు జఘనంబు కమలేఁత నడుమును
  బల్లవారుణకాంతి పాణియుగముఁ
గడుదొడ్డ పాలిండ్లుఁ గంబుకంఠంబును
  బింబాధరముఁ జంద్రబింబముఖముఁ
దెలిగన్నుగవయును నళికుంతలంబును
  బాలేందుసన్నిభఫాలతలము

తేటగీతి

సమరఁ గుండలకేయూరహారకంక.
ణాదు లేపార మంజీరనాదమొప్ప
నల్లనువ్వుల పద్మదళాక్షుఁడసుర
పతులు నణఁగింప నాడు రూపంబుఁ డాల్చి.

iBAT సందర్భం

అమృతకుంభం దర్శించుకొన్న అసురులు రెండువిధాలవారుగా, కలిప్రభావంవలన విడిపోయారు. ఒకరు దేవతల సాయంతో కదా మనం దీనిని సాధించింది! వాళ్ళు కూడా దీనిని అనుభవించాలి అన్నారు. కొందరు సహజమైన రాక్షస స్వభావంచేత ఇది మనదే మనమే అనుభవించాలి అని పట్టుపట్టి కుండను గుంజుకొని. పరువులు తీశారు. తక్కిన వాళ్ళు లబోదిబో మంటూ తల్లడిల్లిపోయారు. అప్పుడు -

iBAT తాత్పర్యము

శ్రీమన్నారాయణుడు ఒప్పులకుప్పగా రూపొంది ఒయ్యారిభామగా ఆ రాక్షసులముందు నాట్యభంగిమలో నడువసాగాడు. ఆ అందచందా లకు, ఆ అవయవములు పొంకానికి రక్కసుల దిమ్మ దిరిగిపోయింది. అమృతభాండం ఈ అందంముందు ఎంతటిది అన్నట్లు మారిపోయారు. కొంతసేపటికి తేరుకొని,
8-305 ఔఁగదే లావణ్య మౌఁగదే మాధుర్య... (సీసము).
iBAA పద్య గానం
iBAP పద్యము
ఔఁగదే లావణ్య మౌఁగదే మాధుర్య
  మౌఁగదే సతి నవయౌవనాంగి
యెటనుండి వచ్చితి వేమి యిచ్ఛించెదు
  నీనామ మెయ్యది నీరజాక్షి !
అమరగంధర్వసిద్దాసురచారణ
  మనుజకన్యలకు నీమహిమ గలదె
ప్రాణచిత్తేంద్రియ పరిణామదాయిమై
  నిర్మించె బో విధి నిన్నుఁ గరుణ

తేటగీతి

వనిత! కశ్యపుసంతతి వారమేము
భ్రాతలము సురలకే మిద్దపౌరుషులము
జ్ఞాతులకు మాకు నేకార్థసంగతులకు
బాలుదీరని యర్థంబు పంచి యిమ్మ.

iBAT సందర్భం

తమ కన్నులముందర ఆవిర్భవించిన మోహినీరూప సౌందర్యాన్ని తనివితీరా చూస్తూ దితిపుత్రులు ఇలా అంటున్నారు.

iBAT తాత్పర్యము

"ఆహా! ఏమి లావణ్యం! ఏమి మాధుర్యం! కొంగ్రత్తజవ్వనంతో మిసమిసలాడిపోతున్నావు. ఎక్కడనుండి. వచ్చావు. నీకేమి కావాలి? నీ పేరేమిటి? నరజాతులలో గానీ అమరాదిజాతులలోగాని నీవంటి మహిమ ఉన్న వారు మాకు ఇంతవరకు గానరాలేదు. ప్రాణము, చిత్తము, ఇంద్రియాలూ ఏలెక్కలో ఎంతగా ఉంటే సమగ్రత ఏర్పడుతుందో అది అంతా చక్కగా లెక్కగట్టి బ్రహ్మయ్య నిన్ను సృష్టించినట్లున్నావు" అని ఆ సౌందర్యదేవతను ఆరాధనాపూర్వకంగా చూచారు రాక్షసులు. వారి హృదయాలలో ఉన్న ఆందోళన వారిని, ఆమె సమాధానం. విందాం అనే భావరేఖను కూడా కలిగించలేదు. గలగలా ఒక్కమాట అన్నారు. “అమ్మాయీ! మేమందరము కశ్యపప్రజాపతి పుత్రులము. అన్నదమ్ములము కాకపోతే మాకు పౌరుషం కొంత హెచ్చు దానికేమిగానీ మాకు ఈ అమృతంలో పాలుపంచు కోవటం చేతకాలేదు. ఆ పనికాస్తా నీవు చేసిపెట్టు. మేమందరమూ రెండు బారులు. తీరి కూర్చుంటాము. నీవు పక్షపాతం లేకుండా మాకు పంచి పెట్టు.
8-376 కొండలఱెక్కలు ఖండించివైచుచో వజ్ర... (సీసము).
iBAA పద్య గానం
iBAP పద్యము
కొండలఱెక్కలు ఖండించివైచుచో వజ్ర
  మెన్నఁడు నింత వాఁడి సెడదు
వృత్రాసురాదుల విదలించె నీ పవి
  తిరుగదెన్నఁడు పగదీర్చికాని
ఇంద్రుండగానొకో యేను, దంభోలియుం
  గాదొకో ప్రయోగంబు సెడెనొ
దనుజాధముఁడు మొనతాఁకు దప్పించెనో
  భిదురంబు నేఁడేల బెండుపడియె

ఆటవెలది

ననుచు వజ్రి వగవ నార్థ్రశుష్కంబులఁ
జావకుండఁ దపము సలిపె నీతఁ
డితరమెద్దియైన నింద్ర! ప్రయోగింపు
వైళమనుచు దివ్యవాణి పలికె.

iBAT సందర్భం

నముచి ఇంద్రుల పోరు జరుగుతున్నది. ఇంద్రుడు నముచిపై వజ్రాయుధాన్ని ప్రయోగించాడు. వజ్రాయుధం సముచిని ఏమీ చేయలేకపోయింది. ఇంద్రునికి ఆశ్చర్యం వేసింది. ఇలా అనుకొంటున్నాడు.

iBAT తాత్పర్యము

ఇంద్రునికి పరమాశ్చర్యం కలిగింది. ఇదేమిటి? ఈ నా వజ్రా యుధం కొండలరెక్కలు ముక్కలు చేసే వేళలలో కూడా మొక్కవోనిది. వృత్రాసురుడు మొదలైన మహారాక్షసులను చంపి కానీ వెనుతిరుగనిది! ఇపుడు దీనికేమైనది. నేను ఇంద్రుడనేనా? ఇది వజ్రాయుధమేనా? ఈ దనుజాధముడు దీని దెబ్బనెల్లా తప్పించుకొన్నాడు? ఈనాడు ఈ ఎదురు లేని ఈ నా భిదురం (వజ్రం) ఎందుకు బెండైపోయింది? అంటూ వజ్రి చింతిస్తూ నిలిచిపోగా దివ్యవాణి, వీడు, తడిలేనిదీ, తడి ఉన్నదీ అయిన వానితో చావని వరం పొందినవాడు. అట్టి ఆయుధాన్ని గూర్చి ఆలోచించు అని వినవచ్చింది.
8-385 దేవ జగన్మయ దేవేశ జగదీశ... (సీసము).
iBAA పద్య గానం
iBAP పద్యము
దేవ జగన్మయ దేవేశ జగదీశ
  కాలజగద్వ్యాపక స్వరూప
యఖిల భావములకు నాత్మయు హేతువు
  నైన యీశ్వరుఁడ వాద్యంతములకు
మధ్యంబు బయలును మఱిలోపలయు లేక
  పూర్ణమై యమృతమై భూరిసత్య
మానంద చిన్మాత్ర మవికారమాద్య
  మనన్యమశోకంబు నగుణ మఖిల

తేటగీతి

సంభవ స్థితిలయముల దంభకంబు
నైన బ్రహ్మంబు నీవ నీ యంఘ్రియుగము
నుభయ సంగ విసృష్టులై యున్న మునులు
గోరి కైవల్యకాములై కొల్తురెపుడు.

iBAT సందర్భం

ఒకనాడు పరమశివుడు కైలాసగిరిమీద కొలువుతీరి కూర్చున్నాడు. విష్ణువు అంగనగా మారి అసురులను వంచించి, సురలకు అమృతం పంచి యిచ్చినమాట అక్కడ కొందరు చెప్పుకొంటూ ఉండగా విన్నాడు. ఆయనకు ఆశ్చర్యం వేసింది. వెంటనే అమ్మవారిని తీసుకొని అనుచరులతోపాటు వైకుంఠానికి పయనమయ్యాడు. శ్రీహరి శ్రీహరుని చూచి సంభ్రమాదరాలతో స్వాగతం పలికి సపర్యలు చేసి కుశలప్రశ్నలడిగి దగ్గర కూర్చోబెట్టుకున్నాడు. తరువాత మూడుకన్నుల దేవర తామరకన్నుల దేవునితో ఇలా అన్నాడు.

iBAT తాత్పర్యము

దేవా! నీవు జగమంతా నిండియున్నవాడవు. ఇంద్రుడు మొదలైన దేవులకు కూడా ఈశుడవు. అంటే జగత్తులకు పాలకుడవని వేరుగా చెప్పనక్కరలేదు కదా! కాలస్వరూపంతో జగత్తునంతా వ్యాపించియుండు వాడవు. సర్వభావాలకు పుట్టిన యిల్లు నీవు. అంతటా వ్యాపించి ఉండేవాడవు కనుక నిన్ను “ఆత్మ” అంటారు. సర్వానికీ మూలకారణమైన వాడవు నీవు. పాలకుడవును నీవే. నీకు అది, మధ్య, అంతము అనే విభాగాలు లేవు. విశ్వమంతటా లోపలా వెలుపలా వ్యాపించి ఉన్న పూర్ణుడవు. నీది అమృతతత్త్వం, సత్యము, జ్ఞానము, ఆనందము అనేవి నీ లక్షణాలు. నీవంటి వాడు మరొకడు సృష్టిలో లేడు. నిత్యానందస్వరూపు డవు కనుక శోకం అనేది నిన్ను ఎప్పుడూ, ఎక్కడా అంటదు. సత్త్వము, రజస్సు, తమస్సు అనే మూడు గుణాలవలన కలిగే వికారాలు నిన్నం టవు. నిన్ను బ్రహ్మము అని వేదాలు అభివర్ణిస్తూ ఉంటాయి. అంటే నిన్ను మించిన పదార్ధం లేదు. ఇహమునకు, పరమునకు చెందిన తగులము లన్నింటినీ తెగతెంపులు చేసుకొన్న మునులు కైవల్యం కోరుతూ నిన్ను సేవించుకొంటూ ఉంటారు.
8-386 భావించి కొందరు బ్రహ్మంబు నీవని... (సీసము).
iBAA పద్య గానం
iBAP పద్యము
భావించి కొందరు బ్రహ్మంబు నీవని
  తలపోసి కొందఱు ధర్మమనియుఁ
జర్చించి కొందఱు సదసదీశ్వరుఁడని
  సరవిఁ గొందఱు శక్తిసహితుఁడవనియు
జింతించి కొందఱు చిరతరుండవ్యయుఁ
  దాత్మతంత్రుఁడు పరుం డధికుఁడనియు
దొడరి యూహింతురు తుది సద్వయ
  ద్వయసదసద్విశిష్టసంశ్రయుఁడ వీవు

తేటగీతి

తలఁప నొక్కింత వస్తుభేదంబు గలదె
కంకణాదులు పసిఁడి యొక్కటియ కాదె
కడలు పెక్కైన వార్ధి యొక్కటియ కాదె
భేదమందును నిను వికల్పింపవలదు.

iBAT సందర్భం

ఆ పరమేశ్వరుడు పరమాత్మతో ఇంకా అంటున్నాడు.

iBAT తాత్పర్యము

కొందఱు నిన్ను బ్రహ్మము అంటారు. కొందరు ధర్మము అంటారు. కొందరు నిన్ను సర్వమునకు ఈశ్వరుడు అంటారు. కొందరు నీవు శక్తితో కలసి ఉంటావంటారు. కొందరు సనాతనుడు (కాలవిభాగాలకు అందనివాడు) అవ్యయుడు (ఏవిధమైన వికారాలూ లేనివారు), ఆత్మ తంత్రుడు (స్వతంత్రుడు - తన ప్రవృత్తికి ఇతరమైన ప్రేరణ మొదలైనవి లేనివారు) పరుడు (పంచభూతాలూ, సూర్యచంద్రాదులూ మొదలైనవాని సముదాయం. అయిన ప్రకృతి కంటె వేరైనవారు) అధికుడు (అన్నిటి కంటే, అందరికంటె గొప్పవాడు) మొదలైన పదాలతో నిన్న పేర్కొవటానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అద్వైతము, ద్వైతము, విశిష్టాద్వైతము అనే తత్త్వాలన్నింటికీ అర్థమైన వాడవు. నీకు సంబంధించినంతవరకు వస్తుభేదం ఏమాత్రమూ లేదు. కంకణం అంటాం, హారం, అంటాం, నూపురం అంటాం. ఆకారాన్ని బట్టి వేరువేరు పేరులు ఉన్నా అదంతా బంగారమే అయినట్లుగా ఉంటుంది నీ తత్త్వం. తరంగము, బుడగ, నుడి మొదలైన పేర్లు స్వరూపాన్ని బట్టి ఏర్పడినా అంతా అలమే కదా సముద్రం అంటే. నీవు అటువంటివాడవు. ఏకత్వము నీ లక్షణం. అదే అనేక స్వరూపాలతో భిన్నమైనదిగా తోస్తూ ఉంటుంది. దానినే ప్రపంచం అంటారు.

నీవిలాసాలను ‘మరీచి’ మొదలైన మహర్షులు కూడా తెలియ లేరు. నీ నిత్యత్వమూ, నా నిత్యత్వమూ ఒక్కటే. అయినా దానిని విస్పష్టం గా లోకానికి తెలియజెప్పటానికి మాటలూ, భావించటానికి మనస్సూ చాలవు. నీమాయ అందరినీ అంధులను చేసివేస్తుంది. నీకు ఏ రూపమూ లేదు కానీ సర్వరూపాలూ నీవే ఆకాశంలో వాయువు విహరించినట్లుగా ఉంటుంది నీ చైతన్యం. ఇన్ని మాటలెందుకు పుండరీకాక్షా! నీవు ‘సర్వుడవు’.
8-407 నిఖిల దేవోత్తమ నీవొక్కరుఁడు దక్క... (సీసము).
iBAA పద్య గానం
iBAP పద్యము
నిఖిల దేవోత్తమ నీవొక్కరుఁడు దక్క
  నెవ్వఁడు నామాయ నెఱుఁగ నేర్చు
మానినినైన నామాయచే మునుగక
  ధృతి మోహితుండవై తెలిసితీపు
కాలరూపంబునఁ గాలంబుతోడ నా
  యందును నీమాయ యధివసించు
నీమాయ నన్ను జయింపనేరదు
  నిజమకృతాత్ములకు నెల్ల ననుపలభ్య

తేటగీతి

మిపుడు నీనిష్ఠ పెంపున నెఱిఁగి తనుచు
సత్కరించిన సఖ్యంబు సాల నెఱపి
దక్షతనయ గణంబులుఁ దన్నుఁ గొలువ
భవుఁడు విచ్చేసెఁ దగ నిజభవమునకు.

iBAT సందర్భం

వెండికొండ స్వామికి విష్ణు మాయా విలాసం అర్ధమైంది. ఓహో ఇదా నీ సంగతి అని నివ్వెరపడి చూస్తూ నిలిచిపోయాడు. హరికూడా మగవాడై శివునితో ఇలా అన్నాడు.

iBAT తాత్పర్యము

సర్వదేవతలలో ఉత్తముడవైన సర్వేశ్వరా! నీవు ఒక్కరుడు తప్ప నామాయను మఱెవ్వడూ తెలియలేరు. మానినినైన నామాయలో మునిగిపోక నిలద్రొక్కుకొనగలిగిన ధీరుడవు నీవు. కాకపోతే నామాయాప్రాభవాన్ని లోకాలకు తేటతెల్లం చేయటంకోసం ధీరత్వంతో నిండిన మోహాన్ని నటించావు. ఒక్కొక్క సమయంలో నీమాయ కూడా నన్ను వశం చేసికొంటుంది. నామాయ మనోనిష్ఠలేనివారికి తెలియవచ్చేది కాదు. నీవు నిష్ఠ పెంపుతో దానిని తెలుసుకొన్నావు. అంటూ శ్రీమహాదేవుని సత్కరించాడు. పరమేశ్వరుడు హాయిగా అమ్మవారితో, ప్రమథ గణాలతో కలసి తన నివాసస్థానమైన కైలాసం చేరుకొన్నాడు.
8-435 యోగీశరూపుఁడై యోగంబుఁ జూపుచు... (సీసము).
iBAA పద్య గానం
iBAP పద్యము
యోగీశరూపుఁడై యోగంబుఁ జూపుచు
  మౌనిరూపమునఁ గర్మంబుఁ దాల్చు
సర్గంబుసేయుఁ బ్రజాపతిరూపుఁడై
  ఇంద్రుఁడై దైత్యుల నేపడంచు
జ్ఞానంబు నెఱిఁగించుఁ జతురసిద్ధాకృతిఁ
  గాలరూపమునఁ బాకంబుసేయు
నానావిధములైన నామరూపంబులఁ
  గర్మలోచనులకుఁ గానఁబడఁడు

ఆటవెలది

చనిన రూపములను జనురూపముల నింక
జనఁగ నున్న రూపచయము నతఁడు
వివిధుఁడై యనేకవృత్తుల వెలిఁగించు
విష్ణుఁడవ్యయుండు విమలచరిత

iBAT సందర్భం

మనువులు, మహర్షులు, మనువుల పుత్రులు, ఇంద్రులు, దేవతలు అనే విభాగాలవారు ప్రతి మన్వంతరంలో వేర్వేరుగా హరి ఆజ్ఞతో ఏర్పడి లోకరక్షణ చేస్తూ ఉంటారు. యజ్ఞుడు మొదలైన మనువులు శ్రీహరి పురుషస్వరూపాలుగానే పుట్టినవారు. ఆ శ్రీహరి సహాయశక్తితో లోకాలను ప్రవర్తింపజేస్తూ ఉంటారు. కృతము, త్రేత, ద్వాపరము, కలి అనే నాలుగు యుగాల మొత్తం కాలం అయిపోయిన తరువాత వారు కాల గర్భంలో కలసిపోతారు. మళ్ళీ క్రొత్త మహాయుగం ప్రారంభసమయంలో తమతమ తపశృత్తితో వేదాల సముదాయాన్ని పొంది లోకరక్షణ చేస్తూ ఉంటారు. ఆవిధంగా ఏర్పడినవే నేనిప్పుడు నీకు వివరించిన పదునాలుగు మన్వంతరాల చరిత్ర, ఈ అంతటిని ఒక ప్రణాళిక ప్రకారం ఏర్పరచేవాడు శ్రీమన్నారాయణుడు. ఏర్పరచి దానికి ఒక ప్రతిష్టను కల్పిస్తాడు. దానివలన లోకములందు ఒక చక్కని వ్యవస్థ ఏర్పడుతూ ఉంటుంది.

iBAT తాత్పర్యము

రాజా! విష్ణువు విశ్వమే రూపమైనవాడు. తనంతతాను అనేక భావాలూ, రూపాలూ కల్పించుకొని జగత్తుల నన్నింటినీ ప్రవర్తింపజేస్తూ ఉంటాడు. ఆయన యోగీశ్వరుడు. యోగమంటే పరమాత్మతత్త్వమూ, ప్రపంచము ఒక్కటిగా అయిపోవటం. అది సామాన్యులకు మహా సాధనవలన సిద్ధిస్తుంది. స్వామికి అది సహజంగా ఏర్పడి ఉంటుంది. అందువలన ఆయన యోగీశ్వరుడు. సృష్టిలోని సమస్తజీవరాశులూ తనతనాన్ని పొందటంకోసం ఒక ప్రదీపంలాగా అతడు ఆయోగాన్ని లోకులకు ప్రదర్శిస్తూ ఉంటాడు. ఆయోగతత్త్వం తెలియటానికి జ్ఞానం కావాలి. యజ్ఞయాగాది కర్మములు సలక్షణంగా నిర్వహిస్తే మానవులు చిత్తశుద్ధి పొంది. భగవంతుని పట్టుకోవటానికి అనువైన విమలత్వాన్ని పొందుతారు. ఆవిధంగా అవసరమైన కర్మమార్గాన్ని సుసంపన్నం చేయగల సుజ్ఞానమూర్తులైన మహర్షులుగా ఆయనయే తన్ను తాను రూపొందించుకొంటాడు. సాలెపురుగు కడుపులో గుట్టుగా ఉన్న దారాల సముదాయం వంటి జగత్తులన్నింటినీ వెలువరించటానికి ఆస్వామియే బ్రహ్మగా తన్ను తాను రూపొందించుకొంటాడు. ఆ బ్రహ్మ యేర్పరచిన సృష్టిలో దుష్టప్రవృత్తి గల రక్కసులను, నాశనం చేయడానికి తానే మరల ఇంద్రుడై లోకరక్షణ చేస్తూ ఉంటాడు. అలా ఏర్పడిన సృష్టిని మరల కాలస్వరూపుడైన రుద్రుడై తనలో కలిపివేసుకొంటూ ఉంటాడు. ఈవిధంగా ఆ విష్ణువే యోగమూర్తి, ఋషి, బ్రహ్మ, ఇంద్రుడు, జ్ఞానావ తారాలైన దక్షిణామూర్తి, దత్తాత్రేయుడు, కృష్ణద్వైపాయనుడు, శంకరుడు మొదలైనవారుగా తెలియవస్తూ ఉంటాడు. అయితే ఆయన మాత్రం కర్మేంద్రియాలలో ఒకటి అయిన కంటికి కనపడేవాడు ఎన్నటికినీ కాడు. జ్ఞాననేత్రానికి మాత్రమే గోచరిస్తాడు. ఇంతవరకు ఏర్పడి అణగిపోయిన సర్వరూపాలకూ, ఇప్పుడు ఏర్పడి కదలాడుతున్న సర్వరూపాలకూ, రాబోయే మహాయుగాలలో ఏర్పడనున్న సర్వరూపాలకూ అతడే మూలకారణం. ఆవిధంగా అతడు పెక్కువిధాలుగా అయినవాడుగా తెలియవచ్చినా పరమార్థదృష్టితో ఏవికారాలూ లేని అవ్యయుడు. ఇదే భాగవరహస్యం.
8-503 త్రిభువనమయరూప! దేవ! త్రివిక్రమ... (సీసము).
iBAA పద్య గానం
iBAP పద్యము
త్రిభువనమయరూప! దేవ! త్రివిక్రమ
  పృథులాత్మ! శివివిష్ట! పృశ్నిగర్భ!
ప్రీతత్రినాభ! త్రిపృష్ట! జగంబుల
  కాద్యన్త మధ్యంబులరయ నీవ
జంగమస్థావర జనవాది హేతువు
  నీవ కాలంబవై నిఖిల మాత్మ
లోపల ధరియింతు లోని జంతులనెల్ల
  స్రోతంబులోగొను సుందరతను

తేటగీతి

బ్రహ్మలకు నెల్ల సంభవభవన మీవ
దినమునకు బాసి దుర్దశ దిక్కులేక
శోకవారి మునింగిన సురలకెల్లఁ
దేలనాధార మగుచున్న తెప్పవీవ.

iBAT సందర్భం

సత్యలోకంలో ఉన్న బ్రహ్మదేవుడు అదితిగర్భంలో నెలకొని ఉన్న సనాతనుడు, భగవానుడు అయిన నారాయణుని తత్త్వరహస్యం తెలుసుకొని యిలా స్తుతించాడు.

iBAT తాత్పర్యము

స్వామీ! మూడు లోకాలూ నీ స్వరూపమే! దేవా నీవు త్రివిక్ర ముడవు, మూడుపాదాల ఆక్రమణతో సర్వలోకాలనూ ఆక్రమించి పైన ఇంకా మూడింతలుగా అయ్యే స్వరూపం గలవాడవు. బ్రహ్మమవు. శిపి విష్ణుడవు, శివవిష్ణుతత్త్వములతో లోకములకు తెలియవచ్చువాడవు. శిపులంటే పశువులు. అంటే సంసారబంధంలో చిక్కుకొన్న జీవులు. వానితో వ్యాపించియుండు వాడు శిపివిష్ణుడు పశుపతి శివుడు. శిపులనగా కాంతులు. దానితో వ్యాపించి యుండువాడు. శిపివిష్ణుడు విష్ణువు. వాసుదేవుడు హరిహరాత్మక దివ్యతేజస్సుతో నిండియున్నవాడు. అట్టి శిపివిష్ణునిగా నిన్ను స్తుతిస్తున్నాను. స్వామీ నీవు పృశ్నిగర్భుడవు. ఈ అదితియే వెనుకటి జన్మలో ‘పృశ్ని’. ఆమె గర్భమునందు ప్రవేశించి పుట్టినందువలన స్వామీ నీవు పృశ్నిగర్భుడవు. ప్రీతపూర్ణకాముడవు కనుక ఎల్లప్పుడూ ప్రీతిభావముతో ఉండే స్వామివి. త్రినాభ - మూడులోకాలూ నీ బొడ్డులో ఉన్నాయి. త్రిపృష్ఠ - మూడులోకాలకూ నీవు పైన ఉన్నవాడవు. జగత్తులన్నింటికీ ఆది మధ్యము అంతమూ అయినవాడవు నీవే. జంగమాలు, స్థావరాలూ అనే అన్ని విధములయిన జీవరాశులకూ, ఇతరపదార్థాలకు పుట్టటం, ఉండటం లయం కావటం మొదలైన పనులన్నింటికీ కారణం నీవే. కాలస్వరూపానివి నీవే. అన్నింటినీ అందరినీ నీలోపల ధరిస్తూ ఉంటావు. ప్రవాహం తనలో పడిన సర్వ పదార్థాలనూ తన లోపలకు లాగుకొన్నట్లుగా సర్వాన్నీ నీవు ఆకర్షిస్తావు. ప్రజాపతులు అనే వ్యవహారం గల బ్రహ్మలను కూడా పుట్టించి, పోషించి, లయం చేసే పరతత్వానివి నీవు.
8-659 భూతలోకేశ్వర! భూతభావన దేవ... (సీసము).
iBAA పద్య గానం
iBAP పద్యము
భూతలోకేశ్వర! భూతభావన దేవ
  దేవ! జగన్నాథ! దేవవన్ద్య!
తన సొమ్ము సకలంబుఁ దప్పక నీకిచ్చె
  దండయోగ్యుఁడు గాఁడు దానపరుఁడు
గురుణింప నుర్హుండు కమలలోచన నీకు
  విడిపింపు మీతని వెఱువు దీర్చి
తోయపూరము సల్లి దూర్వాంకురంబులఁ
  జీరి నీపదము లర్చించునట్టి

తేటగీతి

భక్తియుక్తుఁడు లోకేశపదము నందు
నీవు ప్రత్యక్షముగ వచ్చి నేఁడు వేడ
నెఱిఁగి తన రాజ్యమంతయు నిచ్చినట్టి
బలికిఁ దగునయ్య దృఢపాశబంధనమ్ము!

iBAT సందర్భం

బలిని శిక్షించబోతున్న వామనప్రభువును బ్రహ్మదేవుడు స్వామీ! మ్ంత మహాభక్తుణ్ణీ బంధించటం న్యాయమా? అంటూ ఇలా వేడుకొన్నాడు.

