పంచమ స్కందము5P-45 పరిపూర్ణుఁడ వై యుండియు... (కందము)

iBAP పద్యము

పరిపూర్ణుఁడ వై యుండియ
మఱువక మా పూజ లెల్ల మన్నింతువు; నీ
చరణార వింద సేవయు
ధరఁ బెద్దలు చెప్పినటుల దగఁ జేసెదమౌ.

iBAA పాట

No Audio

5P-162 ధరలోన బ్రహ్మంబుఁ... (సీసము).

iBAP పద్యము

ధరలోన బ్రహ్మంబు తపమున దానంబు;లను గృహధర్మంబులను జలాగ్ని
సోమ సూర్యులచేత శ్రుతులచే నైనను; బరమభాగవతుల పాదసేవఁ
బొందినమాడ్కిని బొందంగ రా దని; పలుకుదు రార్యులుఁ బరమమునులు
ఘన తపో బాహ్యసౌఖ్యములకు విముఖులు; నై పుణ్యులు హరిగుణానువాద


(తేటగీతి)

మోదితాత్ములు నగు బుధపాదసేవ
ననుదినంబును జేసిన నంతమీఁద
మోక్షమార్గంబునకును బద్మాక్షునందుఁ
బట్టుపడి యుండు నెప్పుడుఁ బరఁగ బుద్ధి.

iBAA పాట

No Audio

5P-176 అక్కట మానుషజన్మం... (కందము).

iBAP పద్యము

అక్కట! మానుష జన్మం
బెక్కువ యై యుండు నెపు డభేదమతిం బెం
పెక్కిన యోగిసమాగమ
మక్కజముగఁ గలిగెనేని యఖిలాత్ములకున్.

iBAA పాట

No Audio

5D-55 భారతవర్ష జంతువుల... (ఉత్పలమాల).

iBAP పద్యము

భారతవర్ష జంతువుల భాగ్యము లేమని చెప్పవచ్చు? నీ
భారతవర్ష మందు హరి పల్మఱుఁ బుట్టుచు జీవకోటికిం
ధీరతతోడఁ దత్త్వ ముపదేశము సేయుచుఁ జెల్మి సేయుచు
న్నారయ బాంధవాకృతిఁ గృతార్థులఁ జేయుచునుండు నెంతయున్.

iBAA పాట

No Audio

5D-56 తన జన్మకర్మములనుం... (కందము).

iBAP పద్యము

తన జన్మ కర్మములనుం
గొనియాడెడివారి కెల్లఁ గోరిన వెల్లన్
దనియఁగ నొసఁగుచు మోక్షం
బనయముఁ గృపసేయుఁ గృష్ణుఁ డవనీనాథా!

iBAA పాట

No Audio