చతుర్ధ స్కందము4-91 నెలకొని ధర్మపాలన... (చంపకమాల).

iBAP పద్యము

నెలకొని ధర్మపాలన వినిర్మలు భర్గుఁ దిరస్కరించు న
క్కలుషుని జిహ్వఁ గోయఁ దగుఁ; గా కటు చేయఁగ నోపఁ డేని దాఁ
బొలియుట యొప్పు; రెంటికిఁ బ్రభుత్వము చాలమిఁ గర్ణ రంధ్రముల్
బలువుగ మూసికొంచుఁ జనఁ బాడి యఁ టందురు ధర్మవర్తనుల్.

iBAA పాట

4-108 అభ్రంలి హాదభ్ర... (సీసము).

iBAP పద్యము

అభ్రంలి హాదభ్ర విభ్ర మాభ్రభ్రమ; కృన్నీల దీర్ఘ శరీర మమరఁ
బ్రజ్వలజ్జ్వలన దీప్తజ్వాలికా జాల; జాజ్వల్యమాన కేశములు మెఱయఁ
జండ దిగ్వేదండ శుండాభ దోర్దండ; సాహస్ర ధృత హేతిసంఘ మొప్ప
వీక్షణత్రయ లోకవీక్షణ ద్యుతి లోక; వీక్షణతతి దుర్నిరీక్ష్యముగను


(తేటగీతి)

గ్రకచ కఠిన కరాళ దంష్ట్రలు వెలుంగ
ఘన కపాలాస్థి వనమాలికలును దనర
నఖిలలోక భయంకరుఁ డగుచు వీర
భద్రుఁ డుదయించె మాఱట రుద్రుఁ డగుచు.

iBAA పాట

4-137 ఉజ్జ్వలం బై... (సీసము).

iBAP పద్యము

ఉజ్జ్వలం బై శతయోజనంబుల పొడ;వును బంచసప్తతి యోజనముల
పఱపును గల్గి యే పట్టునఁ దిరుగని; నీడ శోభిల్ల నిర్ణీత మగుచుఁ
బర్ణ శాఖా సమాకీర్ణ మై మాణిక్య;ములఁ బోలఁగల ఫలములఁ దనర్చి
కమనీయ సిద్ధ యోగక్రియామయ మయి; యనఘ ముముక్షు జనాశ్రయంబు


(తేటగీతి)

భూరిసంసార తాప నివారకంబు
నగుచుఁ దరురాజ మనఁగఁ బెం పగ్గలించి
భక్తజనులకు నిచ్చలుఁ బ్రమద మెసఁగ
వలయు సంపద లందు నావటము వటము.

iBAA పాట

4-139 ఇద్ధ సనందాది... (సీసము).

iBAP పద్యము

ఇద్ధ సనందాది సిద్ధ సంసేవితు; శాంతవిగ్రహుని వాత్సల్య గుణునిఁ
గమనీయ లోక మంగళ దాయకుని శివు; విశ్వబంధుని జగద్వినుత యశుని
గుహ్యక సాధ్య యక్షో రక్షనాథ కు;బేర సేవితుని దుర్వార బలుని
నుదిత విద్యా తపో యోగ యుక్తుని బాల; చంద్రభూషణుని మునీంద్రనుతునిఁ


(తేటగీతి)

దాపసాభీష్టకరు భస్మదండలింగ
ఘన జటాజినధరుని భక్తప్రసన్ను
వితత సంధ్యాభ్రరుచి విడంబిత వినూత్న
రక్తవర్ణు సనాతను బ్రహ్మమయుని.

iBAA పాట

4-140 అంచిత వామపాదాంభోరుహము... (సీసము).

iBAP పద్యము

అంచిత వామపాదాంభోరుహము దక్షి; ణోరుతలంబున నొయ్య నునిచి
సవ్యజానువుమీఁద భవ్యబాహువు సాఁచి; వలపలి ముంజేత సలలితాక్ష
మాలిక ధరియించి మహనీయ తర్క ము;ద్రాయుక్తుఁ డగుచుఁ జిత్తంబులోన
నవ్యయం బైన బ్రహ్మానందకలిత స;మాధి నిష్ఠుఁడు వీతమత్సరుండు


(తేటగీతి)

యోగపట్టాభిరాముఁ డై యుచిత వృత్తి
రోషసంగతిఁ బాసి కూర్చున్న జముని
యనువునను దర్భరచిత బ్రుస్యాసనమున
నున్న మునిముఖ్యు నంచిత యోగనిరతు.

iBAA పాట

4-163 మానిత శ్యామాయమాన... (సీసము).