iBAT తాత్పర్యము

ప్రాణిలోకాలన్నింటికీ ప్రభుడవు. ప్రాణుల యోగక్షేమాలన్నింటినీ అరసికొనేవాడవు అయిన దేవదేవా! జగన్నాథా! ఈ బలి తన సొమ్ము నంతా నీకు సమర్పించుకొన్నాడు. దండించదగినవాడు కాడు. గొప్ప దాత. నీదయకు యోగ్యుడు. ఇతనిని బంధంనుండి విముక్తుణ్ణి చెయ్యి, కరుణించు. ఇతనికి అభయం ఇచ్చి కాపాడు. ఇతడు స్వయంగా తన భవనం ఆవరణలో మట్టినేలలో నీళ్ళు చల్లి గరికను పెంచి వానితో నీ పాదాలకు అర్చన చేసే భక్తుడు. నీవు స్వయంగా వచ్చి అడిగితే తన రాజ్యమంతా ఇచ్చి వేశాడు. గురువు వద్దన్నా తన మాట వినలేదని శాపమిచ్చినా తన సర్వస్వమూ ఇచ్చి నిన్ను సంతృప్తిపరచిన మహాపురుషుడు. ఇట్టివానికి ఈ బంధమేల? అని బలిచక్రవర్తిని చుట్టుకొన్న పాశ బంధాన్ని తొలగించమని ప్రభువును ప్రార్ధించారు.
8-661 ఎవ్వనిఁ గరుణింప నిచ్ఛయించితి వాని... (సీసము).
iBAA పద్య గానం
iBAP పద్యము
ఎవ్వనిఁ గరుణింప నిచ్ఛయించితి వాని
  యఖిల విత్తంబు నే నపహరింతు
సంసారగురుమదస్తబ్ధుఁడై యెవ్వఁడు
  దెగడి లోకము నన్ను ధిక్కరించు
నతఁడెల్ల కాలంబు నఖిల యోనులయందుఁ
  బుట్టుచు దుర్గతిఁ బొందుఁ బిదప
విత్తవయోరూపవిద్యాబలైశ్వర్య
  కర్మజన్మంబుల గర్వముడిగి

తేటగీతి

యేకవిధమున విమలుఁడై యెవ్వడుండు
వాఁడు నాకూర్చి రక్షింపవలయువాఁడు
స్తంభ లోభాభిమాన సంసారవిభవ
మత్తుఁడై చెడనొల్లఁడు మత్పరుండు.

iBAT సందర్భం

బలిని శిక్షించవద్దని అంటున్న అందరి మాటలూ విని పరమాత్మ సావధానంగా అలా అన్నాడు

iBAT తాత్పర్యము

బ్రహ్మయ్యా! నేను ఎవనిని అనుగ్రహింపదలచుకొన్నానో వాని సర్వస్వాన్నీ అపహరిస్తాను. అంటే మమకారమనే మాయరోగాన్ని హరించి వేస్తాను. దానితో వాడు నాతో తాదాత్మ్యం పొందుతాడు. అలా కానినాడు పెద్దకాలం సంసారసాగరంలో పడి అతలాకుతలం అయి పోతూ ఉంటాడు. ఇప్పుడు ఈ బలి సంసారవిభవమత్తుడై చెడిపోకుండా రక్షించాను.
8-701 ఒక దినంబున శతయోజనమాత్రము... (సీసము).
iBAA పద్య గానం
iBAP పద్యము
ఒక దినంబున శతయోజనమాత్రము
  విస్తరించెడు నీవు వినుము చూడ
మిటువంటి ఝషముల నెన్నఁడు నెఱుఁగము
  మీనజాతుల కిట్టి మేను గలదె
యేమిటి కెవ్వఁడ నీ లీలఁ ద్రిప్పెదు
  కరుణ నాపన్నులఁ గావవేడి
యంభశ్చరంబైన హరివి నేనఱిఁగితి
  నవ్యయ నారాయణాభిధాన

తేటగీతి

జనన సంస్థితి సంహారచతురచిత్త
దీనులకు భక్తులకు మాకు దిక్కు నీవ
నీదు లీలావతారముల్ నిఖిలభూత
భూతి హేతువుల్ మ్రొక్కెదఁ బురుషవర్య

iBAT సందర్భం

ద్రవిడదేశపు రాజైన సత్యవ్రతుని చేతిలోనికి చేరిన చేవపిల్ల ఒక్కరోజులో శతయోజనపర్యంతమైన మహారూపాన్ని పొందింది. దానిని మహాసముద్రంలోనికి చేర్చబోగా ఆ చేప అయ్యో! తండ్రీ! నన్నీ సముద్రంలోని తిములు తిమింగలాలు తినివేస్తాయి. నన్ను విడిచి వెళ్ళిపోకు అని దీనంగా ప్రార్థించగా రాజు జూ అంటున్నాడు. ఒక దినంబున శతయోజనమాత్రము

iBAT తాత్పర్యము

మహాత్మా! నీవు రోజుకు వందయోజనాల లెక్కలో పెరిగిపోతున్నావు. ఇటువంటి జలచరాలను మేమెప్పుడూ కనీవినీ యెఱుగము. ఇదంతా ఏమిటి? అసలు నీవెవరు? ఆపదలో ఉన్నవారిని కాపాడటానికి నీవు దయతో ఈ వేషాలు వేస్తున్నావు. ఇప్పుడు నీళ్ళలో తిరుగాడే నీవు హరివే అని నా నిశ్చయమైన అభిప్రాయం. అవ్యయుడవైన నారాయణు డవే నీవు. ప్రాణికోటిని పుట్టించి పెంచి లీనం చేసుకొనే పరమతత్వంగా నిన్ను భావిస్తున్నాను. దీనులమైన భక్తులమైన మాకు దిక్కు నీవే. ఇవన్నీ నీ లీలావతారాలు. అట్టి నీకు మ్రొక్కటంకంటే మేము చేయ గలిగినది ఏమీ లేదు.

నవమ స్కంధం

9-40 అభిలాత్ముఁ డగుచున్న హరియందుఁ బరునందు... (సీసము).
iBAA పద్య గానం
iBAP పద్యము
అభిలాత్ముఁ డగుచున్న హరియందుఁ బరునందు
  భక్తితోఁ జాల తత్పరత మెఱసి
యూర్ధ్వరేతస్కుఁడై యున్న ప్రాణులకెల్ల
  నాప్తుఁడై సర్వేంద్రియములు గెలిచి
సంగంబునకుఁ బాసి శాంతుండు నపరిగ్ర
  హుండునై కోరకయుండి తనకు
వచ్చినయదియ జీవనము గావించుచుఁ
  దనుఁ దాన నిలుపుచు ధన్యబుద్ధి

తేటగీతి

జడుని తెఱఁగున నంధుని చందమునను
జెవిటి భంగిని మహి నెల్లఁ జెల్లఁ దిరిగి
యడవులకు నేఁగి కార్చిచ్చునందుఁ జొచ్చి
చిక్కి నియతుఁడై బ్రహ్మంబుఁ జెందె నతఁదు.

iBAT సందర్భం

తెలిసి చేసినా, తెలియక చేసినా తప్పు తప్పే. దానిని సరిదిద్దుకోవ టానికి గురువు ఒక మార్గాన్ని నిర్దేశించాడు. దానితోనే తాను గట్టెక్కాలి అనుకొన్నాడు పృషధ్రుడు. గురువుకు అంజలి ఘటించాడు. ఆయన అనుమతి తీసుకొని.

iBAT తాత్పర్యము

గురువు శాపానికి గుండెలో కుమిలిపోలేదు. పైగా అది తన కొక వరంగా భావించాడు. అఖిలాత్యుడైన హరి శూద్రునిలో మాత్రం ఎందు కుండడు అనికొన్నాడు. శూద్రుడైతే మాత్రం భద్రాత్ముని అనుగ్రహభాగ్యం పొందడా అనుకొన్నాడు. ఒక మహాకఠినమైన తపస్సును తనకు తానై ఏర్పరచుకొన్నాడు.

సర్వజీవుల లోపలా వెలుపలా నిత్యనూతనంగా వెలుగొందే శ్రీవారిని గుండెగుడిలో పదిలంగా నిలుపుకొన్నాడు. తన మూడు కరణాలనుండీ తదితరభావాలన్నింటినీ తుడిచి వేసుకొన్నాడు. ఇంద్రియాలమీద పట్టు చిక్కించుకొన్నాడు. కామవికారాన్ని కాలరాచి పారవేశాడు. ఎవరితో ఏవిధమైన తగులమూ లేకుండా ఎప్పటికప్పుడు తన్ను తాను రక్షించుకొన్నాడు. లోపలి వెలుపలి ఇంద్రియాలన్నింటినీ వశం చేసికొని అంతమైన చిత్తం సాధించాడు. ఎవరు ఏమి ఈయబోయినా తీసుకో లేదు. రాలిపడిన పండో, ఆకో తిని ప్రాణాలు నిలుపు కొన్నాడు. దాని వలన అతని బుద్ధి ధన్య అయినది. అంటే కోరికలు లేనితనంతో విరా జిల్లినది. చూచేవారికి వీడు ప్రాణాలున్నవాడేనా? గ్రుడ్డి వాడా, చెవిటి వాడా అనిపిస్తూ ఒకచోట నిలువక, దేనియందూ మమ కారం లేనివాడై తిరిగినాడు. అలా పోగా పోగా భయంకరమైన అడవులలోనికి కాళ్ళు తీసుకొని వెళ్ళాయి. కార్చిచ్చు నాలుగువైపులా వ్యాపించింది. అయినా ప్రాణాలు కాపాడుకోవాలి అనే భావనయే అతనికి కలుగలేదు. ఆవిధంగా సర్వమమ కారాలను కార్చిచ్చుకు అర్పణం చేసి బ్రహ్మముగా అయిపోయాడు.
9-60 ముసలితాపసుఁ బట్టి మొగి నెత్తుకొనిపోయి... (సీసము).
iBAA పద్య గానం
iBAP పద్యము
ముసలితాపసుఁ బట్టి మొగి నెత్తుకొనిపోయి
  మురుగు నా మడుగున మునిఁగి లేచి
వనితాజనము నెల్ల వలపించువారలై
  సుందరమూర్తులై సుభగులగుచుఁ
గమలమాలికలతోఁ గనకకుండలముల
  తో మంచిచీరలతోడఁ దుల్యు
లై సూర్యతేజస్కులై యున్నవారల
  మువ్వురఁ బొడఁ గాంచి ముగుదబాల

తేటగీతి

యిందుఁ బెనిమిటి వీఁడని యెఱుఁగలేక
గరిత గావున నిజనాథుఁ గానగోరి
సుభగమతులార నానాథుఁ జూపుఁ దనుచు
నశ్విదేవతలకపుడయ్యబల మ్రొక్కె

iBAT సందర్భం

చ్యవనుడు తనను యౌవనవంతుణ్ణి చేస్తే వారికి యాగభాగాలను కూరుస్తానన్నాడు. అశ్విదేవతలు సంతోషించారు. ‘ఇదిగో చూడు. ఈ మడుగు సిద్ధులు నిర్మించినది. దీనిలో మునుగు’ అని చ్యవనునితో పలికినారు

iBAT తాత్పర్యము

వెంటనే అశ్విదేవతలు ఆ ముసలి తాపసిని పట్టుకొని ఆ మురుగు మడుగులో ముంచివేశారు. తరువాత అందులోనుండి ముగ్గురు మనోహరాకారంతో యౌవనం తొలిదశలో ఉన్నవారై వెలుపలికి వచ్చినారు. వారి అందచందాలు ఆడువారందరికీ మోహం పుట్టిస్తున్నాయి. దానికితోడు చెవులకు బంగారు కుండలాలు, కంఠసీమలో కమల మాలికలు చూచిన వెంటనే ముచ్చటగొలిపే శ్రేష్టమైన వస్త్రాలూ, ధరించిఉన్నారు. కంటపడగానే ఆకట్టుకొనే రూపసంపద కలవారైన ఆ ముగ్గురూ ఒకేవిధమైన ఆకారంతో, సూర్యునితో సమానమైన తేజస్సుతో విరాజిల్లుతూ సుకన్యముందు వచ్చి నిలుచున్నారు. ఆమె ముగ్ధ, బాల, అంటే మనస్సులో కానీ, మాటలో గానీ, చేష్టలో గానీ కల్లాకపటం లేని వ్యక్తి. పతియందు మాత్రమే భావన నిరంతరంగా ఉండే శీలవతి. ఇప్పు డామెకు పెద్ద అగ్నిపరీక్ష వంటిది తటస్థపడింది. ముగ్గురూ ఒకే రూపంతో ఉన్నారు. ముగ్గురూ పరమ సుందరమూర్తులై ఉన్నారు. ముగ్గురూ మహావైభవాన్ని తెలియజేసే వస్త్రభూషణాదులతో అలరారుతున్నారు. ముగ్గురూ నవయౌవనంతో విరాజిల్లుతున్నారు. కానీ తనకు తన పతి మాత్రమే కావాలి. తక్కిన వ్యక్తి సాక్షాత్తు కామదేవుడైనా అక్కరలేదు. అయితే ఈ పరీక్షలో తానెలా సాఫల్యం పొందాలి? చివరకు ఆమె దృఢమైన నిశ్చయం చేసుకొని దైవం మీద అచంచల విశ్వాసం. కలది కాబట్టి అయ్యలారా! నాకు నా పతిని ప్రసాదించండి. అని ఆ దివ్యమూర్తులను ముగ్గురినీ ఉద్దేశించి ప్రార్థించింది. అశ్విదేవతలు ఆమె శీలానికి సంతోషించారు. వయోరూపసంపన్నుడైన చ్యవనుని చూపి తమ దారిని తాము వెళ్ళిపోయారు.
9-82 చిత్తంబు మధురపు శ్రీపాదములయంద... (సీసము).
iBAA పద్య గానం
iBAP పద్యము
చిత్తంబు మధురపు శ్రీపాదములయంద
  పలుకులు హరిగుణ పఠనమంద
కరములు విష్ణుమందిర మార్జనములంద
  శ్రవములు హరికథా శ్రవణమంద
చూపులు గోవింద రూపవీక్షణమంద
  శిరము కేశవ నమస్కృతులయంద
పదము లీశ్వర గేహ పరిసర్పణములందు
  కామంబు చక్రి కైంకర్యమంద

తేటగీతి

నంగ మచ్యుత జనగుణ సంగమంద
ఘ్రాణ మసురారి భక్తాంఘ్ర కమలమంద
రసన తులసీదళములంద రతులు పుణ్య
సంగతులయంద యా రాజచంద్రమునకు.

iBAT సందర్భం

ఏడు ద్వీపముల విశాలమైన భూభారాన్ని తన రెండుచేతులతో ధరించి, లక్ష్మీవైభవాన్ని పొందినవాడై, ఆ వైభవానికి తగిన చతురతను కలిగి, చెడునడవడిలేక, వైష్ణవార్చనలతో కాలాన్ని పుచ్చుతూ ఏమాత్రమూ కనుమరుపు లేక సద్గుణాలకు ఆకరమైనవాడైన ఆ అంబరీషుడు భూమిపై అలరారుతున్నాడు

iBAT తాత్పర్యము

ఆ అంబరీషుడు రాజులలో ఉత్తముడు. అంతే కాదు భక్తరాజు లలో కూడ భద్రమైన స్థానం కలవాడు. అతని అవయవాలన్నీ హరి ఆరాధనలో పరవశించిపోతూ ఉంటాయి. మనస్సు ఎల్లవేళలా మధుసూదనునియందే నిలిచి ఉంటుంది. పలికే పలుకులన్నీ హరిగుణములకు చెందినవే. చేతులు విష్ణుదేవాలయాలను ఊడ్చి శుభ్రం చేయటానికే ఆరాటపడుతూ ఉంటాయి. చెవులు విష్ణుకథలను వినటంకోసమే అన్నట్లుగా ఉంటాయి. చూపులు గోవిందుని రూపాన్ని తిలకించటమే కర్తవ్యం అనుకొంటాయి. తల కేశవనమస్కృతులతో ధన్యమవటానికి యత్నిస్తూ పరవశిస్తూ ఉంటుంది. కోరిక ఎప్పుడూ చక్రధారి కైంకర్యం మీదనే!
9-112 వినవయ్య! తండ్రి! యే విశ్వేశ్వరునియందుం... (సీసము).
iBAA పద్య గానం
iBAP పద్యము
వినవయ్య! తండ్రి! యే విశ్వేశ్వరునియందుం
  జతురాస్య జీవకోశములు పెక్కు
వేలసంఖ్యలు గూడి వేళతో నిబ్బంగి
  నగుచుండుఁ జనుచుండు నదియుఁగాక
నెవ్వానిచే భ్రాంతి నేమందుచున్నార
  మేను దేవలుఁ దసురేంద్రసుతుఁడు
నారదుఁ డజుఁడు సనత్కుమారుఁడు ధర్ము
  డా కపిలుఁడు మరీచ్యాదులఖిల

ఆటవెలది

నిర్ణరులును సిద్ధనివహ మెవ్వనిమాయ
నెఱుఁగలేము మూల మిట్టిదనుచు
నట్టి నిఖిలనాథునాయుధ శ్రేష్ఠంబుఁ
దొలఁగఁ జేయ మాకు దుర్లభంబు

iBAT సందర్భం

మహాదేవుడు ఒక వంక ఋషిమీద జాలీ, మరొక వంక విష్ణుని మీది చెలిమి ఊపివేస్తూ ఉండగా మెల్లగా ఇలా అన్నాడు.

iBAT తాత్పర్యము

నాయనా! మహర్షీ! తండ్రీ! కొంచెం నామాట విను. శ్రీమహా విష్ణువు విశ్వానికంతటికీ ఈశ్వరుడు. ఆయనలో నాలుగు మోముల దేవర పుట్టించే జీవకోశములు వేలసంఖ్యలలో ఉన్నాయి. ఆయా కాలా లలో అవి ఏర్పడుతూ ఉంటాయి. తిరిగి లోపలికి వెళ్ళిపోతూ ఉంటాయి. అంతేకాదు, మేమందరము ఒక పెద్ద భ్రాంతితో మామా పనులు చేసు కొంటూ ఉంటాము. నేనూ, అసితుడైన దేవలుడనే మునీ, రాక్షసరాజైన హిరణ్యకశివుని పుత్రుడైన ప్రహ్లాదుడనే మహాభక్తుడూ, నారదుడు, బ్రహ్మ, సనత్కుమారుడు, ధర్ముడు, కపిలుడు, మరీచి మొదలైన మహర్షులు, దేవతలు, సిద్ధులు, సాధ్యులు ఈ అందరమూ ఆ దేవదేవుని మాయను ఎఱుగలేక తెల్లమొగం వేస్తూ ఉంటాము. అటువంటి సర్వేశ్వరుని ఆయుధశ్రేష్టాన్ని అడ్డుకోగల శక్తి మాకెక్కడిది? నీవు, ఓ మునీంద్రా! వెనువెంటనే వైకుంఠానికి వెళ్ళు. శ్రీమహావిష్ణువును శరణము వేడు. అతడు అతదొక్కడే. - నీకు మేలు చేయ గలవాడు.
9-170 పడమటఁ బొడమెడు బాలచంద్రుని మాడ్కిఁ... (సీసము).
iBAA పద్య గానం
iBAP పద్యము
పడమటఁ బొడమెడు బాలచంద్రుని మాడ్కిఁ
  బూటపూటకు వృద్ధిఁబొందె బాలుఁ
డల్లన పరిపూర్ణ యౌవనారూఢుఁడై
  రావణాదిరిపుల రాజవరుల
దండించి తనుఁ ద్రసదస్యుఁడంచు సురేంద్రుఁ
  దంకింప శూరుఁడై యఖిలదేవ
మయు నతీంద్రియువిష్ణు మాధవు ధర్మాత్ము
  నజుని యజ్ఞాధీశు నాత్మఁ గూర్చి

ఆటవెలది

చేసెఁ గ్రతువులు భూరిదక్షిణల నిచ్చి
ద్రవ్య యజమాన విధి మంత్రయజ్ఞ
కాల ఋత్విక్ర్పదేశముఖ్యంబు లెల్ల
విష్ణురూపంబులనుచు భావించి యతఁడు

iBAT సందర్భం

మాంధాత కథను పరీక్షిన్మహారాజుకు వివరిస్తున్నారు శ్రీశుకయోగీంద్రులు

iBAT తాత్పర్యము

విదియనాడు పడమటి దిక్కున రేఖలాగా కన్పట్టే చంద్రుడు క్రమక్రమంగా వృద్ధిపొంది పూర్ణస్వరూపం పొందినట్లుగా మాంధాత అభివృద్ధి చెందాడు. రావణుడు మొదలైన శత్రువులను, ఇంకా దుష్ప్రవర్తన గల గొప్ప రాజులను దండించి యింద్రునిచేత ‘త్రసదస్యుడు’ అనే పరాక్రమనామం పొందాడు. (త్రస, దస్యుడు - వెరగు పొందిన రక్కసులు కలవాడు). సర్వదేవమయుడు, ఇంద్రియముల పరిధులకు లోబడని వాడు, అంతటా వ్యాపించి ఉండేవాడు, లక్ష్మీపతి, ధర్మస్వరూపుడు, పుట్టుక లేనివాడు, యజ్ఞములకు ప్రభువు అయిన పరమాత్మను గూర్చి పెక్కు యజ్ఞాలు ఆచరించాడు. గొప్ప దక్షిణలు యోగ్యులకు సమర్పించాడు. మరొక విశేషం ఏమంటే, ద్రవ్యములు (యజ్ఞంలో ఉపయోగించే వస్తువులు), యజమానుడూ (యజ్ఞం చేసే వ్యక్తి), విధి (క్రియాకలా పము), మంత్రము (వేదమంత్రాలు), ధర్మయజ్ఞము (ధర్మరూపమైన యజ్ఞము), కాలము (యజ్ఞం ఆచరించే సమయము), ఋత్విక్యులు (బ్రహ్మ, హెూత, ఉద్గాత, అధ్వర్యువు అనే వ్యవహారనామములు కల వేదమంత్రతంత్రయంత్రతత్వాలెరిగిన విప్రవర్యులు), ప్రదేశము (యాగ శాల) అనే ఇవన్నీ విష్ణురూపాలేయని సంభావిస్తూ యాగాలు చేశాడు. అంటే “సర్వం విష్ణుమయం జగత్” జగత్తు అంతా విష్ణుమయమే అనే తాత్వికరహస్యాన్ని నిరంతరం స్ఫురణలో ఉంచు కొన్నవాడు ఆ మాంధాత. అందువలననే అతడు పుణ్యశ్లోకుడు, అంతేకాదు, తన క్షత్రియధర్మాన్ని ఏమాత్రమూ ఉపేక్షింపలేదు. పగవారినందరినీ అణచివేశాడు. సూర్యుడు, చంద్రుడు తమ కిరణాలను ప్రసరింపజేసిన సర్వభూములలో తన యాజ్ఞ చెల్లునట్లుగా పరిపాలించాడు. అయితే అది తన నిర్వాకం అని భావించలేదు. అంతా ఆ శ్రీమన్నారాయణుని దివ్యానుగ్రహం అనే నిశ్చయ జ్ఞానంతో పరిపాలన చేశాడు. లక్ష్మీదేవి అతని విషయంలో పరిపూర్ణాను గ్రహం పసరింపజేసింది.
9-196 పురిటిలోపల వచ్చి పుత్రు వేలువు మన్నఁ... (సీసము).
iBAA పద్య గానం
iBAP పద్యము
పురిటిలోపల వచ్చి పుత్రు వేలువు మన్నఁ
  బురుడు వోయినఁగాని పొసఁగదనియెఁ
బలురాకమును వచ్చి బాలు వేలుపు మన్నఁ
  బండ్లు లేకుంట సభావ్యుఁడనియెఁ
బండ్లు రాఁజూచి ఢింభకుని వేలువుమన్నఁ
  బడిపండ్లు రామి నభావ్యుఁడనియెఁ
బడిపండ్లు వొడమినఁ గొడుకు వేలువుమన్నఁ
  బోరుల కొదవక పోలదనియెఁ

ఆటవెలది

దొడరి యిట్లు గొడుకుతోడి మోహంబునఁ
బ్రొద్దు గడపుచుండె భూవరుండు
దండ్రి తలఁపు కొలఁదిఁ దనలోనఁ జింతించి
యింట నుండ కడవికేఁగెఁ గొడుకు,

iBAT సందర్భం

హరిశ్చంద్రుడు వరమిచ్చే దేవుడు వరుణుడు అడగకముందే, కొడుకు పుడితే వానిని బలిపశువుగా చేసి యజ్ఞం చేస్తానని నోరుజారాడు. దీనినే కర్మప్రాబల్యం అంటారు. ఆ కర్మప్రాబల్యం తీసి ప్రక్కన పెట్టటానికి సామర్ధ్యంలేని వరుణదేవుడు యజ్ఞం మాట ఏమిటి? అని భూవరుని అడగటం, అతడేవేవో కారణాలు చెప్పి పుత్రవ్యామోహాన్ని తెంచుకోలేక అవస్థపడుతూ ఉండటం సంభవించింది.

iBAT తాత్పర్యము

పుట్టినవెంటనే అడిగితే పురుడు పోనీ అన్నాడు. పురుడు పోయిన తరువాత అడిగితే పండ్లు రానీ అన్నాడు. పండ్లు వచ్చిన తరువాత హెచ్చరిస్తే పాలపండ్లు పోయి గట్టిపండ్లు వచ్చినప్పుడు యోగ్యత కలుగు తుందని దాటవేశాడు. పాలపండ్లు ఊడటం గట్టి పండ్లు కుదురుకోవటం అయిన తరువాత రాజకుమారుడు యుద్ధవిద్యలో ఆరితేరిన తరువాతనే కదా నిజమైన యోగ్యత పొందేది అని వరుణుణ్ణి ఏమరచటానికి ప్రయత్నించాడు. వరుణదేవుడు పట్టువదలక వస్తూనే ఉన్నాడు. హరిశ్చంద్రుడు ఏదో సాకు చెప్పి తప్పించుకొంటున్నాడు. ఇదంతా గమనిస్తూనే ఉన్నాడు రోహితుడు. తండ్రికి, ఏదో విధంగా తనయ మమకారం వదలగొట్టాలనే తలపుతో ఇంటినుండి వెళ్ళిపోయి అడవులలో తిరుగనారంభించాడు.
9-693 మిళితాళినీలధమ్మిల్ల భారంబులు... (సీసము).
iBAA పద్య గానం
iBAP పద్యము
మిళితాళినీలధమ్మిల్ల భారంబులు
  చారు జటావిశేషంబులనియు
భర్మాంచలోజ్జ్వలప్రభదుకూలంబులు
  తతచర్మభేదంబులనియు
బహురత్నకీలిత భాసురహారంబు
  లధికరుద్రాక్షమాలాదులనియు
మలయజమృగనాభిమహితలేపంబులు
  బహువిధభూతిలేపంబులనియు

తేటగీతి

మధురగానమ్ము శ్రుతియుక్తమంత్రజాతు
లనియు వీణెలు దండంబులనియు సతుల
మూర్తులెన్నఁడు నెఱుఁగని ముగుర తపసి
వారిఁ దాపసులనియు దాయ వచ్చి మ్రొక్కె.

iBAT సందర్భం

రోమపాదుడు ఋష్యశృంగుణ్ణి తేవటానికి వేశ్యలను కొందరిని పంపారు. అప్పుడు వారిలో వారు, చెలులారా! ఆ ఋషి కుమారుడు ఒక లేడికి పుట్టినాడట! ఆడా మగా తేడా కూడా తెలియనివాడట! అతని మదిలో మన్మథవికారం పుట్టించాలి అనుకొంటూ విభాండకుని ఆశ్రమంలోనికి చేరుకొన్నారు. వారిని చూచి ఋష్యశృంగుడు -

iBAT తాత్పర్యము

ఇంతవరకు ఆడువారిని ఎప్పుడూ ఎరిగి ఉండనివాడు కనుక తుమ్మెదల గుంపుల కాంతులతో విరాజిల్లు వారి కొప్పుముడులను మునుల జటలు గుంపులుగా సంభావించాడు. బంగారు జరీచీరలను చూచి అవి ఒక రకం చర్మంతో చేసిన వస్త్రాలనుకొన్నాడు. వజ్రము, వైడూర్యం మొదలైన రత్నాలతో వెలిగిపోతున్న బంగారు హారాలను రుద్రాక్షమాల లనుకొన్నాడు. మంచిగందము, కస్తూరి మొదలైన సుగంధద్రవ్యాల మైపూతలను పెక్కు విధాలైన విభూతి రేఖలుగా భావించాడు. చక్కని శ్రుతితో వినటానికి వింతగా ఉన్న పాటలను మంత్రాల నాదాలుగా ఊహించాడు. వీణలను సన్యాసులు పట్టుకొనే దండాలుగా తలచినాడు. వీరంతా గొప్ప తాపసులనుకొని వాళ్ళ కాళ్ళమీద పడి మ్రొక్కారు.

