iBam भागवतम अनिमुथ्यालु

సంకల్ప ప్రేరణ

krish3

బ్రహ్మశ్రీ చాగంటి కోటీశ్వర రావు గారి ప్రవచనాల శ్రవణమే మన ఐ భాగవత ఆణి ముత్యాలు కార్యక్రమ సంకల్పావిష్కరణకు మూల ప్రేరణ, వెన్నుదట్టే ప్రోత్సాహాలు. 2006వ సం. ఫిబ్రవరి 2న తమ ప్రవచనం మొదటి రోజు ఆరంభిస్తూ వారు అన్నారు “ శ్రీమాన్ బమ్మెర పోతనామాత్యుల కృతమైన శ్రీమదాంధ్రమహాభాగవత పద్యాలన్నీ ముత్యాలే. కొన్నైతే ఆణిముత్యాలే. కనీసం అవైనా నేర్చుకొని కంఠతా పట్టి రోజు పఠిస్తూ ఉండటం ఎంతో మంచి అలవాటు”. అంతేకాకుండా “జీవితంలో ఒచ్చే ఒడుదుడుకు సమయాలలో భాగవత పద్యాల పఠనం అనే అలవాటు మనిషికి వలసిన మానసిక బలాన్ని, రక్షణను, ధైర్యాన్ని ఇస్తుంది. పైగా ఒడుదుడుకులను దాటే చక్కటి ఓదార్పును, దైవసహాయాన్ని అందిస్తుంది. ఇది తథ్యం” అని కూడ శలవిచ్చారు.

దానితో శ్రీమాన్ పోతనగారి శ్రీమదాంధ్రభాగవతంలో ఉన్న 7012 పద్యాలలో 504ఆణి ముత్యాలు వంటి పద్యాలను ఎంచుకొని ప్రపంచంలో నలుమూలలా ఉన్న మన తెలుగు నవతర యువతకు అందించాలనే సత్సంకల్పానికి నాంది పలికింది శ్రీ చాగంటి వారి ఈ భావవీచికలే.

ముఖ్యోద్దేశం


krish1

వేదవ్యాస కృత మహాభాగవతాన్ని ఆంధ్రీకరించిన శ్రీమాన్ పోతనామాత్యులవారి అమృతతుల్యమైన తెలుగు పద్యాలను మధించి పద్యపద్యాన్ని తరచి తరచి ఎంచి ఐ భాగవత ఆణిముత్యాల పేరుతో తరతరానికి పెరుగుతున్న అద్భుత అనంత జ్ఞాన పిపాస సామర్థ్యాలతో అలరారుతున్న మన నవ తరపు తెలుగు బంగారు శిశువులకు అందించటం ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం.

రకరకాల ఐఫోనులు, ఐపాడ్, ఐపోడు, నానో, ఐవాచ్ వంటి బహుళ సాంకేతిక సంచారణులు, టేబ్లెట్టులు, లాపుటాపులు, కంప్యూటరులతో అతి సులువుగా ఆడేసుకుంటున్న పిల్లల చురుకు స్థాయికి తగినట్లు అందించటం.

ఈ కృషికి సార్థకంగా పేరు ఐబిఎఎమ్ (అంతర్జాల భాగవత ఆణి ముత్యాలు) అని ఎంచుటకు కారణం అంతర్జాల, కంప్యూటరు పరిజ్ఞానాల అందుబాటు సర్వసామాన్యం తప్పనిసరి అనే భావన. వాటికి తగ్గట్లు నాలుగు ఉత్పత్తులు సర్వం, సర్వులకు సర్వవేళలా సర్వే సర్వత్రా సర్వసిద్దంగా అందుబాటులో ఉండాలి. వలసిన అంతర్జాల దూరవాణి ఆదులైన వాటి సర్వ మాధ్యమాలు అన్నిటిలోను సంపూర్ణంగా అనర్గళంగా అందుబాటులో ఉంచాలి.