దశమ స్కంధం

10-14 రాజేంద్ర! విను తొల్లి రాజలాంఛనముల... (సీసము).
iBAA పద్య గానం
iBAP పద్యము
రాజేంద్ర! విను తొల్లి రాజలాంఛనముల
  వేలసంఖ్యల దైత్యవిభులు తన్ను
నాక్రమించిన భార మాగఁజాలక భూమి
  గోరూపయై బ్రహ్మఁ జేరఁ బోయి
కన్నీరు మున్నీరుగా రోదనము సేయఁ
  గరుణతో భావించి కమలభవుఁడు
ధరణి నూఱడఁ బల్కి ధాత్రియు వేల్పులుఁ
  గదలిరా విష్ణునిఁ గాన నేఁగి

తేటగీతి

పురుషసూక్తంబుఁ జదివి యద్భుతసమాధి
నుండి యొకమాట విని వారిజోద్భవుండు
వినుఁడు వేల్పులు ధరయు నే విన్నయట్టి
పలుకు వివరింతునని ప్రీతిఁ బలికెఁ దెలియ.

iBAT సందర్భం

పరీక్షిన్మహారాజుకు శ్రీమహావిష్ణువు శీలంగల యదుకులంలో ఏ కారణంగా, ఏవిధంగా అవతరించాదు? ఏవిధంగా ప్రవర్తించాడు అనే విషయం తెలుసుకోవాలనిపించింది. శుకులవారిని అడుగగా ఆయన పీఠికాప్రాయంగా ఇలా చెప్తున్నారు.

iBAT తాత్పర్యము

నాయనా! పరీక్షిత్తూ! విను. మునుపొకప్పుడు వేలసంఖ్యల రక్కసి మూకలు రాజచిహ్నాలు ధరించి భూమినంతా వశం చేసుకొన్నారు. నేలతల్లి ఆ బరువును మోయలేకపోయింది. ఆవుగా అయి బ్రహ్మగారి దగ్గరకు పోయి కన్నీరుమున్నీరుగా దుఃఖించింది. బ్రహ్మకు జాలి కలిగింది. ఆమెను ఓదార్చి దేవతలను కలుపుకొని విష్ణువునకు విన్నవించటానికి బయలుదేరాడు. ముందు గా పురుషసూక్త మంత్రాలు పఠించి స్వామిని ప్రసన్నుణ్ణి చేసుకొన్నాడు. శ్రీమన్నారాయణుడు బ్రహ్మకు ఒక మాట చెప్పాడు. దానిని మెల్లగా బ్రహ్మయ్య భూదేవికీ, దేవతలకూ వివరించాడు.
10-29 మేనితోడనె పుట్టు మృత్యువు జనులకు... (సీసము).
iBAA పద్య గానం
iBAP పద్యము
మేనితోడనె పుట్టు మృత్యువు జనులకు
  నెల్లి నేఁడైన నూఱేండ్లకైనఁ
దెల్లంబు మృత్యువు దేహంబు పంచత
  నందఁ గర్మానుగుఁడై శరీరి
మాఱుదేహము నూఁది మఱి తొంటి దేహంబుఁ
  బాయును దనపూర్వభాగమెత్తి
వేఱొంటిపైఁ బెట్టి వెనుకభాగం బెత్తి
  గమనించు తృణజలూకయును బోలె

తేటగీతి

వెంటవచ్చు కర్మవిసరంబు మును మేలు
గన్నవేళ నరుఁడు కన్నవిన్న
తలఁపఁబడిన కార్యతంత్రంబు కలలోనఁ
బాడితోడఁ గానఁబడిన యట్లు.

iBAT సందర్భం

బయలాడిన పలుకు విని కంసుడు దేవకీదేవి తల నరకబోయాడు. వసుదేవుడు మంచిమాట లతో అతని పూనికను మాన్చటానికి ప్రయత్నిస్తూ ఇలా జీవతత్త్వాన్నిగురించి బోధిస్తున్నాడు

iBAT తాత్పర్యము

బావా! జనాలు పుట్టినప్పుడే చనిపోవటం అనేది ఉంటుంది. అది నేడు కావచ్చు. రేపు కావచ్చు. వందయేండ్లకయినా కావచ్చు. అయిదుభూతాల కలయికగా ఏర్పడిన దేహం మళ్ళీ అయిదు భూతాలుగా విడిపోతుంది. దానినే చావు అంటారు. అయితే దేహం చస్తుంది కానీ దేహంలో ఉన్న జీవుడు చావడు. మరొక దేహాన్ని చూచుకొని ప్రవేశిస్తాడు. కాలువలో నీటిలో గడ్డిమొక్కలు ఉంటాయి. జలగ ఒక పరకను ఆధారం చేసుకొని తిరుగుతూ ఉంటుంది. మరొక పరకమీద తన దేహాన్ని పోనిచ్చి పట్టుచిక్కించుకొని వెనుక పరకను వదలిపెట్టివేస్తుంది. ఇటువంటి తృణజలూకా న్యాయాన్ని గమనిస్తే చావుపుట్టుకలు అంటే ఏమిటో అర్థం అవుతుంది. జీవునితోపాటు కర్మవాసనలు వెంటనంటి ఉంటాయి. పూర్వజన్మకార్యవిశేషాలన్నీ తరువాతి జన్మలో కలలోని దృశ్యాలలాగా కాన వస్తూ ఉంటాయి.
10-89 సత్యవ్రతుని, నిత్యసంప్రాప్తి సాధనుఁ... (సీసము).
iBAA పద్య గానం
iBAP పద్యము
సత్యవ్రతుని, నిత్యసంప్రాప్తి సాధనుఁ
  గాలత్రయమునందుఁ గలుగువాని,
భూతంబు లైదును బుట్టుచోటగువాని,
  నైదుభూతంబులందమరువాని,
నైదుభూతంబులు నడఁగిన పిమ్మటఁ
  బరఁగువానిని, సత్యభాషణంబు
సమదర్శనంబును జరిపెడివానిని,
  నిన్నాశ్రయింతుము, నీయధీన

ఆటవెలది

మాయచేత నెఱుకమాలినవారలు
పెక్కుగతుల నిన్నుఁ జేరుకొందు
రెఱుఁగ నేర్చు విబుధు లేకచిత్తంబున
నిఖిలమూర్తులెల్ల నీవయండ్రు.

iBAT సందర్భం

దుష్టశిక్షణకోసం దేవకి గర్భంలో ప్రవేశించి అవతరించబోతున్న శ్రీమహావిష్ణువు మహిమను బ్రహ్మ మొదలైన దివ్యవ్యక్తులు ఇలా స్తుతిస్తున్నారు

iBAT తాత్పర్యము

స్వామీ! నీవు సత్యవ్రతుడవు. చావుపుట్టుకలు లేని సద్గతికి చేరుకోవటానికి నిన్ను స్తుతించటం గొప్ప సాధనం. నేల, నీరు, నిప్పు, గాలి, నింగి అనే అయిదు మహాభూతాలూ నీనుండియే పుట్టాయి. నీవు భూతము, వర్తమానము, భవిష్యత్తు అనే మూడు కాలాలలో ఒకే విధంగా ఏ వికారాలూ లేకుండా ఉంటావు. నీనుండి ఏర్పడే అయిదు భూతాలలోనూ నీవు ఉంటావు. ప్రళయసమయంలో ఆ అయిదు భూతాలను మళ్ళీ నీలోపలికి తీసుకొని భద్రంగా ఉంచుకొంటావు. నీది సత్యభాషణం. సమదర్శనం. ఇన్ని గొప్ప లక్షణాలతో నిరంతరమూ అలరారుతూ నీవు కాక ఇంకెవ్వరు మాకు ఆశ్రయం ఇవ్వ గలరు? ప్రకృతి అయి కానవచ్చే మాయ నీ చెప్పుచేతలలో మెలగుతూ ఉంటుంది. ఒక్కొక్కప్పుడు అది జనుల కన్నుగప్పి నిన్ను పెక్కువిధాలయినవానినిగా చూపుతుంది. గొప్ప జ్ఞానసంపదను పండించు కొన్న మహాత్ములు ఆ పెక్కువిధాలలో ఒక్కడవే అయిన నిన్ను మాత్రమే దర్శించి ఆనందమందుతూ ఉంటారు.
10-91 ప్రకృతి యొక్కటి పాదు, ఫలములు సుఖదుఃఖ... (సీసము).
iBAA పద్య గానం
iBAP పద్యము
ప్రకృతి యొక్కటి పాదు, ఫలములు సుఖదుఃఖ
  ములు రెండు, గుణములు మూడు వేళ్ళు,
తగురసంబులు నాల్గు ధర్మార్థముఖరంబు
  లెఱిఁగెఁడి విధములైంద్రియములు,
నాఱుస్వభావంబు లాశోకమోహాదు
  లూర్ములు, ధాతువు లొక్క యేడు,
పైపొర లెనిమిది, ప్రంగలు భూతంబు
  లైదు బుద్ధియు మనో౽హంకృతులును,

తేటగీతి

రంధ్రములు తొమ్మిదియుఁ గోటరములు, ప్రాణ
పత్రదశకంబు, జీవేశపక్షియుగముఁ
గలుగు సంసారవృక్షంబుఁ గలుగఁ జేయఁ
గాన నడఁగింప రాజ వొక్కరుఁడ వీవ.

iBAT సందర్భం

దేవకి గర్భంలో అర్భకుడుగా రూపం దిద్దుకొంటున్న శ్రీమన్నారాయణుని తత్త్వరహస్యాలను బ్రహ్మ మొదలైన జ్ఞానవేత్తలు ఇలా చెప్పుకొని ఆనందమందుతూ ఉన్నారు. ముందుగా సంసారవృక్ష మును విశ్లేషించి వక్కాణిస్తున్నారు

iBAT తాత్పర్యము

సర్వేశ్వరా! ప్రభూ! ఇదిగో ఈ సంసారం అనేది ఒక వింత చెట్టు. దీనికి పాదు ప్రకృతి. (త్రిగుణముల సముదాయమై కానవచ్చే ప్రపంచం). ఈ చెట్టుకు కాచే పండ్లు రెండు. సుఖము, దుఃఖము అనేవి. దీని గుణాలు మూడు. సత్త్వము, రజస్సు, తమస్సు అనేవి. అవియే ఈ చెట్టువేళ్ళు. దీనినుండి వెలువడే రసాలు నాలుగు. ధర్మము, అర్థము, కామము, మోక్షము అనే పురుషార్థాలు. లోకతత్త్వములైన విషయాలను తెలిసికొనే ఇంద్రియాలు అయిదు. చర్మము, కన్ను, చెవి, నాలుక, ముక్కు అనేవి. ఇంద్రియవిషయాలు స్పర్శ, రూపము, శబ్దము, రసము, వాసనలు. ఈ చెట్టు స్వభావములు ఆరు. ఆకలి, దప్పి, శోకము, మోహము, ముసలితనము, చావులు షడూర్ములని వీనిని అంటారు. ఈ చెట్టులోపల ఏడు ధాతువులు (మూలపదార్థాలు) ఉంటాయి. అవి రక్తము, మాంసము, వస, మేదస్సు, ఎముకలు, నరములు, మజ్జ (ఎముకల కదలికలకు సహకరించే జిడ్డుపదార్థం). బుద్ధి మనస్సు, అహంకారము అనే సూక్ష్మదేహం స్వరూపము. తొమ్మిది రంధ్రాలు (రెండు కన్నులు, రెండు చెవులు, నోరు, రెండు ముక్కురంధ్రాలు, పాయువు, ఉపస్థ) అనేవి ఈ చెట్టుకుండే తొఱ్ఱలు. ప్రాణము లనే ఆకులు పది (ప్రాణము, అపానము, వ్యానము, ఉదానము, సమానము అనే అయిదువిధములైన వాయువులు, నాగము, కూర్మము, కృకరము, దేవదత్తము, ధనంజయము అనే అయిదు ఉపవాయు వులు) ఇటువంటి సంసారం అనే చెట్టును ఆశ్రయించుకొని జీవుడు – ఈశ్వరుడు అనే రెండు పక్షులు ఉన్నాయి. ఆచెట్టును పుట్టించడానికీ, అడగించటానికీ సమర్థుడవు నీవు ఒక్కరుడవే
10-97 నళినాక్ష! సత్త్వగుణంబు నీగాత్రంబు... (సీసము).
iBAA పద్య గానం
iBAP పద్యము
నళినాక్ష! సత్త్వగుణంబు నీగాత్రంబు
  కాదేని విజ్ఞానకలితమగుచు
నజ్ఞానభేదకంబగుటెట్లు గుణముల
  యందును వెలుఁగ నీవనుమతింపఁ
బడుదువు సత్త్వరూపంబు సేవింపంగ
  సాక్షాత్కరింతువు సాక్షివగుచు
వాఙ్మనసముల కవ్వలిదైన మార్గంబు
  గలుగు నీగుణజన్మకర్మరహిత

తేటగీతి

మైన రూపును బేరు సత్యఘనబుద్ధు
లెరుగుదురు నిన్నుఁ గొల్వ నూహించుకొనుచు
వినుచుఁ దలఁచుచు బొగడుచు వెలయువాఁడు
భవము నొందఁడు నీపాదభక్తుఁడగుచు.

iBAT సందర్భం

బ్రహ్మ మొదలైన మహాతత్త్వవేత్తలు, ఎట్టి జ్ఞానం కలవాడు సంసారం అనే సముద్రంలో మునిగి నాశనం అయిపోడో శ్రీమహావిష్ణువుకు నివేదించుకొంటున్నారు. ఆ నివేదనను పోతన్న మహా కవి పాఠకులకు ఇలా తెలియజేస్తున్నారు

iBAT తాత్పర్యము

పుండరీకాక్షా! ఇతరగుణాల స్పర్శ ఆవంతకూడా లేని శుద్ధసత్త్వగుణమే నీదేహం. అందు వలన అది విజ్ఞానంతో కూడి ఉన్నదై అజ్ఞానాన్ని రూపుమాపుతుంది. తక్కినగుణాలలో కూడా నిన్ను జ్ఞానులు దర్శించుకొంటారు. నీ సత్త్వరూపాన్ని చక్కగా తెలుసుకొన్ని నిన్ను సేవిస్తే నీవు సాక్షి మాత్రంగా సాక్షాత్కరిస్తావు. మాటలకూ, మనస్సుకూ అందని నీవారిని భక్తులు నీ శుద్ధసత్త్వస్వరూ పాన్ని సేవించుకొంటే అందుకోగలుగుతారు. నీకు గుణాలూ, పుట్టుకలూ, కర్మములూ, నామ రూపాలూ లేవు. అట్టి తత్త్వాన్ని అత్యంతపుణ్యం ఆర్జించుకొన్నవారు మాత్రమే తెలుసుకోగలుగుతారు. నిన్ను మనస్సులో భావిస్తూ, నీ తత్త్వాన్ని వింటూ, కొనియాడుతూ ఉండే భక్తుడు సంసారలంపటంలో చిక్కుకొనడు. ఎందుకంటే అతనికి నీపాదాలమీద భక్తి సుస్థిరంగా నెలకొని ఉంటుంది
10-112 జలధేరుదేహు, నాజాను చతుర్బాహు... (సీసము).
iBAA పద్య గానం
iBAP పద్యము
జలధేరుదేహు, నాజాను చతుర్బాహు
  సరసీరుహాక్షు, విశాలవక్షు,
చారుగదాశంఖచక్రపద్మవిలాసుఁ
  గంఠకౌస్తుభమణి కాంతిభాసుఁ,
గమనీయ కటిసూత్రకంకణకేయూరు,
  శ్రీవత్సలాంఛనాంచితవిహారు,
నురుకుండల ప్రభాయుతకుంతల లలాటు,
  వైదూర్యమణిగణవరకిరీటు,

తేటగీతి

బాలుఁ, బూర్ణేందురుచిజాలు, భక్తలోక
పాలు, సుగుణాలవాలుఁ, గృపావిశాలుఁ,
జూచి, తిలకించి, పులకించి, చోద్యమంది,
యుబ్బి, చెలరేగి వసుదేవుఁ డుత్సహించె.

iBAT సందర్భం

శ్రీమహావిష్ణువు దేవకీదేవి గర్భంనుండి మెల్లగా వెలుపలికి వచ్చాడు. అవతరించాడు. లీలగా దేవకీవసుదేవులకు తన నిజరూపంతో సాక్షాత్కరించాడు. వసుదేవునకు కానవచ్చిన ఆ దివ్యరూపాన్ని పోతనగారు అమృతంవంటి పలుకులతో మన కందిస్తున్నారు.

iBAT తాత్పర్యము

వెనుకటి జన్మలలో చేసిన పుణ్యవిశేషంవలన వసుదేవునకు పసిబిడ్డ పరమాత్మరూపంతో కన్పట్టాడు. నల్లనిమేఘంవంటి మేనిచాయ, మిక్కిలి పొడవైన నాలుగు చేతులు, విచ్చుకొన్న కమలాల వంటి కన్నులు, విశాలమైన వక్షఃస్థలము, కమనీయంగా కదలాడుతున్న శంఖము, చక్రము, గద, పద్మము, మెడలో కాంతులను పుక్కిలిస్తున్నదా అన్నట్లు కానవచ్చే కౌస్తుభమణి, వంపుసొంపులతో చూడముచ్చటగా ఉన్న బంగారు మొలత్రాడు, కంకణాలూ, కేయూరాలూ, నన్ను చూడు నా అందం చూడు అంటున్న శ్రీవత్సమనే పుట్టుమచ్చ, కేశముల నడుమ దోబూచులాడుతున్న కుండలాలు, వైడూర్యాలతో, పెక్కువిధాలైన మణుల కుప్పల కూర్పుతో వెలిగిపోతున్న కిరీటము – ఓహో! సృష్టిలోని అందచందాలన్నీ ఒక్కచోట రాశిపోసినట్లుగా ఉన్నాడు స్వామి. మోము నిండుచందురుని మెండు వన్నెచిన్నెలతో పండువెన్నెలలను కురిపిస్తున్నది. మేనిగుణాలే కాదు, లోని గుణాలు కూడా స్ఫురిస్తున్నాయి. కన్నులలో కృపారసం జాలువారుతూ ఉన్నది. వసుదేవునికి ఎంతసేపు చూచినా తనివితీరటం లేదు. పులకించిపోతున్నాడు. పొంగిపోతున్నాడు. ఆనందంతో ఆటలాడుతూ, పాటలు పాడుతూ పరవశించిపోతున్నాడు.
10-118 అదియు నెట్లన మహదాదులఁ బోలెడి... (సీసము).
iBAA పద్య గానం
iBAP పద్యము
అదియు నెట్లన మహదాదులఁ బోలెడి
  వై, వేఱువేఱయై, యన్నివిధము
లగు సూక్ష్మభూతంబు లమర, షోడశ
  వికారములతోఁ గూడి విరాట్టనంగ
బరమాత్మునకు నీకు బఱపైన మేను,
  సంపాదించి, యందులోఁ బడియుఁ బడక
యుండు సృష్టికి మున్న యున్న కారణ
  మున, వానికి లోని భవంబు గలుగ

ఆటవెలది

దట్లు బుద్ధి నెఱుఁగ నను వైన లాగునఁ
గలుగు నింద్రియముల కడలనుండి
వాని పట్టులేక వరుస జగంబుల
గలసియుండి యైనఁ గలయవెపుడు.

iBAT సందర్భం

వసుదేవుడు పసిపిల్లవానికి సాష్టాంగదండనమస్కారం చేశాడు. చేతులు రెండూ ఒకటిగా కూర్చుకొని ఫాలభాగాన చేర్చుకొన్నాడు. విష్ణుమాయను గూర్చి వివరించుకొంటున్నాడు.

iBAT తాత్పర్యము

మొట్టమొదట అది ఒక అనంతమైన అవ్యక్తమైన ఊహల కందని పరమాత్మ తత్త్వం. దాని నుండి మహత్తు, ప్రకృతి, అహంకారము అనే తత్త్వాలు – ఇవన్నీ ఒక్కటేనా? వేరు వేరా అని తెలియ టానికి వీలు లేకుండా తోస్తూ ఉన్నాయి. మహత్తు అంటే సత్త్వము, రజస్సు, తమస్సు అనే గుణాల సంపర్కం లేని ఆత్మతత్త్వం. ఆ గుణాల సమాహారంతో ఏర్పడిన అయిదు భూతాల కలయికయే ప్రకృతి. సర్వజీవులలో నేను అనే తీరులో తెలియవచ్చే తత్త్వమే అహంకారం. అయిదు మహా భూతాలూ, అయిదు ఇంద్రియాలూ, అయిదు విషయాలూ, మనస్సు అనే మొత్తం పదునారు వికారా లుగా తెలియవచ్చే తత్త్వాన్నే విరాట్టు అంటారు. అది పరమాత్మవైన నీకు అత్యంతవిశాలంగా ఏర్ప రచుకొన్న మేను. అయితే అందులో నీవు నిజంగా ఉన్నావా? అని నిశ్చయించి చెప్పటం అంత సులభం కాదు. ఆ సృష్టికి ముందు కూడా నీవు ఉన్నావు కనుక అందులో మాత్రమే ఉన్నవాడవు అన లేము. సృష్టించిన తరువాత నీ తత్త్వం అందులో తెలియవస్తున్నది కనుక నీవందులో లేవు. అని కూడా అనలేము. అనంతమూ, అప్రమేయమూ అయిన నీ తత్త్వాన్ని అందులో ప్రవేశపెట్టి నీవు విడిగా ఇంకా అనంతంగా ఉన్నావు. అని బుద్ధి ఇంద్రియాలు మొదలైన వానిద్వారా తెలుస్తున్నది.
10-126 అట్టిట్టనరానిదై, మొదలై, నిండు... (సీసము).
iBAA పద్య గానం
iBAP పద్యము
అట్టిట్టనరానిదై, మొదలై, నిండు
  కొన్నదై, వెలుఁగుచు, గుణము లేని
దై, యొక్క చందంబుదై, కలదై, నిర్వి
  శేషమై, క్రియలేక, చెప్పరాని
దే రూపమని శ్రుతులెప్పుడు నొడివెడి
  నారూపమగుచు, నధ్యాత్మదీప
మై బ్రహ్మ రెండవయర్థంబు తుది జగం
  బులు నశింపఁగఁ, బెద్దభూతగణము

ఆటవెలది

సూక్ష్మభూతమందుఁ జొరఁగ, నాభూతంబు
ప్రకృతిలోనఁ జొరఁగఁ బ్రకృతి వోయి
వ్యక్తమందుఁ జొరఁగ, వ్యక్తమడంగను
శేషసంజ్ఞ నీవు చెలువ మగుదు.

iBAT సందర్భం

ఎన్నో నోములు నోచి కన్నయ్యకు కన్నతల్లి కాగలిగింది దేవకీదేవి. ఆ సంస్కారబలంతో పరమాత్మ తత్త్వాన్ని ఉపనిషత్తుల స్థాయికి ఎదిగి మనకు తెలియజేస్తున్నది ఆ దేవకీమాత –

iBAT తాత్పర్యము

పరమాత్మా! నీ తత్త్వం ఇటువంటిది అని ఎవ్వరూ నిరూపించలేనట్టిది. అంటే దానివంటిది సృష్టిలో మరొకటి లేదు కావున పోలికనుబట్టి అయినా గుర్తించటానికి వీలులేనిది. దానికి సనాతనము అని ఒక వ్యవహారము. అంటే సృష్టి ఏర్పడకముందునుండీ ఉన్నటువంటిది. దానికి ఎల్లలు లేవు. అంటే అనంతమైనది. అది ఎల్లప్పుడూ ప్రకాశిస్తూనే ఉంటుంది. ఆ స్థితిలో దానికి ఎట్టి గుణాలూ ఉండవు. ఒక్కటి అయి ఉంటుంది. దానికి ఏ విశేషాలూ, ఏ క్రియలూ, ఏ రూపమూ లేదు. వేదములు ఏ రూపం ఉన్నట్లు వర్ణిస్తే ఆ రూపంతో తెలియవస్తుంది. అది జీవుల దేహాలలో ఒక దీపం అయి ఉంటుంది.

బ్రహ్మ ఆయువును రెండు సమభాగాలుగా భావిస్తే రెండవదానిని ద్వితీయపరార్థం అంటారు. అది ముగిసే సమయంలో ఆకాశములైన అయిదు భూతాలతో ఏర్పడిన జగత్తులన్నీ ఒక్కటిగా కలసి పోతాయి. దానినే ప్రళయం అంటారు. అప్పుడా భూతాల కలయికను ప్రకృతి అంటారు. అది పోయి మహత్తు అనే తెలియవచ్చే స్వరూపంలో కలసిపోతుంది. తరువాత వ్యక్తం అయిపోతుంది. అంటే దానికి అటుపైని నామరూపాలు ఉండవు. స్వామీ! అప్పుడు నీవు ఒక్కడవు మిగిలి ఉంటావు. అందుకే నిన్ను ‘శేషుడు’ అంటారు.
10-194 ఏ బాము, లెఱుఁగక యేపారు మేటికిఁ... (సీసము).
iBAA పద్య గానం
iBAP పద్యము
ఏ బాము, లెఱుఁగక యేపారు మేటికిఁ
  బసుల కాపరి యింట బాము కలిగె,
నే కర్మములు లేక యెనయు నెక్కటికిని
  జాతకర్మంబులు సంభవించె,
నేతల్లి చనుఁబాలు నెఱుంగని ప్రోడ య
  శోదచన్నులపాల చొరవ నెఱిఁగె,
నే హాని వృద్ధులు నెఱుఁగని బ్రహ్మంబు
  పొదిఁగిటిలో వృద్ధి పొందఁ జొచ్చె,

తేటగీతి

నే తపములనైన నెలమిఁ బండని పంట
వల్లవీజనముల వాడఁ బండె
నే చదువులనైన నిట్టిట్టిదనరాని
యర్థమవయవముల నందమొందె.

iBAT సందర్భం

నందగోకులంలో యశోద ఒడిలోనికి చేరుకొన్నాడు కృష్ణయ్య. గొల్లభామలందరూ పరమాత్మ బాలరూపాన్ని దర్శించుకొని పరవశించిపోతున్నారు. వెనుకటి జన్మలలో వారందరూ మహర్షులు. ఆ సంస్కారంతో వారి మనోభావాలు ఏవిధంగా ఉన్నాయో పోతన్నగారు మనకు తెలియజేస్తున్నారు.

iBAT తాత్పర్యము

ఆ స్వామికి జీవులకువలె కర్మసంబంధమైన పుట్టుకలు ఎట్టివీ లేవు. ఇప్పుడు తనంత తాను కోరుకొని పసులకాపరి యింటిపంటగా పుట్టాడు. కర్మబద్ధులైన ప్రాణులకువలె ఆయనకు ఏ కర్మములూ లేవు. కానీ యిప్పుడు జాతకర్మ మొదలైన సంస్కారములను చేసి తల్లిదండ్రులు సంతసిం చారు. ఏ తల్లి చనుబాలు ఎఱుగని పెద్దమనిషి, యశోదమ్మ ఒడిలో పడుకొని పాలు త్రాగినాడు. పెరగ టాలూ, తరగటాలూ అనే వికారాలు ఏమీ లేని పరమాత్మ తల్లిఒడిలో పెరగజొచ్చినాడు. ఎంత ఘోర మైన తపస్సులు చేసినా పండని ఒక అద్భుతమైన నిత్యసత్యమైన పంట గోకులంలో తనంతతానై పంటకు వచ్చింది. ఏ చదువులూ నిరూపించలేని ఒక గొప్ప తత్త్వం కాళ్ళూ చేతులూ కన్నూ ముక్కూ మొదలైన అవయవాలను తెచ్చుకొని నందుని యింట ఆడుకొంటున్నది.
10-225 మేల్కొన్న తెఱఁగున మెల్లన కనువిచ్చి... (సీసము).
iBAA పద్య గానం
iBAP పద్యము
మేల్కొన్న తెఱఁగున మెల్లన కనువిచ్చి
  క్రేఁగంటఁ జూచుచుఁ గిదికి నీల్గి,
యావులించుచుఁ జేతు లాదరంబునఁ జూచి
  యొదిఁగిలి యాకొన్న యోజ నూఁది,
బిగిచన్నుఁగవఁ గేలఁ బీడించి కబళించి
  గ్రుక్కగ్రుక్కకు గుటుకుగుటుకుమనుచు,
నొకరెండు గ్రుక్కల నువిదప్రాణంబులు
  సైతము మేనిలో సత్త్వమెల్లఁ

తేటగీతి

ద్రావె నదియును గుండెలు దల్లడిల్లఁ
జిమ్మఁ దిరుగుచు నిలువక శిరము వ్రాల
నితరబాలురక్రియవాఁడ వీవు గావు
చన్ను విడువుము విడువుము చాలు ననుచు.

iBAT సందర్భం

ముద్దకట్టిన అజ్ఞానమైన పూతన యశోద యింటిలో కాలుపెట్టింది. యశోద వద్దు వద్దంటున్నా బాలుణ్ణి ముద్దు పెట్టుకోవటానికి పరుగుపరుగున చేరుకొన్నది. చిన్ని కొమరుణ్ణి ఒడిలోనికి తీసుకొని పడుకోబెట్టుకొన్నది. అప్పుడు బాలభగవానుని పరమాద్భుతచేష్టలు ఇలా ఉన్నాయి

iBAT తాత్పర్యము

పసికన్నయ్య అప్పుడే మెలకువ వచ్చినట్లుగా మెల్లగా కన్నులు రెప్పలాడిస్తూ తెరిచాడు. వంకర చూపులతో రక్కసిని చూచాడు. ఒళ్ళు విరిచినట్లుగా నటించాడు. ఆవులించాడు. లేనిపోని ప్రేమ ఒలక బోస్తూ చేతులు చాచాడు. ఆకలి తట్టుకోలేని వానివలె ఒక్క ఉదుటున చన్నులు పట్టుకొని గుటుక్కు గుటుక్కున రెండు గ్రుక్కలతో దాని ప్రాణాలు తోడివేశాడు. రక్కసి దిమ్మ దిరిగిపోయింది. గుండెలు దడదడలాడాయి. ఇటువంటి పిల్లవానిని ఇదివరకు చూడలేదమ్మా అంటు గుబగుబలాడిపోతూ కూలి పోయి ప్రాణాలు వదిలింది. దాని ఆర్తనాదం దిక్కులను పిక్కటిల్లజేసింది. బాలకన్నయ్య ఏమీ తెలియని వానిలాగా రెప్పలల్లార్చుతూ నవ్వుమొగంతో ఊరకుండిపోయాడు.
10-280 జననాథ! యొకనాఁడు చన్ను సేఁపినఁ దల్లి... (సీసము).
iBAA పద్య గానం
iBAP పద్యము
జననాథ! యొకనాఁడు చన్ను సేఁపినఁ దల్లి
  చిన్ని ముద్దులకృష్ణుఁ జేరఁ దిగిచి
యెత్తి పెందొడలపై నిడికొని ముద్దాడి
  చన్నిచ్చి నెమ్మోము సక్కనిమిరి
యల్లని నగవుతో నావులించిన బాలు
  వదనగహ్వరమున వారినిధులు
దిశలు భూమియు వనద్వీపశైలంబులు
  నేఱులు గాలియు నినుఁడు శశియు

ఆటవెలది

దహనుఁ డాకసంబుఁ దారలు గ్రహములు
నఖిలలోకములుఁ జరాచరంబు
లైన భూతగణము లన్నియు నుండుటఁ
జూచి కన్నుమోడ్చి చోద్యపడియె.

iBAT సందర్భం

బాలకృష్ణయ్య పసితనంలోనే పరమాత్మ లక్షణాలను తల్లిదండ్రులకు తెలియజేశాడు. అటు వంటి దివ్యదర్శనాన్ని పోతనగారు మనకు అందిస్తున్నారు

iBAT తాత్పర్యము

రాజా! ఒకనాడు యశోద చిన్నిముద్దుల కృష్ణుణ్ణి చేరదీసి ఒడిలో పెట్టుకొని ముద్దాడి చన్నిచ్చి పరమసుందరమైన మోమును చక్కగా నిమురుతూ ఉన్నది. బాలుడు చిన్నగా నవ్వుతూ ఆవులించాడు. లక్కపిడతవంటి ఆ చిన్ని నోటితో యశోదమ్మకు సముద్రాలు, దిక్కులు, భూమీ, అడవులూ, ద్వీపాలూ, కొండలూ, నదులూ, గాలీ, సూర్యుడు, చంద్రుడూ, అగ్ని, ఆకాశము, నక్షత్రాలూ, గ్రహాలూ, సర్వ లోకాలూ, చరములు, అచరములూ అయిన భూతగణాలూ – అన్నీ కదలాడుతున్న తీరు తోచింది. ఆయమ్మ ఆశ్చర్యంతో ఉబ్బితబ్బిబ్బైపోయింది
10-289 జానుభాగముల హస్తమ్ములు వీడ్వడ... (సీసము).
iBAA పద్య గానం
iBAP పద్యము
జానుభాగముల హస్తమ్ములు వీడ్వడ
  నిడుచు దిగ్గనఁ బోదు రింతనంత
నవ్వల పయ్యెదలంది జవ్వాడుదు
  రాలక్రేపులతోఁక లలమి పట్టి
విడువనేరక వాని వెనువెంట జరుగుదు
  రప్పంకముల దుడుకడరఁ జొత్తు
రెత్తి చన్నిచ్చుచో నిరుదెసఁ బాలిండ్లు
  చేతులఁ బుడుకుచుఁ జేపు గలుగ

తేటగీతి

దూటుదురు గ్రుక్కగ్రుక్కకుఁ దోరమగుచు
నాడుదురు ముద్దుపలుకు లవ్యక్తములుగఁ
గరములంఘ్రులు నల్లార్చి కదలుపుదురు
రామకృష్ణులు శైశవరతులఁ దగిలి.

iBAT సందర్భం

బలరామకృష్ణుల బాలలీలావినోదాలను పోతన్నగారు కన్నులకు కట్టిస్తూ హృదయమందిరా లలో నిలుపుతున్నారు.

iBAT తాత్పర్యము

ఆ కొంటె పిల్లలిద్దరూ చేసేవన్నీ తుంటరిపనులే. అయినా చూచేవాళ్ళకు కోపం రాదు. సరికదా వారి చిలిపిచేష్టలద్వారా మానవులు నేర్చుకోవలసిన విషయాలు చాలా ఉన్నాయి అనిపిస్తుంది. మోకాళ్ళమీద చేతులు ఆనించి వాని ఆసరాతో ఊపు తెచ్చుకొని గంతులు వేస్తూ అటూ ఇటూ పరుగు లెత్తుతూ ఉండేవారు. అమ్మల కొంగులను పట్టుకొని ఉయ్యాలలాగా చేసుకొని ఊగులాడుతూ మురిసిపోతూ ఉండేవారు. ఆవుదూడల తోకలు పట్టుకొని అవి ఎంతబలంతో గుంజుకొనిపోతున్నా వదలకుండా పోతూనే ఉండేవారు. బురదగుంటలలో దుడుకుగా జంకుగొంకులు లేకుండా తిరుగా డుతూ ఉండేవారు. అమ్మ చనుబాలిచ్చేటప్పుడు రెండు చేతులలో ఆమె అవయవాలను అందినంత వరకూ తడుముతూ ఉండేవారు. దూడలు ఆవుపొదుగులను ముట్టెలతో పొడుస్తూ పాలు త్రాగే విధంగా అమ్మల రొమ్ములకు ఆనందవేదన కలిగించేవారు. గ్రుక్కగ్రుక్కకు ఒకమారు దూరంగా పరుగెత్తుకొని పోయి క్షణంలో అమ్మఒడిలో దూరిపోతూ ఉండేవారు. వచ్చీరాని తొక్కుపలుకులతో అందరినీ మురిపించేవారు. కాళ్ళూ చేతులూ ఒక్క క్షణం కదలకుండా నిలుపరు. కదిలిస్తూనే ఉండే వారు ఆ రామకృష్ణులు.
10-291 తలలెత్తి మెల్లన తడవి యాడెడు వేళఁ... (సీసము).
iBAA పద్య గానం
iBAP పద్యము
తలలెత్తి మెల్లన తడవి యాడెడు వేళఁ
  బన్నగాధీశుల పగిదిఁ దాల్తు
రంగసమ్మృష్ట పంకాంగరాగంబుల
  నేనుఁగు గున్నల యెత్తు వత్తు
రసమంబులైన జవాతిరేకమ్ముల
  సింగంపుఁ గొదమల సిరి వహింతు
రాననంబులఁ గాంతులంతకంతకు నెక్కు
  బాలార్కచంద్రుల పగిదిఁ దోతు

తేటగీతి

రెలమిఁ దల్లుల చన్నుఁ బాలెల్లఁ ద్రావి
పరమయోగోద్భవామృతపానలీల
సోలి యెరుఁగని యోగుల సొంపు గందు
రాకుమారులు జనమనోహారులగుచు.

iBAT సందర్భం

పెద్దరామయ్య, చిన్ని కృష్ణయ్య బాల్యచేష్టలద్వారా తెలియవచ్చే భగవంతుని లక్షణాలను పోతన్నగారు పరమమనోహరంగా వర్ణిస్తున్నారు.

iBAT తాత్పర్యము

బలరామకృష్ణులు కన్నులలో వింతకాంతులతో తలలెత్తి కదలిస్తూ ఆడుకొంటూ ఉంటే నాద స్వరానికి పరవశించిపోయే నాగదేవతలా అనిపిస్తున్నది. ఒడలంతా పూసుకొన్న మైపూతల కాంతు లతో తిరుగుతూ ఉంటే ఏనుగుగున్నల సోయగాలు వెల్లివిరుస్తూ ఉంటాయి. బాలక్రీడలలో భాగంగా పరుగులు తీస్తున్నప్పుడు సింగపుగొదమలలాగా కానవస్తారు. మోములలో కాంతిరేఖలు విర జిమ్ముతూ బాలసూర్యచంద్రులవలె ప్రకాశిస్తారు. తల్లులదగ్గర చన్నుబాలు త్రాగే సమయంలో అరమోడ్పు కన్నులతో యోగానందస్ఫూర్తిని కల్గిస్తూ ఉంటారు. చూపులలో, నగవులలో, అడుగులలో అన్నింటిలో మానవాతీతవైఖరి ఆ బాలురిద్దరిలో గొల్లలకు, గొల్లభామలకు నిరంతరం కనిపిస్తూనే ఉన్నది. ముగురమ్మల మూలపుటమ్మ ఆ పిల్లవాండ్రను ఆశ్రయించి నడయాడుతున్నట్లుగా భావిం చారు గోపికలు. జ్ఞానసంపద పొలిమేరలలో నడయాడే నేర్పును సాధించిన కొందరు గోపాలకులు కన్నయ్యకూ శివయ్యకూ తేడా ఏమి ఉన్నది అని తర్కించుకొని లేదనే నిర్ణయానికి వచ్చారు.
10-353 అవనీశ! విను ద్రోణుఁ డనువాఁడు వసువుల... (సీసము).
iBAA పద్య గానం
iBAP పద్యము
అవనీశ! విను ద్రోణుఁ డనువాఁడు వసువుల
  యందు ముఖ్యుఁడు ధర యతని భార్య
వారి నిద్దఱ బ్రహ్మ వసుధపై జన్మింపుఁ
  డంచుఁ బంచిన వారలతనిఁ జూచి
విశ్వేశ్వరుండైన విష్ణుసేవారతి
  మాకిచ్చితేని మహిజనింతు
మనవుడు నట్లకా కనియె వేల్పుల పెద్ద
  యా ద్రోణుఁ డీ నందుఁడై జనించె

ఆటవెలది

ధర యశోదయయ్యె దనుజేంద్రవైరియుఁ
గమలగర్భు మాట గారవించి
తల్లిదండ్రులనుచుఁ దగ వారి మన్నించె
నధికభక్తితోడ నలరి రిట్లు.

iBAT సందర్భం

నందయశోదలు కృష్ణస్వామికి తల్లిదండ్రులు ఎలా కాగలిగారు అని పరీక్షిత్తు అడుగగా శుకులవారు వారి పూర్వచరిత్రను ఇలా వివరిస్తున్నారు

iBAT తాత్పర్యము

రాజా! విను. ఎనమండుగురు వసువులు అనే దేవజాతి వారున్నారు. వారిలో ద్రోణుడు ముఖ్యుడు. అతని యిల్లాలు ధర. ఒకనాడు బ్రహ్మ వారి నిరువురినీ పిలిచి భూమిలో పుట్టండి. అని పలికినారు. స్వామీ! విశ్వమంతటికీ ఈశ్వరుడైన విష్ణువును సేవించుకొనే పరమభాగ్యం మాకు అను గ్రహించావంటే మేము భూమిలో పుడతాం. అంటే బ్రహ్మ సరే అలాగే కానివ్వండి అన్నాడు బ్రహ్మయ్య. ఆ ద్రోణుడే నందుడు. ఆ ధరయే యీ యశోద. అంటే వీరు కారణజన్ములు. బ్రహ్మగారి మాట మన్నించి భూమిలో పుట్టిన శ్రీమహావిష్ణువు నందగోకులానికి చేరి వారి మురిపాలు తీర్చాడు.
10-355 కరకమలారుణకాంతిఁ గవ్వపుఁ ద్రాడు... (సీసము).
iBAA పద్య గానం
iBAP పద్యము
కరకమలారుణకాంతిఁ గవ్వపుఁ ద్రాడు
  పవడంపు నునుదీవ పగిది మెఱయ
గ్రమముతో రజ్జు వాకర్షింపఁ బాలిండ్లు
  వీడ్వడి యొండొంటి వీక నొత్తఁ
గుచకుంభముల మీఁది కొంగుజాఱఁగఁ జిక్కు
  పడుచు హారావళుల్బయలుబడఁగఁ
బొడమిన చెమటతోఁ బొల్పారు నెమ్మోము
  మంచు పైపడిన పద్మంబుఁ దెగడఁ

తేటగీతి

గౌను నులియంగఁ గంకణక్వణన మెసఁగఁ
దుఱుము బిగివీడఁ గర్ణికాద్యుతులు మెఱయ
బాలునంకించి పాడెడి పాటవలనఁ
దరువు లిగురొత్తఁ బెరుఁగింతి దరువఁ జొచ్చె.

iBAT సందర్భం

యశోదమ్మ పెరుగు చిలుకుతున్న దృశ్యాన్ని కళ్ళకు కట్టిస్తున్నారు పోతన కవీంద్రులు.

iBAT తాత్పర్యము

తామరపూలవంటి చేతులకాంతితో కవ్వపుత్రాడు లేతపగడపు తీగలాగా అందాలు కులుకు తున్నది. ఒక పద్ధతితో త్రాడు లాగుతూ ఉంటే పాలిండ్లు ఒకదానికొకటి ఒత్తుకుంటున్నాయి. త్రాడు లాగే వేగంవలన పైట కొంగు జారిపోతుంటే సవరించుకొనే సందడిలో మెడలోని హారాలు చిక్కుపడు తున్నాయి. చిరుచెమట బిందువులు ముత్యాలలాగా ఒప్పుతూ ఉండగా మోము మంచుతుంపురులు క్రమ్మిన పద్మంలాగా అలరారుతూ ఉన్నది. నడుము మరింత సన్నగా అయిపోతున్నది. కంకణాల సన్నని చప్పుళ్ళు చెవులకు విందులు చేస్తున్నాయి. జుట్టుముడి వీడిపోతున్నది. చెవికమ్మల తళుకులు మెరిసిపోతున్నాయి. కమ్మగా పాడే పాటకు మ్రోడులు కూడా చిగురిస్తున్నాయి. ఈవిధంగా యశోద పెరుగు చిలుకుతున్న భంగిమల కమనీయదృశ్యం చూడముచ్చటగా ఉన్నది
10-372 స్తంభాదింకంబులు తనకు నడ్డంబైన... (సీసము).
iBAA పద్య గానం
iBAP పద్యము
స్తంభాదింకంబులు తనకు నడ్డంబైన
  నిట్టట్టు సనిపట్టనీని వాని
నీతప్పు సైరింపు మింక దొంగిలఁబోవ
  నేనని మునుముట్ట నేడ్చువానిఁ
గాటుక నెఱయంగఁ గన్నులు నులుముచు
  వెడలు కన్నీటితో వెగచువాని
నే దెసవచ్చునో యిదియని పలుమాఱు
  సురుఁగుచుఁ గ్రేఁగంట జూచువానిఁ

ఆటవెలది

గూడఁబాఱి పట్టుకొని వెఱపించుచుఁ
జిన్ని వెన్నదొంగ సిక్కెననుచు
నలిగికొట్టఁ జేతులాడక పూఁబోఁడి
కరుణతోడ బాలుఁ గట్టఁ దలఁచి.

iBAT సందర్భం

పిల్లకృష్ణుని అల్లరికి అంతూ పొంతూ లేకుండా పోతున్నది. పట్టుకొని నాలుగు తగిలిస్తే కానీ దారికి రాడని యశోదమ్మ పట్టుకోవటానికి పడరానిపాట్లు పడుతున్నది. అప్పటి కన్నయ్య బాలలీలలు ఇలా ఉన్నాయి.

iBAT తాత్పర్యము

స్తంభాలు మొదలైనవి అడ్డం వస్తుంటే తప్పించుకొని చేతికందక అటూ ఇటూ పరుగులు తీస్తున్నాడు. ఈ ఒక్క తప్పూ సహించమ్మా! ఇకపై దొంగిలించను అంటూ బ్రదిమిలాడుతూ బుడిబుడి దొంగఏడుపులు ఏడుస్తున్నాడు. కనులకు పెట్టిన కాటుక మొగమంతా చారలుగానయి చూచేవారికి జాలిపుట్టే విధంగా వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు. ఎటువైపునుండి అమ్మ పట్టుకోవటానికి వస్తుందో అని వాలుకన్నులు మార్చి మార్చి అటూ ఇటూ చూస్తున్నాడు. అమ్మ అలసిపోయిందని మెల్లగా చేతికి చిక్కాడు. వెంటనే యశోద చిన్ని వెన్నదొంగ చిక్కాడని పట్టుకొన్నది. కొట్టబోయింది. కానీ చేతులు రాలేదు. కట్టి పడవేస్తే కదలకుండా ఉంటా డనుకొంటూ ఆ ప్రయత్నంలో ఉన్నది
10-377 తోయంబు లివియని తొలఁగక చొచ్చెదు... (సీసము).
iBAA పద్య గానం
iBAP పద్యము
తోయంబు లివియని తొలఁగక చొచ్చెదు
  తలఁచెడు గట్టైనఁ దరల నెత్త
మంటితో నాటలు మానవు కోరాడే
  దున్నత స్తంభంబు లూపఁ బోవు
దన్యుల నల్పంబు లడుగంగఁ బాఱెడు
  రాచవేటలఁ జాల ఱవ్వదెచ్చె
దలయవు నీళ్ళకు నడ్డంబు గట్టెదు
  ముసలివై హలివృత్తి మొనయఁ జూచె

ఆటవెలది

దంబరంబు మొలకు నడుగవు తిరిగెద
వింకఁ గల్కిచేత లేల పుత్ర
నిన్ను వంప వ్రాల్ప నే నేర ననియె నీ
విట్టు క్రిందు మీఁదు నెఱుఁగ కునికి.

iBAT సందర్భం

ఎలాగో చేతికి చిక్కిన చిన్నికృష్ణునితో యశోదమ్మ ఇలా అంటున్నది. ఆమె మాటలలో అప్రయత్నంగా ఆయన అవతారాల లీలలన్నీ తొంగి చూస్తున్నాయి.

iBAT తాత్పర్యము

జంకూగొంకూ లేక యమునానదిలోనికి దూసుకొంటూ పోతావు. అడ్డంవస్తే కొండలను గూడా ఎత్తి పారవేయాలనుకొంటావు. మట్టితో ఆటలు మానవు. పెద్దపెద్దస్తంభాలను గూడ ఊపివేయ బోతావు. చిన్నిచిన్ని విషయాలను గూడ ఊరిలోని వారలను అడుక్కోవటానికి పోతావు. రాచవేటలతో రవ్వలు తెస్తావు. గొప్ప ప్రవాహాలకు కూడా అడ్డుకట్టలు వేసే సాహసం పనులను చూస్తూ ఉన్నాము. ఆరితేరినవారిలాగా నాగలి దున్నే పనులు చేస్తూ ఉంటావు. మొలకు చుట్టుకోవటానికి గుడ్డను కూడా అడుగవు. అలాగే దిగంబరంగా తిరుగుతూ ఉంటావు. ఈవిధమైన కలికిపనులు ఎందుకురా నీకు అని మందలించసాగింది.

ఇందులో చేప, తాబేలు, వరాహము, నరసింహస్వరూపము, వామనత్వము, పరశురామ తత్త్వము, సేతువును నిర్మించిన రామతత్త్వము, రోలు, నాగలి ఆయుధాలైన బలరామత్వమూ, దిగంబర జైన తత్త్వము, కల్కి అవతారము అనేవి వరుసగా ప్రస్తావనకు వచ్చాయి.
10-430 వేణువు లూదుచు వివిధ రూపములతో... (సీసము).
iBAA పద్య గానం
iBAP పద్యము
వేణువు లూదుచు వివిధ రూపములతో
  గంతులు వైతురు కౌతుకమున
గురుకంబళాదుల గోవృషంబులఁ బన్ని
  పరవృషభములని ప్రతిఘటింతు
రల్లులు దట్టించి యంఘ్రుల గజ్జెలు
  మొరయఁ దన్నుదు రోలి ముమ్మురముగఁ
బన్నిదంబులు వైచి ఫలమంజరులు గూల్చి
  వ్రేటులాడుదురు ప్రావీణ్యమొప్ప

తేటగీతి

వన్యజంతుచయంబుల వాని వాని
పదురు పదురుచు వంచించి పట్టఁబోదు
రంబుజాకరములఁ జల్లులాడఁ జనుదు
రాకుమారులు బాల్యవిహారులగుచు.

iBAT సందర్భం

బలరాముడూ, కృష్ణుడూ పశువులను అడవులలోనికి తోలుకొనిపోయి చేసే ఘనకార్యాలను పోతన్నగారు పరమరమణీయంగా వర్ణిస్తున్నారు.

iBAT తాత్పర్యము

పెక్కువిధాలైన వేషాలు వేసికొని మురళులను మ్రోయిస్తూ గంతులు వేస్తూ ఉంటారు. పెద్ద పెద్ద కంబళ్ళు కప్పి ఆవులను, ఎద్దులను – ఇవి మనవి కావురా అంటూ వేళాకోళంగా పలుకుతూ ఉంటారు. కాసెలు బిగించి కాళ్ళకు గజ్జెలు కట్టుకొని అవి వినసొంపుగా మ్రోగుతూ ఉంటే ఒకరి నొకరు తన్నుకొంటూ తిరుగుతారు. పందేలు వేసి పండ్ల గుత్తులను చిందరవందరగా పడవేస్తూ వానితో కొట్టుకొంటూ ఉంటారు. అడవి మృగాల అరపులను అనుకరిస్తూ అవి మోసపోయి చేరువకు రాగా వానిని కట్టిపడవేస్తూ ఉంటారు. యమున నీటి పడియలలోనికి చొచ్చుకొనిపోయి జల్లులాటతో వినోదిస్తూ ఉంటారు. ఈ విధంగా గొల్లపిల్లలతో కలసి రామకృష్ణులు చేసే చిలిపిపనులు చూడముచ్చ టగా ఉన్నాయి.
10-454 కపులమై జలరాశిఁ గట్టుదమా యని... (సీసము).
iBAA పద్య గానం
iBAP పద్యము
కపులమై జలరాశిఁ గట్టుదమా యని
  కట్టుదు రడ్డంబు కాలువలకు
మునులమై తపములు మొనయుదమా యని
  మౌనులై యుందురు మాటలేక
గంధర్వవరులమై గానవిద్యలు మీఱఁ
  బాడుదమా యని పాడఁ జొత్తు
రప్సజోజనులమై యాడుదమా యని
  యాడురూపులఁ దాల్చి యాడఁ జనుదు

ఆటవెలది

రమర దైత్యవరులమై యబ్ధిఁ ద్రత్తుమా
యని సరోవరములయందు హస్త
దండచయముఁ ద్రిప్పి తరుతురు తమ యీడు
కొమరు లనుచరింపఁ గొమరు మిగుల.

iBAT సందర్భం

బాల బలరామకృష్ణుల వనవిహారవినోదాలు ఎంత మనోహరంగా ఉన్నాయో ఈ పద్యం చదువుకొని గమనిద్దాం. హృదయంలో పదిలపరచుకొందాం.

iBAT తాత్పర్యము

బలరామకృష్ణులు తమ యీడు గొల్లపిల్లలందరిని కలుపుకొని ఆటపాటల నెపంతో తమ దివ్య లక్షణాలను తెలియజేశారు. ఒరే అబ్బాయిలూ ఇప్పుడు మనం కోతులం. ఇదిగో ఈ సముద్రానికి వారధి కడదాం రండి అని అక్కడ ఉన్న కాలువలకు వంతెనలు నిర్మిస్తున్నారు. గప్ చుప్ మనం మునులం తపస్సు చేసుకుందాం అంటూ అరమోడ్పు కనులతో బాసీపెట్టు వేసుకొని ధ్యానముద్రలో కూర్చుంటారు. ఒరే మనం గంధర్వలోకనుండి దిగి వచ్చాం. గానకళావిశారదులం అంటూ గొంతెత్తి పాటలు పాడుతుంటారు. స్వర్గంలో ఆడి పాడి విసిగిపోయి నేలకు దిగివచ్చిన అప్సరసలము అంటూ ఆడవేషాలు వేసికొని అద్భుతంగా నృత్యభంగిమలతో ఆడుతూ ఉంటారు. అదికాదురా! మనం అమరులమూ దైత్యులమూ అయి సాగరమథనం చేద్దాం అని ఉత్తుత్తి కవ్వములను చేతులతో త్రిప్పుతూ ఆనందం అనే అమృతాన్ని ఆస్వాదిస్తూ ఉంటారు.
10-496 మాటిమాటికి వ్రేలు మడిచి యూరించుచు... (సీసము).
iBAA పద్య గానం
iBAP పద్యము
మాటిమాటికి వ్రేలు మడిచి యూరించుచు
  నూరుఁగాయలు తినుచుండు నొక్కఁ
డొకని కంచములోని దొడిసి చయ్యన మ్రింగి
  చూడు లేదని నోరు సూపు నొక్క
డేగు రార్గుల చల్దులెలమిఁ బన్నిద మాడి
  కూర్కొని కూర్కొని కుడుచు నొక్కఁ
డిన్ని యుండఁగఁ బంచి యిడుట నెచ్చెలి తన
  మనుచు బంతెన గుండు లాడు నొకఁడు

ఆటవెలది

కృష్ణుఁ జూచు మనుచుఁ గికురించి పరుమ్రోల
మేలి భక్ష్యరాశి మెసఁగు నొకఁడు
నవ్వునొకఁడు సఖుల నవ్వించునొకఁడు
ముచ్చటాడు నొకఁడు మురియు నొకఁడు.