ఈ నాలుగు ఉత్పత్తులు ఏవంటే:

  • ఐ భాగవత ఆణి ముత్యాలు (ఐబిఎఎమ్) జాబితా (ఐబిఎఎల్)
  • ఐబిఎఎమ్ పద్యాలు తెలుగు యూనికోడు లిపిలో (ఐబిఎపి)
  • ఐబిఎఎమ్ పద్యాల ప్రతిపదార్థ తాత్పర్యాలు తెలుగు యూనికోడు లిపిలో (ఐబిఎటి)
  • ఐబిఎఎమ్ సందర్భ భావ సహితంగా పద్యాల గాత్రం ఎంపి3 రూపంలో ఆడియో (ఐబిఎఎ)

ఈ ఉత్పత్తు లన్నిటి ద్వారా పోతనగారి భాగవతంలోని ఆధ్యాత్మిక సౌరభాలు అన్ని వయసులవారికి అందించటమే మా ప్రధాన లక్ష్యం అయినా, పాఠశాలలో తెలుగుని భాషగా నేర్చుకొని, ధారాళంగా రాయటం, చదవటం, మాట్లాడగలగటం నేర్చి ఉండే అవకాశం ఉంది కనుక ముప్పై ఆపైన వయసు వారికి మొదటి మూడు ఉత్పత్తులు మరింత అనుకూలం కావచ్చు

ఇప్పటి నవతరంలో మూడేళ్ళ ఆ పై వయసు వారికి రాబోయే తరాల వారి కోసం ఉద్దేశించినది నాలుగవ ఉత్పత్తి గాత్ర (ఆడియో) ఉత్పత్తి. కాని వారిలో మన ఆధ్యాత్మికసౌరభాలపై ఆశక్తి విరియాలంటే, వారికి సందర్భ తాత్పర్యాలు అందించే అవసరం బాగా ఉంటుంది. వారి అనంతమైన గ్రహణ శక్తి, వినూత్న సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకొని ఈ మాధ్యమాల ద్వారా ఎంత పెద్ద విషయాలనైనా ఆకళింపుచేసుకోనే నేర్పు, అమితాశక్తి, సామర్థ్యాలు వారికి ఉన్న మూలబలం. అలాంటి ఈనాటి తరం, రాబోయే తరతరాల వారి యందు భాగవత ఆధ్యాత్మికత పరివ్యాప్తి చెందించడానికి సుళువైన సాధనం సిద్దం చేయాలన్నది ముఖ్య ఆలోచన. మన యీ ఐబిఎఎం విజయవంతమైతే, తిరుపతి తిరుమల దేవస్థానం, శృంగేరి విద్యా పీఠం వంటి అనేక సంస్థలు కూడ వివిధ భాషలలో మల్టిమీడియాలో యువ తరాల వారికి మన విజ్ఞానాన్ని అందించే అవకాశాలు ఉన్నాయి. ఐబిఎఎం సభ్యులుగా మనం మొదలెట్టిన ఈ బృహత్తర ప్రయాణంలో ఇది మొదటి మెట్టు మాత్రమే అని గమనించండి.

తోడ్పడినవారు

Krishna

Project Lead
  • Mallik Putcha; (Mallikharjuna Venkata Subrahmanyam)

  • iBAL
  • Mallik Putcha

  • iBAP
  • Sambasiva Rao Vulapalli

  • iBAT
  • Sambasiva Rao Vulapalli

  • IBAA
  • Raghunatha Sarma Salaka
  • Parthasarathi Nemani (Parthu)

  • Finance and Fund Raising
  • Hari Gopal Varanasi

New York

Web Hosting and Apps Development Lead
  • Venkata Rama Prasad Kuchibhatla
  • Fani Kiran Vulapalli
  • Prabhakar Kavi
  • Satish Krishna Murthy
San Francisco

Initial Steering
  • Murali Ahobila
  • Sitaram Ayyagari
  • Ramohan Cheruvu
  • Ishad James
  • Uma Devi Pochampalli
  • Venkata Ramalingeshwara Sharma Nishtala
  • Sudesh Pilttla
  • Ravi Poduri
  • Krishna Reddy
  • Kumari Susarla
  • Hanuma Swami
  • Balamurali Krishna Goparaju

Strategic
  • Ramalingeswara Rao Jonnavittula
  • Anand Mohan Bhagavathula
  • Chitten Raju Vanguri
  • Suryanarayana Murthy Yanamandra
  • Sekhar Chodemella