iBAT సందర్భం

రామకృష్ణులు తోటి గోపబాలికలతో కలసి చలిదిబువ్వలు తినే దృశ్యం పరమమనోహర మైనది. ఆ దృశ్యాన్ని పోతనగారి కమనీయకవిత్వం ద్వారా హృదయసీమలలోనికి చేర్చుకొని మురిసి పోదాం.

iBAT తాత్పర్యము

కన్నయ్య సన్నిధిలో ఆత్మీయులకు అల్లరియే ఆనందం. బుడతలు బువ్వలు బుద్ధిగా తింటారా! ఎంత అల్లరి! ఎంత హంగామా! ఒకడు మాటిమాటికి వేలు మడిచి ఆవకాయ ముక్క అందరికీ చూపిస్తూ ఊరిస్తూ నోటిలోనికి వేసుకొంటూ, నీకు లేదులే అని వేళ్ళు త్రిప్పుతున్నాడు. పక్కవాని కంచంలోని భక్ష్యాలను గుటుక్కున మ్రింగి, ఎబ్బే నేను తినలేదురా? చూడు నానోరు అని పెద్దగా తెరుస్తున్నాడు మరొకడు. ఇంకొకడు పందెం వేసి అయిదారుగురు తినే ముద్దలను కుక్కుకొని కుక్కు కొని తింటున్నాడు. నాకడ ముద్దలు చాలా ఎక్కువగా ఉన్నాయిరా! ఇదిగో పట్టుకోండి అని బంతుల లాగా అన్నపు ముద్దలను అన్నివైపులకు విసరుతున్నాడు వేరొకడు. ఒరేయ్ కృష్ణుణ్ణి చూడరా! అని వాడు కనుత్రిప్పే అంతలో ప్రక్కవాని పళ్ళెంలోని భక్ష్యాలను గుటకాయస్వాహా! చేస్తున్నాడు ఒక బుడతడు. ప్రక్కవాడు ముద్దకోసం వెదకుతుండగా వాని అవస్థను చూచి పకపకా నవ్వుతున్నాడు ఆ ప్రక్కవాడు. అలా అందరికీ చూపించి నవ్విస్తున్నాడు మరొకడు. ముచ్చటలతో మురిపాలతో పిల్లలు పట్టనలవికాని అల్లరి చేస్తూ ఆరగిస్తున్నారు.
10-498 కడుపున దిండుగాఁ గట్టిన వలువలో... (సీసము).
iBAA పద్య గానం
iBAP పద్యము
కడుపున దిండుగాఁ గట్టిన వలువలో
  లాలితవంశనాళంబుఁ జొనిపి
విమలశృంగంబును వేత్రదండంబును
  జాఱి రానీక డాచంకనిఱికి
మీఁగడ పెరుగుతో మేళవించిన చల్ది
  ముద్దడాపలిచేత మొనయ నునిచి
చెలరేగి కొసరి తెచ్చిన యూరుగాయలు
  వ్రేళ్ళసందులయందు వెలయనిరికి

ఆటవెలది

సంగడీలనడుమఁ జక్కఁగఁ గూర్చుండి
నర్మభాషణముల నగవు నెఱపి
యాగభోక్త కృష్ణుఁ డమరులు వెఱఁగంద
శైశవంబు మెఱసి చల్ది గుడిచె.

iBAT సందర్భం

చద్దిబువ్వలు ఆరగిస్తున్న కన్నయ్య కమనీయరూపపు అక్షరచిత్రం ఇదిగో.

iBAT తాత్పర్యము

పొట్టమీద కట్టిన బట్ట దిండులాగా కొంచెం ఉబ్బి ఉండగా అందులో మెల్లగా వేణువును దూర్చి భద్రంగా పట్టుకొన్నాడు. ఒక కొమ్ముబూరా, ఒక వెదురుబెత్తము అయ్యగారి ఆస్తులు. ఆ రెంటినీ జారి పోకుండా ఎడమచంకలో ఇరికించాడు. మీగడ పెరుగుతో చక్కగా కలిపిన చలిదిముద్దను కుడి అరచేతి గుప్పిటిలో పట్టు దప్పకుండా పట్టుకొన్నాడు. ఒరేయ్ గుండన్నా ఓరోరి గండన్నా నాకు కొంచెం ఊరగాయ ముక్క పెట్టండి రా అని తెచ్చుకొన్నవానిని వ్రేళ్ళసందులలో నిలుపుకొన్నాడు. సంగడికాండ్రమధ్యన చక్కగా కూర్చుండి వేళాకోళపు మాటలు ఆడుతున్నాడు. మహాయజ్ఞాలలో మంత్రపూతమైన హవిస్సులను అందుకొనే యజ్ఞేశ్వరుడైన యజ్ఞపతి దేవతలు ఆశ్చర్యంతో ముక్కు మీద వ్రేలు వేసుకొనే విధంగా శిశువై చలిది అన్నం తింటున్నాడు.
10-544 తన కన్యములు లేక తనరారి మమ్ముల... (సీసము).
iBAA పద్య గానం
iBAP పద్యము
తన కన్యములు లేక తనరారి మమ్ముల
  విభుఁడయ్యుఁ గ్రేపుల వెదకువాని
నఖిలజ్ఞుఁడై యొక్కఁడయ్యు నజ్ఞాకృతిఁ
  జెలికాండ్రఁ బెక్కండ్రఁ జీరువాని
బహిరంతరాద్యంత భావ శూన్యుండయ్యు
  నంతంత నడుగు చొప్పరయువాని
గురుగభీరుండయ్యు గురువుల వాఱుచు
  నట్టిట్టుఁ బాతరలాడువాని

ఆటవెలది

జాతిరహితుఁ డయ్యుఁ జతురగోపార్భక
భావమెల్ల నచ్చుపడిన మేని
చెలువువాని, హస్తశీతాన్నకబళంబు
వానిఁ, గాంచె నపుడు వాణిమగఁడు.

iBAT సందర్భం

పై ఏడు లోకాలలో చివరిదైన సత్యలోకంలో ఉండే బ్రహ్మదేవుడు కూడా ఈ చలిదిబువ్వల తతంగం చూచి ముక్కుమీద వేలు వేసుకొన్నాడు

iBAT తాత్పర్యము

విశ్వమంతా తానే అయినవాడు. ముగ్గురు మూర్తులకు మూలమైనవాడు అయినా నేలకు దిగి వచ్చి ఆలను కాచుకొంటున్నాడు. సర్వము తెలిసినవాడైనా ఏమీ తెలియనివానిలాగా చెలికాండ్రను కలుపుకొని తిరుగుతున్నాడు. లోపల, వెలుపల, తుదీ, మొదలు అనే భావాలు లేనివాడైనా ఏవో గుర్తులను గమనిస్తూ ఉంటాడు. లోతు ఎంతో తెలియటానికి ఎవ్వరికీ సాధ్యం కానివాడు. కాని చైత న్యానికి రూపం వచ్చిందా అన్నట్లు పరుగులు తీస్తూ నటనలు చూపుతూ ఉండేవాడు. జాతి ఇది అని నిర్ణయించటానికి వీలులేనివాడు. గొల్లపిల్లల సంగడికాడై ఆడుకుంటున్నాడు. పైగా చేతిలో చద్దిబువ్వ ముద్ద పట్టుకొని తిరుగుతూ పరమసుందరమూర్తియై కన్పట్టుతున్నాడు. అనుకొంటు బ్రహ్మగార్రు శ్రీజగన్నాథుణ్ణి తదేకభావనతో త్రికరణాలతో ఆరాధించుకొన్నారు.
10-548 శంపాలతికతో జలదంబు కైవడి... (సీసము).
iBAA పద్య గానం
iBAP పద్యము
శంపాలతికతో జలదంబు కైవడి
  మెఱుఁగు బొల్లియతోడి మేనివానిఁ
గమనీయ మృదులాన్నకబళనేత్ర విషాణ
  వేణుచిహ్నంబులు వెలయువాని
గుంజావినిర్మిత కుండలంబులవాని
  శిఖిపింఛవేష్టిత శిరమువాని
వనపుష్పమాలికావ్రాత కంఠమువాని
  నలినకోమల చరణములవానిఁ

ఆటవెలది

గరుణ గడలుకొనిన కడగంటివాని గో
పాల బాలు భంగిఁ బరఁగువాని
నగుమొగంబువాని నన్నుఁ గన్నతండ్రివి
నిను భజింతు మ్రొక్కి నీరజాక్ష!

iBAT సందర్భం

బ్రహ్మయ్యకు బాలకృష్ణయ్యను పరీక్షించాలనే బుద్ధి పుట్టింది. ఆవులనూ, లేగలనూ, గోప బాలురనూ కనబడకుండా చేశాడు. అయితే నాకే లెక్క అని బ్రహ్మయ్యను కన్నయ్య ఆ అన్నీ తానే అయి బ్రహ్మకు దిమ్మ తిరిగేలా చేశాడు. తెలివి తెచ్చుకొని వాణీపతి శ్రీపతిని ఇలా స్తుతిస్తున్నాడు.

iBAT తాత్పర్యము

తామరపూరేకులవంటి అందమైన విశాలమైన కన్నులతో లోకాలన్నింటినీ చూస్తూ ఉండే స్వామీ! నీ పాదపద్మాలకు ప్రణామాలు. నీవు నన్ను గన్నతండ్రివి. మెరుపుతీగతో మెరసిపోయే నీల మేఘంలా ఉంది నీ మేను. అందరి కన్నులను ఆకర్షించే చద్దిముద్ద, వేణువు, చేతికర్ర, ఒక కొమ్ము చేతులలో చిందులు త్రొక్కుతున్నాయి. గురివెంద పూసల కుండలాలు చెవులకు అలరారుతున్నాయి. నెమలి ఈకలు తలచుట్టూ నెలకొని చూడముచ్చటగా ఉన్నాయి. అడవిలో లభించే అందమైన పూవు లన్నీ పెద్దమాలగా చేసి అమ్మ మెడలో భద్రంగా ఉంచింది. చిట్టిపాదాలు పద్మాలకంటె పరమ సుకుమారంగా ఉన్నాయి. వాలుకంటి చూపులనుండి దయారసామృతం జాలువారుతున్నది. మోము చిరునవ్వుతో పరమసుందరంగా ఉంది. అట్టి నీకు నేను మ్రొక్కుతున్నాను తండ్రీ!
10-557 సర్వేశ నే రజోజనితుండ, మూఢుండఁ... (సీసము).
iBAA పద్య గానం
iBAP పద్యము
సర్వేశ నే రజోజనితుండ, మూఢుండఁ
  బ్రభుఁడ నేనని వెఱ్ఱి ప్రల్లదమున
గర్వించినాఁడను, గర్వాంధకారాంధ
  నయనుండఁ, గృపఁ జూడు ననుఁ బ్రధాను
మహదహంకృతి నభో మరుదగ్ని జలభూమి
  పరివేష్టితాండకుంభంబులోన
నేడు జేనెలమేన నెనయు నేనెక్కడ?
  నీ దృగ్విధాండంబు లేరికైన

తేటగీతి

సంఖ్య సేయంగరానివి సంతతంబు
నోనిఁ బరమాణువుల భంగి నొడలి రోమ
వివరములయందె వర్తించు విపులభాతి
నెనయుచున్న నీవెక్కడ నెంత కెంత.

iBAT సందర్భం

శ్రీకృష్ణుని మాయగుట్టు తెలుసుకుందామని తెలుసుకోలేక భంగపడిన బ్రహ్మయ్య చెంపలు వేసుకొంటూ ఇలా అంటున్నాడు.

iBAT తాత్పర్యము

సర్వేశా! నేను నీదైన గుణాలతో ఒక్కటైన రజస్సుతో ఏర్పడినవాడను. దానికి తోడైన తమోగుణం ఆవరించటంవలన మూఢుడను కూడా అయ్యాను. పైగా నేను ప్రభువుననే పొగరుతో పిచ్చిగా ప్రవర్తించాను. గర్వమనే అంధకారం నా కన్నులను మూసివేసింది. నన్ను దయజూడు. ప్రధానము, మహత్తు, అహంకారము, నింగి, నిప్పు, నీరు, నేల అనేవానితో నిండిన బ్రహ్మాండంలో ఏడుజేనెల మేరలో మాత్రమే ఉండే నేనెక్కడ? అటువంటి బ్రహ్మాండాలు కోట్లకొలదీ రోమకూపాలలో నింపుకొని విలాసంగా తిరిగే నీవెక్కడ? స్వామీ! నన్ను మన్నించు.
10-560 నలినాక్ష నీవాదినారాయణుండవు... (సీసము).
iBAA పద్య గానం
iBAP పద్యము
నలినాక్ష నీవాదినారాయణుండవు
  జలము నారము జీవచయము నార
మందు నీవుంట నీయందవి యుంటను
  నారాయణుండను నామమయ్యె
సకలభూతములకు సాక్షివధీశుండ
  వబ్ధి నిద్రించు నారాయణుండ
నీమూర్తి యది నీకు నిజమూర్తి యనరాదు
  నలిననాళముతోవ నడచి మున్ను

తేటగీతి

కడఁగి నూఱేండ్లు వెదకి నేఁ గాననయితి
నేకదేశస్థుఁడవు గావనేకరుచివి
జగములో నుండ నీలోన జగములుండు
నరుడు నీమాయ నెట్లైన నగుచునుండు.

iBAT సందర్భం

బ్రహ్మయ్య ఇంకా కన్నయ్య ఘనతను గూర్చి ఇలా విన్నవించుకొంటున్నాడు

iBAT తాత్పర్యము

వనజాక్షా! నీవు ఆదినారాయణుడవు. జలములను జీవుల సముదాయములను నారములు అంటారు. అవి నీకు, నీకు అవి అయనములు (ఉండుచోటులు). కనుక నిన్ను నారాయణుడంటారు. నీవు సకలభూతాలకూ సాక్షివి. అధినాయకుడవు. నీవు ప్రళయపయోనిధిలో నిద్రిస్తావు. దానిని యోగ నిద్ర అంటారు. కానీ అది నీ నిజమైన రూపం కాదు. నేను మునుపు తామరతూడుకాడలో వంద యేండ్లు పయనించి కూడా నిన్ను తెలుసుకోలేకపోయాను. నాకు అర్థమైన దేమిటంటే, ఒకచోటనక ఎందునుండ నేర్చువాడవు. అంటే అన్ని యెడల, లోపలా, వెలుపలా నిండియుండే హద్దులు నిర్ణయింప రాని రూపం నీది. సృష్టిలో గోచరించే గొప్ప కాంతులన్నీ నీనుండి వెలువడినట్టివియే. నీవు జగత్తులో ఉంటావు. నీలో జగములన్నీ ఉంటాయి.
10-566 అదిగాక నిజరూప మనరాదు కలవంటి... (సీసము).
iBAA పద్య గానం
iBAP పద్యము
అదిగాక నిజరూప మనరాదు కలవంటి
  దై, బహువిధ దుఃఖమై, విహీన
సంజ్ఞానమై, యున్న జగము సత్సుఖబోధ
  తనుఁడవై తుదిలేక తనరు దీవు
మాయచేఁ బుట్టుచు, మనుచు లేకుండుచు
  నున్న చందంబున నుండుచుందు
ఒకఁడ వాత్ముఁడ వితరోపాధి శూన్యుండ
  వాద్యుండ నమృతుండ వక్షరుండ

ఆటవెలది

వద్వయుండవును స్వయంజ్యోతి వాపూర్ణుఁ
డవు పురాణపురుషుఁడవు నితాంత
సౌఖ్యనిధివి నిత్యసత్యమూర్తివి నిరం
జనుఁడ వీవు, దలఁపఁ జనునె నిన్ను.

iBAT సందర్భం

శ్రీమన్నారాయణుని తత్త్వాన్ని నాలుగు మొగాలతో నాలుగు వేదాలనూ లోకాలకు అందించే చదువులమ్మ భర్త బ్రహ్మదేవుడు ఈవిధంగా విన్ననించుకొంటున్నాడు

iBAT తాత్పర్యము

బ్రహ్మదేవుడు బాలకృష్ణస్వామితో ఇంకా ఇలా అంటున్నాడు. స్వామీ! ఇప్పుడు నీవు కనబడు తున్నది నీ నిజరూపం కాదు. ఈ జగత్తంతా ఒక పెద్ద కలవంటిది. అందులో అన్నీ దుఃఖాలే. ఇసుమం తైనా సంజ్ఞానం నిలిచి ఉండదు. ఇక నీ సంగతి అంటేనో నీవు సత్, చిత్, ఆనందములే అయిన వాడవు. నీకు మొదలూ తుదీ లేవు. నీదైన మాయతో నీ అంత నీవు నిన్ను సృష్టించుకొని జగత్తును ఉద్ధరించటానికి అప్పుడప్పుడూ అవతరిస్తూ ఉంటావు. అందువలననే నిన్ను ‘ఆత్మ’ అంటారు. అంటే అన్ని దేశాలలో అన్ని కాలాలలో ఏకరూపంగా వ్యాపించి ఉండేది అని ఆ మాటకు అర్థం. జగత్తు ఏర్పడటానికీ, ఉండటానికీ, మళ్ళీ లయమైపోవటానికీ కొన్ని ఆధారాలు (ఉపాధులు) కావాలి. కానీ నీకు అటువంటి ఉపాధుల అవసరం లేదు. నీవు సర్వమునకు మొట్టమొదటివాడవు. నీస్థితికి జారుపాటు గానీ, భంగపాటు కానీ ఎప్పుడూ ఎక్కడా ఉండదు. అందువలననే నిన్ను అక్షరుడంటారు. అమృతుడు అని కూడా అంటారు. నీవు ఏకాత్ముడవు. నీతో పోల్చదగిన తత్త్వం మఱియొకటి లేదు. అది కారణంగా నీవు అద్వయుడవు. సూర్యచంద్రాదులకు కూడా వెలుగును ప్రసాదించేది నీవే. నీవు స్వయంప్రకాశుడవు. పూర్ణస్వరూపుడవు. నిత్యానందాత్మకుడవు. కాలవిభాగాలు లేని అఖండతత్త్వా నివి. ఏ అంటుసొంటులు లేనివాడవు. నిన్ను భావించటం, నిరూపించటం నాకు కూడా సాధ్యం కాని విషయం.
10-571 ఏకాదశేంద్రియాధీశులు చంద్రాదు... (సీసము).
iBAA పద్య గానం
iBAP పద్యము
ఏకాదశేంద్రియాధీశులు చంద్రాదు
  లేను ఫాలాక్షుండు నిట్లు సూడ
పదుమువ్వురము నెడపడక నింద్రియపాత్ర
  ముల నీపదాంభోజముల మరంద
మమృతంబుగాఁ ద్రావి యమరనేకైకేంద్రి
  యాభిమానులమయ్యు నతికృతార్థ
భావులమైతిమి పర్వఁగ సర్వేంద్రియ
  వ్యాప్తులు నీమీఁద వ్రాల్చి తిరుగు

తేటగీతి

గోపగోపికా జనముల గురువిశిష్ట
భాగ్యసంపదఁ దలపోసి ప్రస్తుతింప
నలవిగా దెవ్వరికి నైన అంబుజాక్ష
భక్తవత్సల సర్వేశ పరమపురుష.

iBAT సందర్భం

బ్రహ్మదేవుడు బాలకృష్ణునిలో పరమాత్మతత్త్వాన్ని దర్శించి తెలుపుకొంటూ ఇలా స్తుతిస్తు న్నాడు.

iBAT తాత్పర్యము

అయిదు జ్ఞానేంద్రియాలు, అయిదు కర్మేంద్రియాలు, మనస్సు, నేనూ, రుద్రుడూ మేము పదుమువ్వురము మా యింద్రియములనే పాత్రములతో నీ పాదపద్మాలలోని పూదేనె అనే అమృతాన్ని త్రావి, ఒక్కొక్క యింద్రియ విషయం పరితృప్తిని మాత్రమే పొందుతున్నాము. ఆ మాత్రానికే మాకు కృతార్థత కలుగుతున్నదనే భావంతో ప్రవర్తిస్తున్నాము. కానీ ఈ భూమిమీద గొల్లపల్లెలో తిరుగాడే గోవులు, గోపికలూ అన్ని యింద్రియాల కదలికలను నీమీదనే చక్కగా తప్పిపోకుండా నిలుపుకొని ఆనందమందుతూ ఉన్నారు. అట్టివారి భాగ్యసంపదను కొనియాడటం ఎవ్వరికీ సాధ్యం కాని పని. భక్తవత్సలా! సర్వేశా! పరమపురుషా! నీకు పడి పడి దండాలు పెడతాను.
10-591 అఖిలజంతువులకు నాత్మవల్లభుఁడైన... (సీసము).
iBAA పద్య గానం
iBAP పద్యము
అఖిలజంతువులకు నాత్మవల్లభుఁడైన
  భంగి బిడ్డలు నిండ్లుఁ బసిడి మొదలు
వస్తువు లెవ్వియు వల్లభంబులు గావు
  సకలాత్మకుండైన జలజనేత్రుఁ
డఖిలజంతువులకు నాత్మఁ గావున ఘోష
  వాసులకెల్లను వల్లభత్వ
మునను మిక్కిలియొప్పె మూఁడు లోకములను
  హితము సేయఁగ జలజేక్షణుండు

ఆటవెలది

మాయతోడ మూర్తిమంతుఁడై యొప్పారుఁ
గలఁ డతండు నిఖిలగుణములందు
భవతి ధాతువెట్లు భావార్థమై సర్వ
ధాతుగణమునందుఁ దనరు నెట్లు.

iBAT సందర్భం

గొల్లపిల్లలకు కనిపెంచిన తల్లిదండ్రులకంటె కన్నయ్య అంత ప్రేమపాత్రుడెలా అయ్యాడు అని పరీక్షిత్తు అడిగిన ప్రశ్నకు శ్రీశుకులు ఇలా సమాధాన మిచ్చారు

iBAT తాత్పర్యము

రాజా! మెలకువతో గమనిస్తే సృష్టిలో సర్వప్రాణులకు అన్నింటికంటె అత్యంతప్రియమైనది ‘తాను’ (ఆత్మ). దానిముందు బిడ్డలు, ఇండ్లు, వాకిండ్లు, వస్తువులు, వాహనాలూ మొదలైనవన్నీ దిగ దుడుపే. ఇంక శ్రీహరి సకలప్రాణులకు ఆత్మ అయినవాడు. కాబట్టి గొల్లపిల్లలకు అతని తరువాతనే అందరూ, అన్నీ. ఆ పద్మనయనుడు మూడులోకాలకూ మేలు చేయగోరి మాయను ఆసరాగా చేసుకొని ఒక ఆకారాన్ని ధరించి దిగి వచ్చాడు. అతడు సర్వప్రాణులలోపలా బయటా అంతటా నిండి ఉన్నాడు. సంస్కృతంలో ‘భూ’ అనే ధాతువు ఉన్నది. ఉండటం అని దానికర్థం. ఉండటం అన్ని ధాతువులకు సంబంధించిన వ్యవహారమే కదా! ఆవిధంగా కృష్ణుడు అందరిలో అన్నింటిలో ఆత్మ అయి ఉన్నాడు కనుక అన్నింటికంటె, అందరికంటె ప్రియుడౌతున్నాడు
10-596 నిఖిలపావనమైన నీ కీర్తి పాడుచు... (సీసము).
iBAA పద్య గానం
iBAP పద్యము
నిఖిలపావనమైన నీ కీర్తి పాడుచు
  నీ తుమ్మెదలు వెంట నేఁగు దెంచె
నడవిలో గూఢుండవైన యీశుఁడవని
  ముసరి కొల్వఁగ వచ్చె మునిగణంబు
నీలాంబరము తోడ నీవు జీమూతము
  వని నీలకంఠంబు లాడఁదొడఁగె
ప్రియముతోఁ జూచె గోపికల చందంబున
  నిను జూచె నదె హరిణీచయంబు

ఆటవెలది

నీవు విందవనుచు నిర్మలసూక్తులు
పలుకుచున్న విచటఁ బరభృతములు
నేడు విపినచరులు నీవు విచ్చేసిన
ధన్యులైరి గాదె తలఁచి చూడ.

iBAT సందర్భం

బలరామకృష్ణులు వనంలో తిరుగుతూ ఒకరినొకరితో మాట్లాడుకొంటున్నారు. అన్నతో కన్నయ్య ఆ వనంలోనివన్నీ నీవెంట పడుతున్నాయని చెప్తున్నాడు.

iBAT తాత్పర్యము

అన్నా! అన్నా! చూడు చూడు. నీకీర్తి సర్వాన్నీ పావనం చేస్తుందని ప్రకటిస్తూ తుమ్మెదలు మనోహరనాదం చేస్తూ నీవెంటబడి వస్తున్నాయి. అడవిలో గుట్టుగా తిరుగుతున్న పరమాత్ముడవని కనిపెట్టి మునులు గుంపులు గుంపులుగా నిన్ను కొల్వటానికి వస్తున్నారు. నీలవర్ణం వస్త్రం కట్టుకొని తిరుగుతూ ఉంటే కారుమబ్బు అనుకొని నెమళ్ళు నాట్యమాడుతూ మురిసిపోతున్నాయి. ప్రియంతో నిన్ను చూచి పరవశించిపోయే గోపికలలాగా ఆడులేళ్ళు రెప్పవేయకుండా నిన్ను గుడ్లప్పగించి చూస్తున్నాయి. కోకిలలు, మాయిండ్లకు గొప్ప అతిథి వచ్చాడని ఆనందిస్తూ కమ్మని కూతలతో నీకు స్వాగతం పలుకుతున్నాయి. వనంలో తిరుగాడే ప్రాణులన్నీ నీరాకవలన ధన్యమై మురిసిపోతున్నాయి.
10-599 నీపాదములు సోకి నేఁడు వీరుత్తృణ... (సీసము).
iBAA పద్య గానం
iBAP పద్యము
నీపాదములు సోకి నేఁడు వీరుత్తృణ
  పుంజంబుతో భూమి పుణ్యయయ్యె
నీనఖంబులు దాఁకి నేఁడు నానాలతా
  తరుసంఘంబులు కృతార్థంబులయ్యె
నీకృపాదృష్టిచే నేఁడు నదీశైల
  ఖగమృగంబులు దివ్యకాంతిఁ జెందె
నీపెన్నురము మోవ నేఁడు గోపాంగనా
  జనముల పుట్టువు సఫలమయ్యె

ఆటవెలది

నని యరణ్యభూమి నంకించి పసులును
మిత్రజనులు దాను మేపుచుండి
నలినలోచనుండు నదులందు గిరులందు
సంతసంబు మెఱయ సంచరించె.

iBAT సందర్భం

బలరామకృష్ణులు వనంలో తిరుగుతూ ఒకరినొకరితో మాట్లాడుకొంటున్నారు. అన్నతో కన్నయ్య ఆ వనంలోని అందాలన్నీ పులకించిపోతున్నాయని చెప్తున్నాడు.

iBAT తాత్పర్యము

అన్నా! నీపాదాలు తాకటంవలన ఈ పొదలు, పచ్చికబయళ్ళూ గల నేల పులకించిపోతున్నది. నీగోళ్ళు తాకటంవలన పూలతీగలూ, పండ్లచెట్లూ కృతార్థములయ్యాయి. నీవు కృపతో కన్నులు విప్పారజేసి చూస్తుంటే నదులకూ, కొండలకూ దివ్యకాంతి అలవడినది. నీవిశాలమైన రొమ్మును కౌగి లించుకొని గోపాలకులూ, గొల్లభామలూ జన్మసాఫల్యం పొందారు.

అని అన్నతో హాయిగా ముచ్చటలాడుతూ కన్నయ్య పశువులను మేపుతూ నదులలో కొండలలో ఎగురుతూ దూకుతూ గంతులు వేస్తూ సంచరించారు.
10-602 ఒకచోట మత్తాలియూధంబు జుమ్మని... (సీసము).
iBAA పద్య గానం
iBAP పద్యము
ఒకచోట మత్తాలియూధంబు జుమ్మని
  మ్రోయంగ జుమ్మని మ్రోయుచుందు
నొకచోటఁ గలహంసయూథంబు కూడి కేం
  కృతులు సేయంగఁ గేంకృతులు సేయు
నొకచోట మదకేకి యూథంబులాడంగ
  హస్తాబ్జములు ద్రిప్పి యాడఁ దొడఁగు
నొకచోట వనగజయూథంబు నడవంగ
  నయముతో మెల్లన నడవఁ జొచ్చుఁ

ఆటవెలది

గ్రౌంచచక్రముఖర ఖగము లొక్కకచోటఁ
బలుకవానియట్ల పలుకుఁ గదిసి
పులుల సింహములను బొడగని యొకచోటఁ
బాఱచు మృగములందుఁ దఱచుగూడి.

iBAT సందర్భం

కన్నయ్య గోపబాలురు వనంలో చూస్తున్న అందచంచాలు, వానిని తన నడకలలో, మాటలలో, ప్రవర్తనలో చూపిస్తున్నాడు చూడండి.

iBAT తాత్పర్యము

పూదేనలు త్రావి ఒడ లెరుగకుండా ఊగిపోయే తుమ్మెదలగుంపులు జుమ్మంటూ నాదం చేస్తూ ఉంటే. కృష్ణుడు అచ్చువానిలాగానే జుమ్మంటూ నాదం చేస్తున్నాడు. కలహంసలు కమనీయంగా క్రేంకారావాలు చేస్తుంటే ఆ మనోహరనాదాలను అనుకరిస్తున్నాడు. మత్తెక్కిన నెమళ్ళగుంపులు నాట్యమాడుతూ ఉంటే వానికంటే అందంగా గంతులు వేస్తున్నాడు. మదగజాలు మందగమనంతో అడుగుతీసి అడుగు వేస్తుంటే ఆ నడక అందచంచాలు అవి తన దగ్గరనే నేర్చుకొన్నాయా అన్నట్లు అడుగులు వేస్తున్నాడు. వింతవింత పక్షి కూతలన్నింటినీ అనుకరిస్తున్నాడు. పులులు సింహాలూ పరుగులు తీస్తుంటే వానిని తరుముకొంటూ తాను కూడా వానిలో కలసిపోతున్నారు.
10-607 వేదాంతవీథుల విహరించు విన్నాణి... (సీసము).
iBAA పద్య గానం
iBAP పద్యము
వేదాంతవీథుల విహరించు విన్నాణి
  విహరించుఁ గాంతారవీథులందు
ఫణిరాజు శయ్యపైఁ బవళించు సుఖభోగి
  పల్లవశయ్యలఁ బవ్వళించు
గురుయోగిమానసగుహలఁ గ్రుమ్మరుమేటి
  గ్రుమ్మరు నద్రీంద్ర గుహలలోనఁ
గమలతోడఁ బెనంగి కడు డయ్యు చతురుఁడా
  భీరజనులతోడఁ బెనఁగిడయ్యు

ఆటవెలది

నఖిలలోకములకకు నాశ్రయుండగు ధీరుఁ
డలసి తరులనీడ నాశ్రయించు
యాగభాగచయము లాహరించు మహాత్ముఁ
డడవిలోని ఫలము లాహరించు.

iBAT సందర్భం

ఆ పరమాత్ముడు చిన్ని కన్నయ్యలా ప్రవర్తించే చిన్నెలు. ఆయన మహత్త్వం రెండూ వివరిస్తున్నారు. పోతనమహాకవి.

iBAT తాత్పర్యము

పరమాత్ముడు పసిపాపడై తిరుగుతూ ఉంటే కనుగొని జనులందరూ ఆనందసాగరంలో మునకలు వేస్తున్నారు. వేదాంతవీధులలో ఎక్కడో ఎవరికీ అందనంత ఎత్తున విహరించే ఆ స్వామి అడవిదారులలో తిరుగుతూ ఆడుకొంటున్నారు. పాలకడలిలో శేషతల్పాన యోగనిద్రలో ఉండే ప్రభువు చిగుళ్ళపాన్పులమీద శయనిస్తున్నారు. గొప్పయోగుల మనస్సు గుహలలో గుట్టుగా సంచరించే మేటి కొండగుహలలో తిరుగుతూ మురిసిపోతున్నాడు. లక్ష్మీదేవితో నిరంతరము ఆడుకొని ఆనందించే స్వామి గొల్లభామలతో, గొల్లపిల్లలతో ఆడి యాడి సొలసి కునుకు తీస్తున్నారు. సర్వమునకు ఆశ్రయమైన భగవంతుడు చెట్లనీడను ఆశ్రయించి వానికి ప్రమోదం కలిగిస్తున్నాడు. మహాయజ్ఞాలలో మహామంత్రాలతో పవిత్రమైన హెూమభాగాలను పుచ్చుకొనే స్వామి అడవిలోని చెట్ల పండ్లు తనంత తాను కోనుకొని తింటున్నాడు
10-609 అలసినచోఁ గొంద ఱతిమోదమున వీపు... (సీసము).
iBAA పద్య గానం
iBAP పద్యము
అలసినచోఁ గొంద ఱతిమోదమున వీపు
  లెక్కించుకొని పోను రేపు మెఱసి
సొలసి నిద్రించినచో నూరుతల్పంబు
  లిడుదురు కొందఱు హితవు గలిగి
చెమరించి యున్నచోఁ జిగురుటాకులఁ గొంద
  ఱొయ్యన విసరుదు రుత్సహించి
దవ్వేగి నిలుచుచోఁ దడయక కొందఱు
  పదము లొత్తుదు రతిబాంధవమున

ఆటవెలది

గోపవరులు మఱియుఁ గొందరు ప్రియమున
మాధవునకుఁ బెక్కుమార్గములను
బనులు చేసి రెల్ల భవములఁ జేసిన
పాపసంచయములు భస్మములుగ.

iBAT సందర్భం

పరమాత్ముడు కన్నయ్యగా గోపబాలులతో ఆడిపాడి అలసిసొలసి వారితో సేవలందుకొంటున్న వైనం.

iBAT తాత్పర్యము

కన్నయ్య ఒక్కొకప్పుడు అలసిపోయిట్లు అభినయిస్తూ ఉంటాడు. అప్పుడు చెలికాండ్రు అతనిని వీపుమీద ఎక్కించుకొని పోవటానికి పోటీపడుతూ ఉంటారు. సొలసి నిద్రపోతూ ఉంటాడు. గోపబాలురు తమ ఒడిలో పెట్టుకొని జోకొడుతూ ఉంటారు. మొగం మీద చిరుచెమటబిందువులు కన్పట్టినంతనే చిగురుటాకులతో వీవనలు చేసి విసరుతూ ఉంటారు. అటగా బాగా దూరం పోయి నిలుచుంటే చెలిమితో పరుగెత్తుకొంటూ పోయి కాళ్ళు ఒత్తుతూ ఉంటారు. ఈవిధంగా గోపబాలురందరూ ఏదో ఒక విధమైన సేవ చేసి ఎన్ని జన్మలనుండియో వచ్చి వడిన పాపవపురాశులన్నింటినీ భస్మం చేసివేస్తూ ఉంటారు.
10-630 ఒకనాడు బలభద్రుఁ డొక్కఁడు రాకుండ... (సీసము).
iBAA పద్య గానం
iBAP పద్యము
ఒకనాడు బలభద్రుఁ డొక్కఁడు రాకుండ
  గోపాలకులు దానుగూడి కృష్ణుఁ
డడవికిఁ జని యెండ నాగోవులును గోప
  కులు నీరుపట్టునఁ గుంది డస్సి
కాళిందిలో విషకలితతోయముఁ ద్రావి
  ప్రాణానిలంబులు పాసివడిన
యోగీశ్వరుండు యోగివంద్యుఁడు కృష్ణుఁ
  దీక్షణామృతధార లెలమిఁ గురిసి

ఆటవెలది

పనుల గోపకులను బ్రదికించె మరలంగ
వారు తమకుఁ గృష్ణువలన మరల
బ్రదుకు గలిగె నంచు భావించి సంతుష్ట
మానసములఁ జనిరి మానవేంద్ర!

iBAT సందర్భం

శ్రీకృష్ణపరమాత్మ దివ్యలక్షణాలు భాగవతం అనేక సందర్భాలలో వివరించి చెప్పింది. అందులో ఒక ఘట్టం.

iBAT తాత్పర్యము

పరీక్షిన్మహారాజా! ఒకనాడు కృష్ణుడు అన్నను కలుపుకోకుండా గోపాలకులను కలుపుకొని అడవికి పోయాడు. కొంతసేపునకు వారికి దాహం వేసింది. ఆవులూ, దూడలూ దాహం వేయగా దగ్గరలో ఉన్న మడుగు కాళిందిలో నీరు ఆబగా త్రాగారు. ఆనీరంతా విషమయం. త్రాగిన వారందరూ ప్రాణాలు కోల్పోయారు. అపుడు యోగీశ్వరులకు ఈశ్వరుడు, యోగులందరి నమస్కారాలందుకొనేవాడూ అయిన కృష్ణును చూపుల తోనే అమృతధారలను కురిసి పసులను, గోపకులను బ్రదికించాడు. వారందరూ కృష్ణుడే మాకు పునర్జన్మ నిచ్చాడని ఆనందంతో కేరింతలు కొట్టుకొంటూ ఇళ్ళకు చేరుకొన్నారు.
10-635 మానవేశ్వర! యొక్క మడుగు కాళిందిలో... (సీసము).
iBAA పద్య గానం
iBAP పద్యము
మానవేశ్వర! యొక్క మడుగు కాళిందిలో
  గలదది యెప్పుడుఁ గాలియాహి
విషవహ్నిశిఖలచే వేఁచుచుండును మీఁదఁ
  బఱతెంచినంతన పక్షులైనఁ
బడి మ్రగ్గునందుఁ దద్భంగశీకరయుక్త
  పవనంబు సోఁకినఁ బ్రాణు లెవ్వి
యైన నప్పుడ చచ్చునట్టి యా మడుగులో
  నుదకంలు వొంగుచు నుడుకుచుండఁ

తేటగీతి

జూచి వెఱగంది కుజనుల స్రుక్కఁజేయ
నవతరించిన బలువీరుఁ డాగ్రహించి
భుజగవిషవహ్నిదోషంబు పొలియఁజేసి
సుజలుం గావించి యీనదిఁ జూతుననుచు.

iBAT సందర్భం

కృష్ణయ్య లీలలలో కాళియమర్దనం ఒక గొప్ప లీల. ఆ లీలకు భూమిక అయిన పద్యాన్ని గమనిద్దాం.

iBAT తాత్పర్యము

రాజు! యమునానదిలో ఒక మడుగు ఉన్నది. అందులో కాళియు డనే ఒక మహాసర్పం ఉండేది. అది తన విషం మంటలతో మడుగును ఉడకబెడుతూ ఉండేది. దానిపై భాగంలో మింట ఎగిరే పక్షులు కూడా ఆ వేడి తట్టుకోలేక మాడి బూడిద అయ్యేవి. ఆ మడుగు అలలమీది నుంచి వచ్చే గాలి మేనికి తాకితే చాలు, ఏ ప్రాణి అయినా ప్రాణాలు కోల్పోవలసిందే. ఆ మడుగులో నీరు ఎల్లప్పుడూ ఎసరులాగా కళపెళా ఉడికిపోతూ ఉండేది.
10-652 ఎదురువచ్చినఁ జాల నెమురుగాఁ జనుదెంతు... (సీసము).
iBAA పద్య గానం
iBAP పద్యము
ఎదురువచ్చినఁ జాల నెమురుగాఁ జనుదెంతు
  వెదురువచ్చిన నేఁడదేల రావు
చూచినఁ గృపతోడఁ జూచుచుందువు నీవు
  సూచినఁ గనువిచ్చి చూడవేలఁ
దాసిన నఱలేక దాయంగ వత్తువు
  డాసిన నేటికి దాయ విచటఁ
జీరిన నో యని చెలరేగి పలుకుదు
  విదియేమి సీరిన నెఱుగకుంట

ఆటవెలది

తలఁపు సేనునంతఁ దలపోయుచుందువు
తలఁపు సేయ నేఁడు తలఁపవకట
యనుచు భక్తివివశలాడెడి కైవడి
వ్రేత లెల్ల నాడి వివశలైరి.

iBAT సందర్భం

ఒరే! నాయనా! మేము ఎదురుగా వస్తుంటే చెంగుచెంగున దూకుకొంటూ ఎదురువచ్చేవాడవు. ఈ రోజు రాలేదేమి? చూస్తే కృప అనే అమృతరసం చిప్పిలినట్లుగా చూసేవాడవు. ఇప్పుడు మమ్ములను కనువిచ్చి చూపవేమి? అల్లంతదూరంలో ఉండగానే వచ్చి ఒడులలో వ్రాలేవాడవు. ఇప్పుడు ఇంత దగ్గరగా వచ్చినా దగ్గరకు రావేమి? కృష్ణా! అని చిన్నగా పిలిస్తే చాలు గొంతెత్తి ‘ఓయ్’ అని పలికేవాడవు. ఇప్పుడు ఎంతగా పిలిచినా ఏమీ తెలియని వాడిలాగా ఉండిపోయావు. మేము మనస్సులో తలచినా నీవు మమ్ములను తలచుకొంటూ మాకు ఆనంద మందించేవాడవు. ఈరోజు మమ్ములను తలపవేమి? అంటూ ఆ గోప భామలందరూ ఒడళ్ళెరుగకుండా భక్తికి వశమై పోయి అరుస్తూ ఉండి పోయారు.

iBAT తాత్పర్యము

ఒరే! నాయనా! మేము ఎదురుగా వస్తుంటే చెంగుచెంగున దూకుకొంటూ ఎదురువచ్చేవాడవు. ఈ రోజు రాలేదేమి? చూస్తే కృప అనే అమృతరసం చిప్పిలినట్లుగా చూసేవాడవు. ఇప్పుడు మమ్ములను కనువిచ్చి చూపవేమి? అల్లంతదూరంలో ఉండగానే వచ్చి ఒడులలో వ్రాలేవాడవు. ఇప్పుడు ఇంత దగ్గరగా వచ్చినా దగ్గరకు రావేమి? కృష్ణా! అని చిన్నగా పిలిస్తే చాలు గొంతెత్తి ‘ఓయ్’ అని పలికేవాడవు. ఇప్పుడు ఎంతగా పిలిచినా ఏమీ తెలియని వాడిలాగా ఉండిపోయావు. మేము మనస్సులో తలచినా నీవు మమ్ములను తలచుకొంటూ మాకు ఆనంద మందించేవాడవు. ఈరోజు మమ్ములను తలపవేమి? అంటూ ఆ గోప భామలందరూ ఒడళ్ళెరుగకుండా భక్తికి వశమై పోయి అరుస్తూ ఉండి పోయారు.
10-658 శ్రవణరంధ్రంబులు సఫలతఁ బొందంగ... (సీసము).
iBAA పద్య గానం
iBAP పద్యము
శ్రవణరంధ్రంబులు సఫలతఁ బొందంగ
  నెలమి భాషించు వారెవ్వరింకఁ
గరచరణాదుల కలిపి ధన్యత నొంద
  నెగిరిపైఁ బ్రాకువారెవ్వరింక
నయనయుగ్మంబు లున్నతిఁ గృతార్థములుగా
  నవ్వులు సూపు వారెవ్వరింక
జిహ్వలు గౌరవశ్రీఁ జేరఁ బాటల
  యెడఁ బలికించు వారెవ్వరింక

ఆటవెలది

తండ్రి నీవు సర్పదష్టుండవైయున్న
నిచట మాకుఁ బ్రభువు లెవ్వరింక
మరిగి పాయలేము మాకు నీతోడిద
లోక మీవు లేని లోకమేల?

iBAT సందర్భం

కాళీయుడు కండకావరంతో స్వామిని చుట్టబెట్టినప్పుడు గోపవనితలందరు గోపాలబాలునితో ఉన్న చెలిమి మొదలైన అనుబంధాలను చెప్పుకొని ఇకపై మాకేది దిక్కు అంటూ విలపిస్తున్నారు.

iBAT తాత్పర్యము

మాచెవులకు సఫలత కలిగేవిధంగా మాతో ఇకపై మాట్లాడేది ఎవ్వరు? మా కాళ్ళాకూ, చేతులకూ ధన్యత కలుగునట్లుగా మాపైకెక్కి అందంగా చిందులు వేసేది ఇకపై ఎవ్వరు? కన్నుల జంటకు పరమ సంతృప్తి కలిగే విధంగా నవ్వే ఆనందరూపుడు మాకింక ఎక్కడ దొరుకు తాడు ? నాలుకలు గౌరవసంపదలో అలరారే విధంగా మాతో పాటలు పాడించే స్వామి ఎక్కడ? తండ్రీ! పాముకాటు పడి నీవు చేష్టలు దక్కి ఉంటే మమ్ములను కాపాడే ప్రభువు ఎవరు? మేమింక తిరిగి మాకొంపలకు పోము నీ గతియే మాగతి. అని ఒకళ్ళ నొకళ్ళు కౌగిలించుకొని గొంతెత్తి విలపిస్తున్నారు.
10-664 ఘన యమునానదీకల్లోల ఘోషంబు... (సీసము).
iBAA పద్య గానం
iBAP పద్యము
ఘన యమునానదీకల్లోల ఘోషంబు
  సరసమృదంగఘోషంబుగాఁగ
సాధుబృందావనీచరచంచరీక గా
  నంబు గాయకసుగానంబు గాఁగ
గలహంస సారసకమనీయమంజు శ
  బ్దంబులు తాళశబ్దములు గాఁగ
దివినుండి వీక్షించు జగంధర్వాది
  జనులు సభాసీన జనులు గాఁగ

తేటగీతి

బద్మరాగాది రత్యప్రభాసమాన
మహితకాళియఫణిఫణామండపమున
నలినలోచన విఖ్యాతనర్తకుండు
నిత్యనైపుణ్యమునఁ బేర్చి నృత్యమాడె.

iBAT సందర్భం

కాళియఫణిఫణామండలం మీద జగన్నాటక సూత్రధారి నర్తనక్రీడ పరమాద్భుతంగా చేసి భక్తజనుల హృదయానికి పారవశ్యం కలుగజేసిన ఘట్టం.

iBAT తాత్పర్యము

కాళియుని పడగలమీద పరపుగా ఉన్న తావు రంగస్థలం అయింది. ఆ పడగలమీద వెలుగొందే మణుల కాంతులు కాగడాల పనులను చేస్తూ ఉన్నాయి. అలలతో ఆకసం తాకుతున్న యమునానది చప్పుళ్ళు మద్దెలనాదాలను వెలువరిస్తున్నాయి. మేని పారవశ్యంతో రెప్పవ్రేయక చూస్తూ ఉన్న బృందావనంలోని గోపకులు, గోపికలు అనే తుమ్మెదల బారులు కమ్మగా పాటలు పాడుతున్నాయి. హంసలు మొదలైన నీటి పక్షుల కూతలు తాళమేస్తున్న తీరును తలపింపజేస్తున్నది. స్వర్గసీమల నుండి దిగివచ్చిన దేవతలు గంధర్వులు మొదలైన జనులు ప్రేక్షకులై శ్రోతలై ఆనందిస్తూ ఉన్నారు. అట్టి మధురాతిమధురసన్నివేశంలో పద్మాల వంటి పెద్దపెద్ద కనులను లయాత్మకంగా త్రిప్పుతూ శ్రీకృష్ణస్వామి నట రాజై దివ్యనర్తనం చేశాడు.
10-681 విశ్వంబు నీవయై విశ్వంబుఁ జూచుచు... (సీసము).
iBAA పద్య గానం
iBAP పద్యము
విశ్వంబు నీవయై విశ్వంబుఁ జూచుచు
  విశ్వంబు సేయుచు విశ్వమునకు
హేతువవై పంచభూతమాత్రేంద్రియ
  ములకు, మనప్రాణబుద్ధిచిత్త
ములకెల్ల నాత్మవై మొనసి గుణంబుల
  నావృతమగుచు నిజాంశభూత
మగు నాత్మచయమున కనుభూతి సేయుచు
  మూడహంకృతులచే ముసుఁగువడక

తేటగీతి

నెఱి ననంతుడవై దర్శనీయరుచివి
గాక, సూక్ష్ముండవై నిర్వికారమహిమఁ
దనరి కూటస్థుఁడైన సమస్తంబు నెఱుఁగు
నీకు మ్రొక్కెద మాలింపు నిర్మలాత్మ.

iBAT సందర్భం

కాళియుని కాంతలు పూర్వజన్మసంస్కారవశంచేత శ్రీకృష్ణస్వామికి, పరమాత్మతత్వాన్ని పరమమనోహరంగా విన్నవించుకొంటున్నారు.

iBAT తాత్పర్యము

స్వామీ! ఈ విశ్వమంతా నీవే. అయినా ఈవిశ్వాన్నంతా నీవు చూస్తూ ఉంటావు. అంతేకాదు. ఈ విశ్వాన్నంతా రూపొందించినవాడవు నీవే. అందువలన నిన్ను విశ్వానికి కారణమైనవాడని వేదాలు సంభావిస్తు న్నాయి. నింగి, గాలి, నిప్పు, నీరు, నేల అనే అయిదు భూతాలూ, శబ్దము, స్పర్శ, రూపము, రసము, గంధము అనే అయిదు భూతముల ఉనికిని తెలియజేసే విషయాలూ, వానిని పట్టుకొనే ఇంద్రియాలూ, (చెవి, చర్మము, కన్ను, నాలుకు, ముక్కు) సర్వప్రాణుల దేహాలలో ఉన్నట్లుగా తెలియవచ్చు మనస్సూ, ప్రాణము, బుద్ధి, చిత్తము అనే సూక్ష్మదేహ స్వరూపాలూ ఈ అన్నీ నీవే. అన్నింటినీ కదలించేవాడవు నీవే, సత్త్వము, రజస్సు, తమస్సు అనే మూడు గుణాల కలయికచేత ఏర్పడిన ప్రకృతిగా తెలియవచ్చే తత్త్వానివి నీవే సాత్వికము, రాజనము, తామసము అనే మూడు విధములయిన అహంకారములు ఒకముసుగుగా అయి జీవులకు నిన్ను తెలియకుండా చేస్తున్నాయి. గొప్పసాధనతో వివేకంతో విజ్ఞానంతో అముసుగును తొలగించుకోగలిగితే ముసుగూ నీవే, ముసుగులో ఉన్నదీ నీవే అని తెలుస్తుంది. ఆవిధంగా నీవు అనంతుడవు, అంటే అనందస్వరూపుడవు, సృష్టిలో ప్రతివ్యక్తికి ఏవో ఏవో వికారాలు ఉంటాయి కానీ నీకు ఉండవు. గంటం మీద, ఇనుపముక్కను చాలా మిక్కిలిగా కాల్చి ఉంచి పైన సమ్మెటతో బాదుతూ ఇనుమును అనేక వస్తువులుగా చేసుకోవటం చూస్తున్నాం. అలా అనేకములుగా అయ్యేది ఇనుపముక్కయే కానీ ఆధారంగా నిలిచిన కూటం కాదు. (దాగలి - పొగగొట్టటానికి ఆధారంగా నిలిపిన ఒక దిమ్మ). నీవు అటువంటివాడవు. సర్వజ్ఞానాలూ ఎరిగినవాడవు. అట్టి పరమాత్మకు నీరు మ్రొక్కుతున్నాము. మా మొదలు ఆలకించు మహాత్మా!
10-692 వివిధభావాకార వీర్యబీజాశయ... (సీసము).
iBAA పద్య గానం
iBAP పద్యము
వివిధభావాకార వీర్యబీజాశయ
  జవయోనియుతముగా జగములెల్ల
నీవ చేసితి మున్న నేమాజగంబులో
  సహజకోపనులము సర్పములము
దుర్వారమైన నీతోరంపుమాయ నే
  మెఱిఁగి దాఁటెదుపనికెంతవార
మంతకుఁ గారణ మఖిలేశ్వరుండవు
  సర్వజ్ఞుఁడవు నీవు జలజనయన

తేటగీతి

మనిచెదేనియు మన్నించి మనుపు నన్ను
నిగ్రహించెదవేనియు నిగ్రహింపు
మింక సర్వేశ మాయిమ్ములెందుఁ గలవు
చిత్తమందున్న క్రమమునఁ జేయఁదగును.

iBAT సందర్భం

బాలకృష్ణుని అనుగ్రహాన్ని పొందిన కాళియుడు కృతజ్ఞతాపూర్వకంగా అహంకారాన్ని వీడి వేడుకొంటున్నాడు.

iBAT తాత్పర్యము

సర్వేశ్వరా! వేరువేరయిన భావాలను, ఆకారాలను, శక్తులను, విత్తనములను, హృదయాలను, వేగాలను పుట్టుకతావులను అన్నింటినీ గుదిగ్రుచ్చి లోకాలనన్నింటినీ ఆదికాలంలో నీవే సృష్టించావు. మేము ఆ నీలోకాల కదలికల ఆటలలో పావులము. కోపం మా సహజలక్షణం. పాకుకొంటూ పోతాము. అట్టి మేము ఎవ్వరికీ, ఎన్నటికీ తొలగించుకొనలేని మహామాయను తెలియగలమా? దాటిపోగలమా? మన సర్వమునకు కారణమైన సర్వేశ్వరుడవు. సర్వజ్ఞడవు నీవు. మన్నించదలచుకొంటే మన్నించు. శిక్షించదలచుకొంటే శిక్షించు. మాకు తప్పించుకొనే దారులు ఏమి ఉన్నాయి? నీచిత్తం వచ్చినట్లు చెయ్యి మహాత్మా!
10-702 సర్పభీరువులైన జనులెల్ల నెల నెల... (సీసము).
iBAA పద్య గానం
iBAP పద్యము
సర్పభీరువులైన జనులెల్ల నెల నెల
  సరసభక్ష్యములు వృక్షముల మొదల
సర్పంబులకుఁ బెట్ట సర్పంబులును మును
  సర్పాంతకుఁడు దమ్ము జంపకుండఁ
బ్రతిమాసమును దమభాగభక్ష్యంబులా
  పక్షిరాజున కిచ్చి బ్రదుకుచుండ
విషవీర్యదుర్మదావిష్టుఁడై కాళియుఁ
  డహి కులాంతకుని పాలపహరించి

తేటగీతి

యీక తన పాలిబలిభాగమెల్లఁ దినిన
విని ఖగేంద్రుఁడు కోపించి వానితలలు
చీరి చెండాడి భోగంబు చంపివైచి
ప్రాణములఁ బాపి వచ్చెదఁ బట్టియెనయు

iBAT సందర్భం

కాళియుడు గరుత్మంతునికి భయపడటానికి కారణమేమిటని పరీక్షిత్తు శుక్రమహర్షిని అడుగగా శుక యోగీంద్రులు చెప్పిన వివరమిది.

iBAT తాత్పర్యము

రాజా! విను. లోకంలో పాములకు భయపడే జనులందరూ నెలనెలా రుచికరములైన వంటకాలు చేసికొని చెట్లమొదళ్ళలో పాములకు నైవేద్యంగా పెట్టేవారు. ఆ సర్పాలు కూడా గరుత్మంతుడు తమ్ము చంపకుండా తమకు నివేదించిన మొత్తాలలో కొంతభాగం తీసి పక్షిరాజుకు పెట్టేవారు. ఆవిధంగా వారు తమ్ము తాము కాపాడుకొంటూ బ్రదుకుతున్నారు.
10-753 పూర్వవాయువులు ప్రభూతంబులై వీచెఁ... (సీసము).
iBAA పద్య గానం
iBAP పద్యము
పూర్వవాయువులు ప్రభూతంబులై వీచెఁ
  బడమట నింద్రచాపంబు తోఁచెఁ
పరివేషయుక్తమై భానుమండల మొప్పె
  మెఱపు లుత్తరదిశ మెఱవఁ దొడఁగె
దక్షిణగాములై తనరె మేఘంబులు
  జలచరానీకంబు సంతసించెఁ
జాతకంబబుల పిపాసలు కడపలఁజేరెఁ
  గాంతారవహ్నుల గర్వమడఁగె

ఆటవెలది

నిజకరాళివలన నీరజబంధుండు
తొల్లి పుచ్చుకొన్న తోయమెల్ల
మరల నిచ్చుచుండె మహి కర్షకానంద
కందమైన వాన కందువనొగి.

iBAT సందర్భం

బృందావనంలో రామకృష్ణుల రసరమ్యసంచారం అందరికీ ఆహ్లాదకరంగా సాగుతున్నది. గోవులు, గోపికలు, గోపకులు, బాలకులు అందరూ ఆనందరససాగరంలో మునిగి తేలుతున్నారు. వరుసగా ఋతువులు మారుతున్నాయి.

iBAT తాత్పర్యము

వానకాలం వచ్చింది. ప్రకృతి అంతా పులకరించి పోతున్నది. తూర్పుగాలులు పెద్దగా వీచాయి. పడమటి దిక్కు ఇంద్రధనుస్సు ఏడురంగులతో చూడముచ్చటగా కానవస్తున్నది. సూర్యబింబాన్ని బిందువుగా చేసుకొని గుండ్రంగా పాలపుంత చుట్టుకొని వచ్చింది. ఉత్తరదిక్కుగా ఉరుములు మెరుపులూ ఆర్భాటం చేస్తున్నాయి. మబ్బులు దక్షిణదిక్కుగా దౌడు తీస్తున్నాయి. నూతులలో, బావులలో, ఏరులలో చేపలు, కప్పలు ఆనందంతో పొంగిపోతున్నాయి. వానకోయిలల గొంతెండిపోవటం ఆగిపోయింది. కారుచిచ్చుల గర్వం అణగిపోయింది. తన కిరణాలనే చేతులతో నేలమీద ఉన్న నీటినంతటినీ తీసుకొన్న సూర్యుడు వేయిరెట్లెక్కువగా తిరిగి నేలమీద వానగా కురిపిస్తున్నాడు. భూదేవి ఆనందంతో పులకించిపోతున్నది. పంటలలో నేలతల్లి నిండుచూలాలు లాగా విరాజిల్లుతున్నది.
10-761 విశ్వమోహనమైన వేణు నినాదంబు... (సీసము).
iBAA పద్య గానం
iBAP పద్యము
విశ్వమోహనమైన వేణు నినాదంబు
  సరసగంభీరగర్జనము గాఁగ
మహనీయనిర్మలమందహాసద్యుతి
  లలితసౌదామనీలతిక గాఁగఁ
దలచుట్టుబాగుగఁ దనరు పింఛపుదండ
  శైలభేదనశరాసనము గాఁగఁ
గరుణాకటాక్షవీక్షణ సుధావర్షంబు
  సలిలధారాప్రవర్షంబుగాఁగ

తేటగీతి

జాడ నేతెంచు గోపాలజనమునీంద్ర
చాతకంబుల దురవస్థ సక్కఁజేసి
కృష్ణమేఘంబు బహుతరకీర్తి నొప్పి
విమలబృందావనాకాశవీధియందు.

iBAT సందర్భం

వర్షాకాలంలోని మేఘాలను చూచి గోపకులు ఆ సౌందర్యంలో తమ కన్నయ్యనే దర్శిస్తున్నారు.

iBAT తాత్పర్యము

అదిగో బృందావనం. అదిగదిగో ఒక నీలమేఘం. పరీక్షించి చూస్తే ఇది మేఘం కాదయ్యా! మన కన్నయ్యలాగా ఉన్నాడు అనుకొంటున్నారు యాదవులు. విశ్వమోహనంగా విశ్వానికంతటికీ ప్రభువైన బాలగోపా లుడు వేణుగానం చేస్తుంటే అది మేఘాలనుండి సాగివస్తున్న ఉరుముధ్వనిలాగా అనిపిస్తున్నది. ఆనందపార వశ్యంతో స్వామి విలాసంగా చిరునవ్వు మోముతోపాటే ఆ దరహాసకాంతి మెరుపుతీగలు తళతళలాడినట్లు గోచరిస్తున్నది. తలచుట్టూ నెమలియీకలు తురుముకొని విలాసంగా తిరుగుతూ ఉంటే ఇదిగిదిగో ఇంద్రధనుస్సు అనుకొంటున్నారు జనాలు. దయతో చెమరిస్తున్న చూపులనుండి జాలువారే బిందువున వానధారలను తలపింప జేస్తున్నాయి. అటువైపు, ఇటువైపూ ఉరకలెత్తే ఉత్సాహంతో తిరుగాడే గోపబాలకులు దేవదేవుని చుట్టుపక్కల ఉండే సనకుడు మొదలైన మునీంద్రులలాగా ఉన్నారు. కొంచెం పరికించి చూస్తే వారి మోములు చాతకాల తుష్టిపుష్టులను అభివ్యక్తం చేస్తున్నాయి.
10-769 కర్ణావతంసిత కర్ణికారప్రభ... (సీసము).
iBAA పద్య గానం
iBAP పద్యము
కర్ణావతంసిత కర్ణికారప్రభ
  గండభాగద్యుతిఁ, గడలు కొలుప
భువనమోహనమైన భ్రూవిలాసంబుతో
  వామభాగానతవదన మొప్ప
నపసవ్యకరమృదులంగుళి చాతురి
  షడ్ఞధ్వనికి మర్మసరణిఁ జూప
డాకాలిమీఁద నడ్డము సాచి నిల్చిన
  పదనఖద్యుతి భూమిఁ బ్రబ్బికొనఁగ

తేటగీతి

మౌలిపింఛముఁ గంఠదామమును మెఱయ
విలసితగ్రామముగ నొక్క వేణువందు
బ్రహ్మగాంధర్వ గీతంబు పరఁగఁ జేసెఁ
జతురనటమూర్తి గోపాలచక్రవర్తి.

iBAT సందర్భం

వర్షాకాలంలోని మేఘాలను చూచి గోపకులు ఆ సౌందర్యంలో తమ కన్నయ్యనే దర్శిస్తున్నారు.

iBAT తాత్పర్యము

చెవులకు అలంకారంగా కొండగోగుపూవు పెట్టుకొన్నాడు. దాని ఎర్రని కాంతి చెక్కిళ్ళమీద చిందులు త్రొక్కుతూ భువనమోహకంగా ఉన్నది. దానికంటే సుందరంగా కనుబొమల కదలికతో అందమైన మోము కొంచెం వంపుతో చూడముచ్చటగా ఉన్నది. ఎడమచేతి మెత్తని వ్రేళ్ళతో చిటికెలు వేస్తూ సప్తస్వరాలతో వీనులకు విందులు చేస్తున్నాడు. పిల్లనగ్రోవి చిల్లులమీద అవి అతిసుకుమారంగా కదలుతూ షడ్ఞధ్వనిసంగతులను పలికిస్తున్నాయి. ఎడమకాలిమీద అడ్డంగా కుడికాలు ఉంచి వ్యత్యస్తసాదారవిందుడై నిలిచి ఉంటే కాలిగోళ్ళకాంతులతో భూదేవి ఒడలు పులకరించిపోతున్నది. సిగలో నెమలియీక, మెడలో తులసిమాల, పెదవిమీద పిల్లన గ్రోవి అలరారుతుండగా ఆ మహాత్ముడు గానం చేస్తూ ఉంటే అది బ్రహ్మగాంధర్వగీతమై ప్రాణులందరినీ పరవశింప జేస్తున్నది.
10-821 బహుజీవనముతోడి భాసిల్లియుండుటో... (సీసము).
iBAA పద్య గానం
iBAP పద్యము
బహుజీవనముతోడి భాసిల్లియుండుటో
  గోత్రంబు నిల్పుటో కూర్మితోడ
మహి నుద్ధరించుటో మనుజసింహంబవై
  ప్రజలఁ గాచుటొ కాక బలిఁ దెరల్చి
పిన్నవై యుండియుఁ బెంపువహించుటో
  రాజుల గెల్చుటో రణములందు
గురువాజ్ఞ సేయుటో గుణనిధివై బల
  ప్రఖ్యాతిఁ జూపుటో భద్రలీల

ఆటవెలది

బుధులు మెచ్చ భువిఁ బ్రబుద్ధత మెఱయుటో
కల్కితనము సేయ ఘనత గలదె
వావిలేదు వారు వారు నావారను
నెఱుకవలదె వలువలిమ్ము కృష్ణ.

iBAT సందర్భం

కన్నయ్య గోపికల వస్త్రాలను నేర్పుగా చేతచిక్కించుకొని కడిమిచెట్టు ఎక్కి కూర్చున్నాడు. చెలువలు సిగ్గుతో తలలు వంచుకొని దీనంగా కృష్ణయ్యా! మాగుడ్డలు నీకెందుకయ్యా! మామానం ఎందుకు తీస్తావయ్యా! వేడుకోవటం ప్రారంభించారు

iBAT తాత్పర్యము

నీవు మహాత్ముడవు. ఒప్పుకుంటాము. దానికి తగినట్లుగా నడచుకోవాలి కానీ తుంటరిపనులు చేయటం మేలా? మాకు తెలిసినంతవరకు మహాకార్యములేవో తెలుపుకుంటాము. విను. 1 పెక్కండ్రతో కలసిమెలసి సుఖంగా ప్రదుకుతూ పదిమందిచేత మెప్పులు పొందాలి. 2. వంశం పేరుప్రతిష్టలను కూర్మితో పెంపొందింప జేయాలి. 3. భూదేవిని ఉద్ధరించాలి. 4. మనుజులలో సర్వశ్రేష్ఠుడవై బలంతో పొగరెక్కినవారిని అణగద్రొక్కి ప్రజలను రక్షించాలి. 5. చిన్నవాడై ఉండి కూడా పెద్దతనంతో మిన్నులు ముట్టాలి. 6. శత్రువులైన రాజులను యుద్ధాలలో గెల్చి వీరశేఖరుడవు కావాలి. 7. సుగుణాలరాశిపై గురువులు ఆజ్ఞను పాటించి పేరు పొందాలి. 8. అందరికీ మేలయ్యేవిధంగా కండబలం, గుండెబలం చూపి కీర్తిపొందాలి. 9. విద్వాంసులు మెచ్చే తీరులో బుద్ధిసంపదతో వెలుగొందాలి. ఇవన్నీ వెనక్కునెట్టి కల్కితనం చూపటం ఘనకార్యమా! వేళాకోళాల సందర్భంలో వావివరుసా చూస్తారు. నీకు అదికూడా లేదు. అందరూ నావారే అనే బుద్ధితో మెలగవద్దా? మాకోకలు మాకు ఇచ్చివేయవయ్యా! కృష్ణా!
10-823 రాజసంబున నీవు రంజిల్లు టెఱుగమే... (సీసము).
iBAA పద్య గానం
iBAP పద్యము
రాజసంబున నీవు రంజిల్లు టెఱుగమే
  చెలరేగి వింతలు సేయుచుండ
సత్త్వసంపద గల్గి జరుగుటఁ దలఁపమే
  సిరిగల్గి యన్యులఁ జెనకుచుండ
గురుతరశక్తియుక్తుఁడ వౌట యెఱుఁగమే
  తామసంబున నెగ్గు దలఁచుచుండ
నొకభంగితో నుండకుంటఁ జింతింపమే
  మాయావియై మాఱుమలయుచుండ

ఆటవెలది

నేమిజాడవాఁడ వేపాటి గలవాఁడ
వేగుణంబు నెఱుఁగ వెల్లయెడల
నొదిగి యుండనేర వోరంత ప్రొద్దును
జటములీఁగదయ్య పద్మనయన!

iBAT సందర్భం

గోపికలు పరమాత్మతత్త్వాన్ని అర్థం చేసుకొని ఉపనిషత్తులు నిరూపించిన తాత్వికరహస్యాలను తెలియ జేస్తున్నారు.

iBAT తాత్పర్యము

మాకు తెలుసులేవయ్యా నీవి తామరపూవులంత కళ్ళు. అవి అటూ ఇటూ విచిత్రంగా త్రిప్పుతూ నీకనులలోనే ప్రపంచాన్నంతా చూపుతున్నావు. హద్దూపద్దూ లేకుండా వింతవింతవనులు చేస్తూ నీరాజసాన్ని పెద్దగొప్పగా ప్రదర్శిస్తున్నావు. సిరినంతటినీ నీగుండెలలోనే దాచుకొని సత్యసంపదతో చెలరేగిపోతున్నావు. అనంతమైన శక్తినంతా నీదేహంలో కట్టిపడవేసి తామసంతో అందరకూ కీడు చేస్తున్నావు. మాయావిలాగా పెక్కు తీరులతో తెలియవస్తూ ఒక్కడవు కావటం దాచివేస్తున్నావు. నీజాడలేమిటయ్యా నీకొలతలు ఎవరికీ దొరకవు గదయ్యా నీగుణాలు ఎవరూ తెలుసుకోలేదు కదయ్యా! ఒక్కక్షణం కూడా ఒరిగి ఒకచోట ఉండవు కదయ్యా! అట్టి నీకు మాబట్టలతో పనియేమిటి? మావి మాకు పారవెయ్యి. పుణ్యం కట్టుకో.
10-839 శృంగారవతులారు సిగ్గేల మిముఁగూడి... (సీసము).
iBAA పద్య గానం
iBAP పద్యము
శృంగారవతులారు సిగ్గేల మిముఁగూడి
  పిన్ననాటను గోలెఁ బెరిగినాఁడ
నెఱుఁగనే మీలోన నెప్పుడు నున్నాఁడ
  నేను చూడని మర్మమెద్దిగలదు
ప్రతనిష్ఠలైయుండి వలువలు గట్టక
  నీరు సొత్తురె మీరు నియతిఁ దప్పి
కాత్యాయనీదేవిఁ గల్లసేయుట గాక
  యీరీతి నోము వారెందుఁ గలరు

ఆటవెలది

వ్రతము ఫలము మీకు వలసినఁ జక్కఁగ
నింతులెల్లఁ జేతు లెత్తి మ్రొక్కి
చేరి పుచ్చుకొనుఁడు చీరలు సిగ్గు వో
వాడనేల యెగ్గులాడనేల?

iBAT సందర్భం

శ్రీకృష్ణుడు చేసిన జ్ఞానబోధను తలకెక్కించుకొన్న గోపికలు మెల్లమెల్లగా వరుసలో శ్రీకృష్ణుని దగ్గరకు సిగ్గుతో చేరుకొంటున్నారు. వారిని అనునయిస్తూ శ్రీకృష్ణుడు అన్నమాటలివి

iBAT తాత్పర్యము

అన్నాడు. “అందాలచందాల సుందరభామలారా! ఇంకా మీకు సిగ్గు ఎందుకు? నేను చిన్నతనంనుండి మీతో కలసిమెలసి పెరిగినవాణ్ణి. నాకు తెలియదా? నేను మీహృదయగుహలలో ఎప్పుడూ క్షణం విరామం లేకుండా ఉన్నాను. (మీరు అనుక్షణం నన్నే ధ్యానిస్తున్నారని నేనెరుగు దును) మీ అంతరంగబహిరంగాలలో నేనెరుగనిది అణుమాత్రం కూడా లేదు. ఇంకా దాచుకొనే ప్రయత్నం ఎందుకు?

అది అలా ఉంచి, మీరు కాత్యాయనీదేవిని గూర్చి వ్రతం చేస్తున్నారు. నిష్ఠలో ఉన్నారు. అలా ప్రతినిష్ఠలో ఉన్నవారు వలువలు వదలి వేసి నీళ్ళలో దిగుతారా? అలా చేసినందువలన మీ వ్రతానికి భంగం ఏర్పడలేదా? అది కూడా అమ్మవారి విషయంలో అపరాధం కాదా? కనుక వ్రతఫలం దక్కాలంటే మీరు రెండు చేతులూ పైకెత్తి జోడించి నాకు మ్రొక్కండి. అలా పైకెత్తి మ్రొక్కుతున్న చేతులతో నాదగ్గరకు వచ్చి చీరలు పుచ్చుకోండి. సర్వజ్ఞుని దగ్గర సిగ్గూ ఎగ్గూ ఏమీ ఉండరాదు.
10-846 లక్షణవతులారు లజ్జించి చెప్పరుఁ గాని... (సీసము).
iBAA పద్య గానం
iBAP పద్యము
లక్షణవతులారు లజ్జించి చెప్పరుఁ గాని
  మీమర్మముల్ గానబడియె
ననుఁ గొల్వఁ జింతించినారు నా చేతను
  సత్యంబు మీనోము సఫలమగును
కామితార్ధంబుల కలిమి చెప్పఁగ నేలఁ
  ననుగొల్వముక్తికి నడవవచ్చుఁ
గడమ గూడఁగ నంబికాదేవి నోమంగ
  నటమీఁద రాత్రులయందు మీకు

ఆటవెలది

నన్నుఁ బొందఁ గల్లు నమ్మిపొండని హరి
వల్క నింతులెల్ల భ్రాంతిఁ జనిరి
తపము పండె ననుచుఁ దత్పదాంభోజముల్
మానసించుకొనుచు మందకడకు.

iBAT సందర్భం

స్వామి కరుణించి వారి చీరలు వారికి ఇచ్చివేశాడు. వారు కృష్ణునిముందే చ్క్కగా చీరలను చుట్టుకొన్నారు. అలాగే స్వామి అనురాగాన్ని హృదయపంజరంలో కట్టిపడవేశారు. వారు ఱెప్పలార్పకుండా స్వామినే చూస్తున్నారు.

అప్పుడు ఆ ప్రాఢబాలకుడు కథాసారాంశమైన మాటలను ఇలా పలికాడు.

iBAT తాత్పర్యము

ఇప్పుడు మీరు సలక్షణంగా ఉన్నారు. మీరు సిగ్గుతో చెప్పరు గానీ నాదగ్గర గుట్టులేమీ ఉండవు. మీరు నన్నేకదా సేవించుకోవాలని చింతించారు? వానేత మీనోము సఫలం అయింది. మీకోరికల సంపదను గురించి చెప్పనేల? నన్ను సేవిస్తే ముక్తికి చేరుకోవటం పరమసత్యం. ఇకమీద నన్ను మీరు రాత్రివేళలలో కూడా చేరుకోవచ్చు. నామాట నమ్మి మీయిండ్లకు పొండి –

విన్న ఆ కాంతలకు నిశ్చయజ్ఞానం కలిగింది. తమ తపస్పు పండింది అనుకొన్నారు. ఆ స్వామి పాదపద్మాలను గుండెలలో దాచుకొని మందలోనికి వెళ్ళారు.
10-852 వల్లవులార యీ వనమున విప్రులు... (సీసము).
iBAA పద్య గానం
iBAP పద్యము
వల్లవులార యీ వనమున విప్రులు
  బ్రహ్మవాదులు దేవభవనమునకు
నరుగుట కాంగిరసాహ్వయ సత్త్రంబు
  సలుపుచునున్నారు సనుఁడు మీరు
మానామములు సెప్పి మైత్రితో నడిగిన
  నన్నంబు పెట్టెదరనుచుఁ బలుక
వారలు చని విప్రవరుల కెల్లను మ్రొక్కి
  పసుల మేపుచు బలభద్ర కృష్ణు

తేటగీతి

లలసి పుత్తెంఛి రిట మమ్ము నన్న మడుగ
ధర్మవిదులార యుర్థిప్రదాతలార
పెట్టుఁ దన్నంబు శ్రాంతులఁ బిలిచి తెచ్చి
పెట్టుదురు గాదె మిముబోటి పెద్దలెల్ల.

iBAT సందర్భం

ప్రాద్దెక్కింది. సూర్యకిరణాలు వెలుపలి శరీరాలను కాల్చివేస్తుంటే అగ్నిదేవుడు కడువులను కాల్చి వేస్తున్నాడు. గోపాలబాలురందరూ బాలకృష్ణునితో ఆకలి వేస్తున్నదయ్యా! అన్నారు దీనమైన మొగాలతో. అప్పుడా కృష్ణుడు, అల్లంతదూరాన ఉన్న మునిపత్నులను వారికి చూపించి,

iBAT తాత్పర్యము

గోపబాలకులారా! ఈవనంలో అదిగో అల్లంత దూరాన కొందరు విప్రులు, వేదం చక్కగా చదువుకొన్నవారు స్వర్గానికి పోయే కోరికతో అంగిరసం అనే పేరుగల యాగం చేస్తున్నారు. మీరు ఆయాగశాల దగ్గరకు వెళ్ళి, మా పేరు చెప్పి మంచిమాటలతో అన్నం అడగండి. వాడు పెడతారు. అన్నమాట విని గొల్లపిల్లలు ఆ బ్రాహ్మణోత్తముల దగ్గరకు వెళ్ళి పాదాలకు నమస్కరించి, బలరాముడు, కృష్ణుడు ఆవులను మేపుతూ అలసి అన్నం అడిగి రండని మమ్ములను మీదగ్గరకు పంపారు. స్వాములారా! మీరు ధర్మం ఎరిగినవారు. అడిగినవారికి లేదనేమాట నోట రానివారు. ఆకలితో అలమటిస్తున్న వారిని పిలిచి, పిలిచి అన్నం పెట్టే మహానుభావులు దయతో, మాకింత అన్నం పెట్టండి అని అడిగారు.
10-861 ఒక చెలికానిపై నొకచేయి సాఁచి వే... (సీసము).
iBAA పద్య గానం
iBAP పద్యము
ఒక చెలికానిపై నొకచేయి సాఁచి వే
  ఱొకచేత బీలాబ్జమూఁచు వానిఁ
గొప్పున కందని కొన్ని కుంతలములు
  చెక్కుల నృత్యంబు సేయువానిఁ
గుఱుచచుంగులు పుచ్చి కొమరారఁగట్టిన
  పసిఁడివన్నియగల పటమువాని
నౌఁదలఁ దిరిగినా నలవడఁ జుట్టిన
  దట్టంపుఁ బించెవుడండవాని

తేటగీతి

రాజితోత్పలకర్ణపూరములవాని
మహితపల్లవపుష్పదామములవాని
భువనమోహననటవేషభూతివానిఁ
గనిరి కాంతలు కన్నుల కఱవు దీర.

iBAT సందర్భం

ఆ మాటలు విన్న మాతృమూర్తులకు మూడుకరణాలూ మోదంతో ఉక్కిరిబిక్కిరి అయిపోయాయి. అన్ని విధాలైన వంటకాలనూ అమర్చుకొని ఒక్కదుముకున కృష్ణుని దగ్గరకు బయలుదేరారు. పిల్లలూ, పెనిమిటులూ అడ్డుపడబోయారు. తొలగండి అని వారిని అదలించి సుదతులు అన్నపుసంభారాలతో యమున ఒడ్డుకు ఒక్క పెట్టున చేరుకొన్నారు.

iBAT తాత్పర్యము

యాగకర్తల ధర్మపత్నులు ఎదుట ఒక దివ్యసుందరముగ్ధమోహనరూపాన్ని దర్శించుకొన్నారు. ఒక చేతిని ఆ ఆనందమూర్తి ఒక చెలికాని మూపుమీద విలాసంగా ఉంచారు. రెండవ చేతిలో ఒక తామరపూవును విలాసంగా కదుపుతున్నాడు. కొప్పులో ఇముడకుండా ఉన్న కేశములు చెక్కులమీద చిందులు చేస్తున్నాయి. చిన్ని చిన్ని చుంగులు పెట్టి పచ్చనివన్నెతో కన్నుతిప్పుకోకుండా చేస్తున్న పట్టువలువ నల్లని మేని కాంతితో సయ్యాట లాడుతున్నది. తలచుట్టూ తిరిగివచ్చేవిధంగా నెమలియీకలదండ వింతరంగులను పుక్కిలిస్తున్నది. ఒక పరమ సుందరమైన నల్లకలువ చెలిమీద మురిసిపోతున్నది. మెడనుండి తొడలవరకు చిగుళ్ళ, పూవులహారాలు తమ భాగ్యానికి పొంగిపోతున్నాయి. ఈ విధంగా భువనాలన్నింటినీ మురిపించే వేషంతో కన్నయ్య ఆ విప్రవనితలకు దర్శనం అనుగ్రహించాడు.
10-869 నాసమీనమున నున్నారంచు నలుగరు... (సీసము).
iBAA పద్య గానం
iBAP పద్యము
నాసమీనమున నున్నారంచు నలుగరు
  బంధులు భ్రాతలు పతులు సుతులు
మిమ్ము దేవతలైన మెత్తు రంగనలార
  నాదేహసంగంబు నరులకెల్ల
సౌఖ్యానురాగసంజనకంబు గాదు ము
  క్తిప్రదాయకము నాకీర్తనమున
దర్శనాకర్ణనధ్యానంబులను గర్మ
  బంధదేహంబునఁ బాసి మీరు

తేటగీతి

మానసంబులు నాయందు మరఁగఁజేసి
నన్ను జేరెదరటమీఁద నమ్ముఁ డనుచుఁ
బలికి వారలు తెచ్చిన భక్షణాదు
లాప్తవర్గంబుతో హరి యారగించె.

iBAT సందర్భం

అయ్యా మాధవా! ఇది నీకు తగునా! మేము లోక సంబంధమైన అన్ని బంధాలూ తెంచుకొని నీ దగ్గరకు వచ్చాము. మా భర్తలు, మా భర్తలూ, పిల్లలూ, చుట్టాలూ వద్దంటున్నా పట్టించుకోకుండా వచ్చాము. ఇప్పుడు మేను తిరిగి వెళ్ళినట్టయితే వారు మమ్ములను గ్రహిస్తారా! గ్రహించకపోతే మేము ఉభయభ్రష్టులము అవుతాము. నీకు కైంకర్యం చేసుకొంటూ నీతోనే ఉండిపోతాము. విని జగదీశ్వరుడు -

iBAT తాత్పర్యము

అమ్మలారా! నాదగ్గరకు వచ్చిన కారణంగా మీపతులు, చుట్టాలు, అన్నదమ్ములు, కొడుకులు, మీవిషయంలో కోపగింపరు. నాదేహంమీద తగులం పెట్టుకోవటంవలన ఎవరికీ భౌతిక సుఖమూ అనురాగము కలుగవు. కానీ అది పునర్జన్మలేని మోక్షాన్ని ప్రసాదిస్తుంది. నాగుణాలను పాడుకొంటూ ఉన్నందువలన, వినుటవలన, ధ్యానించటంవలనా కర్మములకు పట్టుబడి ఉన్న దేహం వదలిపోయిన తరువాత మీరు నాలో ఒక్కటిగా అయిపోతారు. మీ మనస్సులు నాలో లీనం అయిపోతాయి. ఈ నామాట నమ్మండి అని పలికి కృష్ణుడు వారు తెచ్చిన భోజనపదార్థాలనన్నింటినీ చెలులతోపాటు సంతృప్తితో ఆరగించారు.
10-877 యాగంబు చేయంగ నర్థించి వచ్చితి... (సీసము).
iBAA పద్య గానం
iBAP పద్యము
యాగంబు చేయంగ నర్థించి వచ్చితి
  రీయాగమున ఫలమేమి గలుగు
నెవ్వాఁడు దీనికి నీశ్వరుం డధికారి
  యెవ్వఁడు సాధనమెంత వలయు
శాస్త్రీయమో జనాచారమో కార్యంబు
  వైరుల కెఱిఁగింపవలదు గాని
యెఱిఁగెడి మిత్రుల కెఱిఁగింపదగుఁ జేరి
  యెఱిఁగి చేసినఁ గోర్కులెల్లఁ గలుగు

ఆటవెలది

పగయుఁ జెలిమి లేక పరిగిన మిముఁబోటి
మంచివారికేల మంతనంబు
తలఁపు లెల్ల మాకుఁ దగనెఱిఁగింపవే
తాతవాక్సుధాప్రదాతవగుచు.

iBAT సందర్భం

ఒకనాడు నందుడు మొదలైన గోపవృద్ధులందరూ కృష్ణుని దగ్గరకు వచ్చాడు. వారు చెప్పకముందే కృష్ణయ్య రండి రండి. మీరు ఇంద్రయాగం చేద్దామనుకొంటున్నారు కదా!

iBAT తాత్పర్యము

యాగం చేద్దామనుకొని వచ్చారు గదూ! ఈ యాగంవలన ఏమిఫలం కలుగుతుంది? దీనికి ప్రభువైన అధికారి ఎవ్వడు? సాధనసంపత్తి ఎంత కావాలి? ఇది శాస్త్రం విధించిన విషయమా? జనాచారంగా వస్తున్నదా? పగవారికి చెప్పగూడదు కానీ అయినవారితో అన్ని సాధకబాధకాలనూ విచారించాలి. దానితో కార్యం సుసంపన్నం అవుతుంది. ఇంక మనలో మనకు పగా లేదు, చెలిమి లేదు. కాబట్టి మనసులో ఉన్నదానిని దాపరికం లేకుండా నాయనా! నాకు చెప్పు.
10-879 పర్ణన్యుఁడధికుండు భగవంతుఁ దమరేంద్రుఁ... (సీసము).
iBAA పద్య గానం
iBAP పద్యము
పర్ణన్యుఁడధికుండు భగవంతుఁ దమరేంద్రుఁ
  డతనికిఁ బ్రియమూర్తులగుచునున్న
మేఘబృందంబులు మేదివీతలముపై
  నతని పెంపున భూతహర్షణముగ
జలములు గురియుఁ దజ్జలపూరములఁదోగి
  పండుసస్యంబులా పంట తమకు
ధర్మార్ధకామప్రదాయకంబుగ లోకు
  లెల్లను బ్రదుకుదు రింతయెఱిఁగి

తేటగీతి

మేఘవిభుఁడైన యింద్రుఁడు మెచ్చుకొఱకు
నింద్రయాగము సేయుదు రెల్లనృపులు
కామలోభభయద్వేషకలితులగుచుఁ
జేయకుండిన నశుభంబు చెందుఁ బుత్ర

iBAT సందర్భం

కృష్ణుడు పిల్లవాడైనా అరితేరినవానిలాగా మాటలాడాదు. అప్పుడు నందుడు నందనునితో ఇలా అన్నాడు.

iBAT తాత్పర్యము

నాయనా! వర్షములు కురిపించి భూమిని సస్యశ్యామలం చేసి కాపాడే భగవంతుడు దేవేంద్రుడు. అతని స్వరూపాలే అయిన మేఘాలు నేలమీద వానలు కురిపించి వంటలు వండటానికి కారణం అవుతున్నాయి. ఆ పంటలతో జనాలు ధర్మ, అర్థ, కామ పురుషార్ధాలను సక్రమంగా సాధిస్తున్నారు. సుఖసంతోషాలతో బ్రదుకు తున్నారు. కాబట్టి దేవేంద్రుని పరితృప్తికోసం రాజులందరూ ఇంద్రయాగం చేస్తున్నారు. అలా చేయకపోతే అమంగళం కలుగుతుంది.

యజ్ఞం చేస్తే ఇంద్రుడికి ప్రీతి కలుగుతుంది. ఆ ప్రీతివలన వానలు కురుస్తాయి. వానలవలన పంటలు పండుతాయి. మంచి పచ్చిక కనులకు విందు చేస్తుంది. ఆ పచ్చికను పుచ్చుకొని ఆవులు హాయిగా బ్రతుకుతాయి. దానితో నేలమీద జీవులూ, నింగిలో దేవతలూ సుఖంగా ఉంటారు.
10-930 కన్ను దెఱవని కడుఁ జిన్నిపాపఁడై... (సీసము).
iBAA పద్య గానం
iBAP పద్యము
కన్ను దెఱవని కడుఁ జిన్నిపాపఁడై
  దానవి చనుబాలు త్రాగి చంపె
మూఁడవ నెలనాఁడు ముద్దులబాలుఁడై
  కోపించి శకటంబుఁ గూలఁ దన్నె
నేఁడాదికుఱ్ఱఁడై యెగసి తృణావర్తు
  మెడబట్టుకొని కూల్చి మృతునిఁ జేసెఁ
దల్లివెన్నలకునై తను ఱోలఁగట్టినఁ
  గొమరుఁడై మద్దులు కూలనీడ్చెఁ

తేటగీతి

బసులఁ గ్రేపులఁ గాచుచు బకునిఁ జీరె
వెలగతో వత్సదైత్యుని వ్రేట కెడపె
సబలుఁడై ఖరదైత్యుని సంహరించె
నితఁడు కేవలమనుజుఁడే యెంచి చూడ.

iBAT సందర్భం

అయ్యలారా! వానలు ఆగిపోయాయి. గాలి ఔద్దత్వం తగ్గింది. నదులు పొంగిపొరలటం సద్దుకొన్నది. వరదలు తగ్గాయి. మీరందరూ మీమీ వాళ్ళతో, బండ్లతో, బరువులతో మీ యిండ్లకు చేరుకోవచ్చు. అని పలికి వారందరూ భద్రంగా వారి వారి తావులకు చేరిన తరువాత కుదురుగా కొండను పదిలంగా నిలిపాడు. దివిలో దేవదుందుభులు పెద్దగా మ్రోగాయి. గంధర్వులు, కిన్నరులు, కింపురుషులు ఆటపాటలతో వేడుకలు జరుపు కొన్నారు. ఆ అద్భుత అనుభవానికి పరవశులై గోపజనులు నందునితో ఇలా అన్నారు..

iBAT తాత్పర్యము

పుట్టిన పురిటిదినాలలోనే పూతనను పుణ్యలోకాలకు పంపాడు. మూడవనెలలో బండి రక్కసుని ముక్కలు చేశాడు. ఏడాదికుఱ్ఱడై మింటిపైకెగిరి సుడిగాలి రాక్షసుని మెడబట్టుకొని గిలగిలా కొట్టుకొనేట్లు చేసి కూల్చివేశాడు. వెన్నలదొంగ అని అమ్మ రోటికి కట్టివేస్తే రెండు పెద్దమద్దిచెట్లను కూల్చి గంధర్వులకు శాపవిమోచనం గావించారు. సాదాసీదాగా ఆవులను కాచుకొంటూ బకాసురుణ్ణీ, వత్సాసురుణ్ణీ రూపుమాపాడు. ఈ కుఱ్ఱవాడు కేవల మానవుడా? ఏడేండ్ల పిల్లవాడా! ఆటలాగా తామరపూవులాగా కొండ ఎత్తిపట్టుకొన్నారా! ఎంత అద్భుతం!

ఇలా నందునితో చుట్టుప్రక్కలవాళ్ళు అందరూ కొనియాడుతూ ఉంటే నందుడు గర్గాచార్యులవారి పలుకులు స్మరించి కృష్ణుని అవతారతత్వాన్ని సంభావించి ఆనందానుభవంలో మునిగిలేలాడు.
10-938 పరమనిధానంబు భాసురసత్త్వంబు... (సీసము).
iBAA పద్య గానం
iBAP పద్యము
పరమనిధానంబు భాసురసత్త్వంబు
  శాంతంబు హతరజస్తమము నిత్య
మరధికతపోమయ మట్లు కావున మాయ
  నెగడెడి గుణములు నీకు లేవు
గుణహీనుఁడవు గాన గుణముల నయ్యెడి
  లోభాదికములు నీలోనఁ జేర
వైన దుర్జననిగ్రహము శిష్టరక్షయుఁ
  దగిలి చేయఁగ దండధారివగుచు

తేటగీతి

జగము భర్తవు గురుఁడవు జనకుఁడవును
జగదధీశులమను మూఢజనులు దలఁక
నిచ్చపుట్టిన రూపంబు లీపు దాల్చి
హితము సేయుదుగాదె లోకేశ్వరేశ.

iBAT సందర్భం

ఇంద్రుని గుండెలో గుబులు పట్టుకొంది. అపచారం చేశారని బాధపడ్డాడు. బాలకృష్ణుడు ఒక్కచేతితో కొండనెత్తి ఎడా పెడా, వాయించి వేస్తున్న గాలివానకు తల్లడిల్లిపోతున్న అవులకూ, గోపకులకూ రక్షకుడయ్యారు - అని మూడు లోకాల ఎలికను నేను అనే గర్వం తుడిచిపెట్టుకొనిపోగా, కామధేనువును తోడు తీసుకొని కృష్ణస్వామి చెంతకు చేరుకొన్నాడు. ఆయన పొగరెక్కిన ప్రభువుల దురహంకారాన్ని రూపుమాపేవాడూ, సాధుజనులయందు జాలిని పెంపొందించుకొనేవాడూ అనే భావన మెదలుతూనే ఉన్నది అంతరంగంలో. శ్రీకృష్ణుని కాళ్ళమీద బడ్డాడు. చేతులు జోడించాడు. మెల్లగా నోరువిప్పాడు.

iBAT తాత్పర్యము

స్వామీ! మేము లోకపాలకులము. నీవు మాకందరకును పాలకుడవు. నీది పరమధామము. అందు రజస్సు, తమస్సు అనేవాని చాయ అణుమాత్రం కూడా ఉండదు. దానినే తత్త్వజ్ఞులు శుద్ధసత్త్వము - వెలుగొందే జ్ఞానస్వరూపము - అంటారు. వికారాలవాసన కూడా లేని శాంతస్వరూపం నీది. దేశము, కాలము అనేవాని ఎట్టికొలతలకు లోబడనిది. ఆవిధంగా దానిని ‘నిత్యము’ అంటారు. అధికతపోమయము తపస్సు అంటే బ్రహ్మమే అంటున్నది ఉపనిషన్మాత. నీతత్త్వం ఇట్టిదిట్టిది కావటంవలన మాయకు చెందిన గుణములు సత్త్వము, రజస్సు, తమస్సు అనేవి నీకు లేవు. గుణాలు లేవు కనుక గుణాలవలన ఏర్పడే లోభము మొదలైన నీచలక్షణాలు నిన్ను అంటవు. అయినా విశ్వసంరక్షణకోసం నీవు మూడుపనులను స్వయంగా ఏర్పరచుకొన్నావు. మొదటిది దుష్టులను శిక్షించటం, రెండవది ఉత్తమశీలం గలవారిని రక్షించటం, మూడవది ధర్మమును పట్టుతప్పకుండా నిలిపి ఉంచటం. వీనికోసం నీవు దండమును ధరిస్తావు.

ఈ జగత్తునంతా భరించేవాడవు. దీనికి గురుడైనవాడవూ, పుట్టించినవాడవూ - అన్నీ నీవే. పేరునకు మేము లోకపాలకులము. నీవు ఎప్పుడు ఏరూపం అవసరమనుకొంటే అప్పుడు ఆరూపాన్ని ఏర్పాటు చేసుకొని లోకాలన్నింటికీ మేలు చేస్తూ ఉంటావు.
10-951 తుంబురు నారదాదులు సిద్ధచారణ... (సీసము).
iBAA పద్య గానం
iBAP పద్యము
తుంబురు నారదాదులు సిద్ధచారణ
  గంధర్వులును హరికథలు పాడి
రమరకాంతలు మింటవాడిరి వేల్పులు.
  గురియించి రంచితుకుసుమవృష్టి
జగములు మూఁడును సంతోషమును బొందెఁ
  గుఱ్ఱులచన్నులఁ గురిసెఁ బాలు
నవజలంబులతోడ నదులెల్లఁ బ్రవహించె
  నిఖిలవృక్షములుఁ దేనియలు వడిసె

తేటగీతి

సర్వలతికల ఫలపుష్పచయములమరెఁ
బర్వతంబులు మణిగణప్రభల నొప్పెఁ
గ్రాసులకు నెల్ల దమలోని పగలుమానె
వాసుదేవుని యభిషేకవాసరమున.

iBAT సందర్భం

దేవేంద్రుడు, కామధేనువు, మహర్షిసంఘాలూ అందరూ సముత్సాహంతో శ్రీకృష్ణునికి గోవింద పట్టాభిషేకం చేశారు. ఆ సందర్భంలో

iBAT తాత్పర్యము

తుంబురుడు, నారదుడు, సిద్ధులు, చారణులు, గంధర్వులు మింటిలో హరికథలు పాడినారు. అప్పరసలు నృత్యాలు చేశారు. దేవతలు పూలవానలు కురిపించారు. మూడులోకాలూ సంతోషం పొందాయి. ఆవులు కుండలకొద్దీ పాలిచ్చాయి. నదులు తేటనీటితో చల్లగా మెల్లగా ప్రవహించాయి. చెట్లనిండా తేనెపట్టులే. తీగలు పరిమళభరితములైన పూలతో అలరారినాయి. కొండలు మణులతో కాంతులను విరజిమ్మాయి. ప్రాణులన్నీ పగలు మాని చెలిమితో బ్రదుకసాగాయి. ఇలా వాసుదేవుని పట్టాభిషేకోత్సవం ప్రజలకు పరమానందదాయకం అయినది. ఇంద్రుడు మొదలైన దేవలోకంవారు గోవిందుని అనుమతి తీసుకొని అమరావతికి చేరుకొన్నారు.
10-966 విటసేనపై దండువెడలెడు వలఱేని... (సీసము).
iBAA పద్య గానం
iBAP పద్యము
విటసేనపై దండువెడలెడు వలఱేని
  గొల్లెనపై హేమకుంభమనఁగఁ
గాముకధృతివల్లికకలు ద్రెంపనెత్తిన
  శంబరాంతకు చేతి చక్రమనఁగ
మారుండు పాంథుల మానాటవులు గాల్పఁ
  గూర్చిన నిప్పుల కుప్పయనఁగ
విరహిమృగమ్ముల వేఁటాడ మదనుండు
  తెచ్చిన మోహంపు దీమమనఁగ

ఆటవెలది

వింతనునుపు గల్గి వృత్తమై యురుణమై
కాంతితోఁ జరోరగణములుబ్బఁ
బొడుపుఁ గొండ చక్కిఁ బొడిచె రాకాచంద్ర
మంజలంబు గగనమండలమున.

iBAT సందర్భం

శరత్కాలం వచ్చింది. ప్రకృతి అంతా పరవశించిపోతున్నది. ప్రాణుల హృదయాలన్నీ కాముని చేతిలో కీలుబొమ్మలైపోయాయి. నేలమీద కలువలు, నింగిలో వెన్నెలలు ప్రాణులను పరవశింపజేస్తున్నాయి.

పున్నమి వచ్చింది. గుండెలలో అలజడిని తెచ్చింది. చందమామ జనులగుండెలను ఆటుపోటులతో ఊపిపారేస్తున్నాడు.

iBAT తాత్పర్యము

ఏమిటి ఇది! వింతవింతసొంపులతో వెలిగిపోతూ పైకి వస్తున్నది! విటుల సేనమీద దండు పోవటానికి దూకుతున్న కామదేవుని గొల్లెనమీద నిలిపి ఉంచిన బంగారు కుండ కాదు గదా! కాముకుల గుండెదిటవులనే తీగలను తెంచివేయటానికి మన్మథుడు చేతిలో పట్టుకొన్న చక్రం కాబోలు. మన్మథుడు ప్రియురాండ్ర ఎడబాటుతో పోయే బాటసారుల ఎదలబింకం అనే పొదలను కాల్చివేయటానికి కూర్చుకొన్న నిప్పులకుప్ప అయి ఉంటుందా? వియోగతాపంతో ఉడికిపోతున్న మృగాలవంటి జీవులను వేటాడటానికి మన్మథుడు పెట్టిన మచ్చు మందేమోనే. ఎంత నునుపుగా ఉంది. ఎంత గుండ్రంగా ఉన్నది. కావి రంగు ఎంత చూడముచ్చటగా ఉంది? చకోరపక్షులు ఉల్లాసంగా రెక్కలు కొట్టుకొంటూ గగనంలో విహరిస్తున్నాయి ఓహో! పొడుపుకొండమీదకు మెల్లగా ఎక్కుతున్న చంద్రబింబమా!
10-979 ప్రాణేశుఁ డెఱిఁగినఁ బ్రాణంబునకుఁ దెగు... (సీసము).
iBAA పద్య గానం
iBAP పద్యము
ప్రాణేశుఁ డెఱిఁగినఁ బ్రాణంబునకుఁ దెగు
  దండించు నెఱిఁగిన ధరణివిభుఁడు
మామయెఱింగిన మనువెల్లఁ జెడిపోవుఁ
  దలవరి యెఱిఁగిన దగులుసేయుఁ
దలిదండ్రు లెఱిఁగినఁ దలలెత్తకుండుదు
  రేరాలెఱింగిన నాదరింపరు చూచి
నాత్మజులెఱిఁగిన నాదరింపరు చూచి
  బంధువులెఱిఁగిన బహియొనర్తు

ఆటవెలది

రితరులెరిఁగినేని నెంతయుఁజుల్కఁగాఁ
జూతు రిందునందు సుఖములేదు
యశములేదు నిర్భయానందమునులేదు
జారుఁ జేరఁ జనడు చాముముఖికి.

iBAT సందర్భం

రాజా! మర్యాదలేవీ పట్టించుకోకుండా దర్శనానికి వచ్చిన గోపకాంతలను చూచి సుగుణాలకుప్ప పలుకులప్రాభవం కలవాడు కృష్ణుడు తనమాటలమహిమనంతా ఒలకబోస్తూ ఇలా అన్నాడు.

iBAT తాత్పర్యము

మగనికి తెలిసిందో ప్రాణాలు తీస్తారు. పాలకునికి తెలిస్తే కొరతవంటిశిక్షవేస్తాడు. మామకు తెలిస్తే బ్రదుకు బండలవుతుంది. న్యాయమూర్తికి తెలిస్తే వీధిలో నిలబెట్టి విచారణల పేరుతో మానంపోగొడతాడు. తల్లిదండ్రులు తలయెత్తుకొని తిరుగలేదు. తోటికోడలు ఎత్తిపోటుమాటలతో హింసిస్తుంది. కొడుకులు మొగంమీద ఉమ్మేస్తారు. బంధువులు వెలివేస్తారు. ఇతరులు ఛీకొడతారు. అయితే కానీ వ్రతంచెడ్డా ఫలం దక్కుతుందా అంటే ఆసుఖమూ హుళక్కియే. కాబట్టి విటులను మరగటం నరకమే అవుతుంది.
10-985 విరహాగ్నిశిఖలతో వెడలు విట్టూర్పుల... (సీసము).
iBAA పద్య గానం
iBAP పద్యము
విరహాగ్నిశిఖలతో వెడలు విట్టూర్పుల
  ముమ్మరంబులఁ దాకి మోము లెండ
కన్నుల వెడలెడి కజ్జలధారలు
  కుచకుంకుమంబుల గ్రొచ్చిపాఱ
చెక్కులఁ జేర్చిన చేతుల వేడిమి
  మోముదమ్ముల మేలిమురుపు డింద
పొరిఁబొరిఁ బుంఖానుపుంఖంబులై తాకు
  మదనుకోలల ధైర్యమహిమసెదర

తేటగీతి

దుఖభరమున మాటలు దొట్రుబడఁగ
ప్రియములాడని ప్రియుఁ జూచి బెగ్గడిల్లి
చరణముల నేలప్రాయుచు సంభ్రమమున
కాంతలెల్లరు వగల నాక్రాంతులగుచు.

iBAT సందర్భం

కృష్ణు డున్న మాటలు విన్నారు. అక్కడ గుమిగూడిన గోపకాంతలు, వారి పరిస్థితి ఎలా ఉన్నదంటే –

iBAT తాత్పర్యము

ఒకప్రక్క స్వామిని విడచి ఉండటం వారికి నిప్పులగుండంలో పడి దొరలినంత వేదనను కలుగజేస్తున్నది. దానితో నిట్టూర్పులు ఆగకుండా వెలువడుతున్నాయి. అవేడికి మొగాలు మాడిపోతున్నాయి. కన్నులనుండి నీళ్ళు ధారలుగా వచ్చిపడుతున్నాయి. పెట్టుకొన్న కాటుకతో బరదగా అయిన ఆ నీటితో రొమ్ములమీద పూసుకొన్న కుంకుమ రొంపిరొంపిగా తయారయింది. చేతులను చెక్కిళ్ళమీదకు చేర్చారు. ఆచేతులవేడిమికి బుగ్గలు కంది పోతున్నాయి. అటునుండి మన్మథుడు వాడి ములుకులు గుప్పిస్తున్నాడు. దానితో గుండెను దిటవు చేసికొని నిలువలేకపోతున్నారు. మాటలు తొట్రుపడుతున్నాయి. దెప్పిపొడుస్తూ వెక్కిరిస్తున్న కృష్ణస్వామిని చూచి బెగ్గడిల్లి పోతున్నారు. తలవంచుకొని బొట్టనవ్రేలితో నేలమీద పిచ్చిగీతలు గీస్తు నిలిచిపోయారు.
10-990 నీపాదకమలంబు నెమ్మి దగ్గఱఁ గాని... (సీసము).
iBAA పద్య గానం
iBAP పద్యము
నీపాదకమలంబు నెమ్మి దగ్గఱఁ గాని
  తరలిపోవంగఁ బాదములు రావు
నీకరాబ్జంబులు నెఱినంటి తివఁగాని
  తక్కినపనికి హస్తములు సొరవు
నీవాగమృతధార నిండఁ గ్రోలఁగఁగాని.
  చెవులన్యభాషలు సేరి వినవు
నీసుందరాకృతి నియతిఁ జూడఁగఁగాని
  చూడవన్యంబులఁ జూడ్కి కవలు

ఆటవెలది

నిన్నకాని పలుకునేర్వవు మా జిహ్వ
లొల్లవనుచుఁ బలుకనోడ నీవు
మామనంబు లెల్ల మురిపించి దొంగిలి
తేల సేయువార మింక కృష్ణ!

iBAT సందర్భం

భర్తలనూ, బిడ్డలనూ ఇంకా తక్కిన చుట్టపక్కాలనూ ఆశ్రయించటం ఆడువారికి ధర్మపద్దతి అన్నావు. మాకు నీలోనే వారందరూ కానవస్తున్నారు. నీవే మాకు భర్తవు. బిడ్డవు, మామవు, అత్తవు, అన్నవు, తమ్ముడవు, చెలికాడవు. అటువంటి నిశ్చయజ్ఞానంతో నిన్ను సేవించటం అన్యాయమా? మేము ఈ సృష్టిలోని సకలబంధాలనూ నీయందే నిలుపుకొని బ్రతుకుతున్నాం. ఏకారణంగా నయినా నిన్ను సేవించుకోకపోతే మామనస్సు మాటా, చేష్టా నిప్పుల కుంపటిలో పడ్డ ప్రాణిలాగా విలవిలలాడిపోతున్నాయి. ఈ తాపాన్ని రూపుమాపటం నీబాధ్యత కాదా!

iBAT తాత్పర్యము

కన్నయ్యా మాకాళ్ళూ, మాచేతులూ, మా చెవులూ, మా కన్నులూ మావశంలో లేవయ్యా అన్నింటి వ్యాపారాలనూ మాకు తెలియకుండా నీవు దోచుకొని దాచుకొన్నావు. మానాలుకలు నిన్నుగూర్చి తప్ప మరొక మాట పలుకవు. మామనస్సులు మావశంలో లేవు. మాసర్వస్వాన్నీ నీ అధీనంలో ఉంచుకొని మాకట్టెలను మా కొంపలకు చేర్చమంటే ఎలా సాధ్యమవుతుంది స్వామీ!
10-1009 పున్నాగ కానవే పున్నాగవందితు... (సీసము).
iBAA పద్య గానం
iBAP పద్యము
పున్నాగ కానవే పున్నాగవందితు
  తిలకంబ కానవే తిలకనిటలు
మన్మథ! కానవే మన్మథాకారుని
  వంశంబ కానవే వంశధరుని
ఘనసార! కానవే ఘనసారశోభితు
  బంధూక కానవే బంధుమిత్రు
చందన కానవే చందనశీతలు
  కుందంబ కానవే కుందరదను

తేటగీతి

ఇంద్రభూజము కానవే యింధ్రవిభవు
కువలవృక్షమ కానవే కువలయేశు
ప్రియాకపాదప కానవే ప్రియవిహారు
ననుచు కృష్ణుని వెదకి రయ్యబ్జముఖులు

iBAT సందర్భం

మాటాడుతూ మాటాడుతూనే ఆ యోగమూర్తి అదృశ్యుడయ్యాడు. గోపికలు తల్లడిల్లిపోయారు. ఉన్మత్తలయ్యారు. నేనే కృష్ణుడను అంటూ అందరూ అందరినీ కౌగిలించుకోసాగినారు. నిజానికి వారిలో గోపికలతనం అంతరించిపోయింది. కృష్ణతత్త్వం నిలువెల్లా నిండిపోయింది. వారి భక్తి పంట ఇబ్బడిముబ్బడిగా పండిందన్నమాట.

iBAT తాత్పర్యము

ఏ చెట్టులోచూచినా వారికి కృష్ణుని లక్షణాలే కనిపిస్తున్నాయి. లోపలా వెలుపలా అంతటా అనంతమూర్తినే దర్శిస్తున్నారు. అయినా భౌతిక భావజాలం పూర్తిగా నశించలేదు. కనుక పున్నాగాన్నీ తిలకవృక్షాన్నీ, కర్పూరపు అరటిచెట్టునూ, మంకెనచెట్టునూ, వెదురుపొదలనూ, మంచిగందపుచెట్టునూ, మెల్లతీగనూ, దేవదారువునూ, రేగుచెట్టునూ అడగసాగారు. ఆ అన్నింటినీ అన్నీ అయినవాని లక్షణాలను దర్శిస్తూ అడుగుతున్నారు
10-1014 అదె నందనందనుఁ డంతర్హితుండయ్యె... (సీసము).
iBAA పద్య గానం
iBAP పద్యము
అదె నందనందనుఁ డంతర్హితుండయ్యె
  పాటలీతరులార! పట్టరమ్మ!
హేలావతులఁ గృష్ణ! యేలపాసితివని
  ఐలేయలతలార! అడుగరమ్మ!
వనజాక్షుఁ డిచటికి వచ్చి దాఁగఁడు గదా!
  చూతమంజరులార! చూడరమ్మ!
మానినీమదనుతో మారాక యెఱిఁగించి
  మాధవీలతలార!మనుపరమ్మ!

ఆటవెలది

జాతిసతులఁ బాయ నీతియే హరికని
జాతులార! దిశలఁ జాటరమ్మ
కదళులార! పోయి కదలించి శిఖిపింఛం
జూటుఁ దెచ్చి కరుణఁ జూపరమ్మ.

iBAT సందర్భం

నందనందనుడు అదృశ్యుడైనాడని గోపికలు ఆక్రందిస్తూ అక్కడ ఉన్న చెట్లతో మొరపెట్టుకొంటున్నారు.

iBAT తాత్పర్యము

పాటలీతరులారా! అదిగో ఆనందనందనుడు కనుగప్పి పారిపోయాడు. పట్టుకోండి. పట్టుకోండి. కృష్ణా! ఈ విలాసవతులు నీయందే అన్ని భావాలూ పెట్టుకొని నీకే అన్నీ సమర్పించుకొని ఉన్నారు. వారిని ఎందుకు వదలివేశావు అని నిగ్గదీసి అడగండి. ఓ మామిడితోపులారా! పద్మాలంతటి పెద్దకళ్ళతో అందరినీ ఆకర్షించే ఆ కృష్ణుడు మీదగ్గరకు వచ్చి దాగినాడేమో! కాస్త చూడండమ్మా! మాధవీలతలారా! మానినుల మనస్సులను నుగ్గు నుగ్గుగా గొట్టే ఆ స్వామికి మేము వచ్చామని తెలిపి మమ్మల్ని బ్రతికించండి. స్వామీ! మీరందరూ ఉత్తమజాతికి చెందిన సతులయ్యా వారిని ఏడిపించటం నీతి కాదని ఆయనకు కాస్త బుద్ధి చెప్పండి. అన్నివైపుల చాటింపు వేయండి ఆ నల్లనయ్య తప్పిపోయాడని. విన్నవాళ్ళు వెదకి మాకు తెచ్చి యిచ్చి మాప్రాణాలు కాపాడతారేమో! అరటిబోదెలారా! మాయందు దయతలచి నెమలికన్నులను తలనిండా అలంకరించుకొన్న ఆ సోకుగానిని మాకు తెచ్చిపెట్టండి.