iBAP పద్యము

మానిత శ్యామాయమాన శరీర దీ;ధితులు నల్దిక్కుల దీటుకొనఁగఁ
గాంచన మేఖలా కాంతులతోడఁ గౌ;శేయచేలద్యుతుల్ చెలిమి చేయ
లక్ష్మీసమాయుక్త లలితవక్షంబున; వైజయంతీ ప్రభల్ వన్నెఁ జూప
హాటకరత్న కిరీటకోటిప్రభల్; బాలార్క రుచులతో మేలమాడ


(తేటగీతి)

లలిత నీలాభ్రరుచిఁ గుంతలములు దనరఁ
బ్రవిమలాత్మీయ దేహజప్రభ సరోజ
భవ భవామర ముఖ్యుల ప్రభలు మాప
నఖిల లోకైక గురుఁడు నారాయణుండు.

iBAA పాట

4-181 దితిసంతాన వినాశసాధన... (మత్తైభం).

iBAP పద్యము

దితిసంతాన వినాశ సాధన సముద్దీ ప్తాష్ట బాహా సమ
న్విత మై యోగిమనోనురాగ కరమై వెల్గొందు నీ దేహ మా
యత మైనట్టి ప్రపంచముం బలెను మిథ్యాభూతముం గామి శా
శ్వతముంగా మదిలోఁ దలంతు హరి! దేవా! దైవచూడామణీ!

iBAA పాట

4-193 విశ్వాత్మ నీయందు... (సీసము).

iBAP పద్యము

విశ్వాత్మ! నీయందు వేఱుగా జీవులఁ; గనఁ డెవ్వఁ; డటు వానికంటెఁ బ్రియుఁడు
నీకు లేఁ; డైనను నిఖిల విశ్వోద్భవ; స్థితి విలయంబుల కతన దైవ
సంగతి నిర్భిన్న సత్త్వాది గుణవిశి; ష్టాత్మీయ మాయచే నజ భవాది
వివిధ భేదము లొందుదువు స్వస్వరూపంబు; నం దుండుదువు; వినిహత విమోహుఁ


(తేటగీతి)

డగుచు నుందువు గద; ని న్ననన్యభక్తి
భృత్యభావంబుఁ దాల్చి సంప్రీతిఁ గొల్చు
మమ్ము రక్షింపు మో కృపామయ! రమేశ!
పుండరీకాక్ష! సంతత భువనరక్ష!

iBAA పాట

4-251 హార కిరీట కేయూర... (సీసము).

iBAP పద్యము

హార కిరీట కేయూర కంకణ ఘన; భూషణుం డాశ్రిత పోషణుండు
లాలిత కాంచీకలాప శోభిత కటి; మండలుం డంచిత కుండలుండు
మహనీయ కౌస్తుభమణి ఘృణి చారు గ్రై;వేయకుం డానందదాయకుండు
సలలిత ఘన శంఖ చక్ర గదా పద్మ; హస్తుండు భువనప్రశస్తుఁ డజుఁడుఁ


(తేటగీతి)

గమ్ర సౌరభ వనమాలికాధరుండు
హతవిమోహుండు నవ్య పీతాంబరుండు
లలిత కాంచన నూపు రాలంకృతుండు
నిరతిశయ సద్గుణుఁడు దర్శనీయతముఁడు.

iBAA పాట

4-253 దూర్వాంకురంబుల... (సీసము).

iBAP పద్యము

దూర్వాంకురంబుల దూర్వాంకురశ్యాము; జలజంబులను జారుజలజనయనుఁ
దులసీ దళంబులఁ దులసికా దాముని; మాల్యంబులను వినిర్మల చరిత్రుఁ
బత్రంబులను బక్షిపత్రునిఁ గడు వన్య; మూలంబులను నాది మూలఘనుని
నంచిత భూర్జత్వగాది నిర్మిత వివి;దాంబరంబులను పీతాంబరధరుఁ


(తేటగీతి)

దనరు భక్తిని మృచ్ఛిలా దారు రచిత
రూపముల యందుఁ గాని నిరూఢ మైన
సలిలముల యందుఁ గాని సుస్థలము లందుఁ
గాని పూజింపవలయు న క్కమలనాభు.

iBAA పాట

4-287 సర్వేశ కల్పాంత... (సీసము).

iBAP పద్యము

సర్వేశ! కల్పాంత సమయంబు నందు నీ; యఖిల ప్రపంచంబు నాహరించి
యనయంబు శేష సహాయుండ వై శేష; పర్యంకతలమునఁ బవ్వళించి
యోగనిద్రా రతి నుండి నాభీసింధు;జస్వర్ణలోక కంజాతగర్భ
మందుఁ జతుర్ముఖు నమరఁ బుట్టింపుచు; రుచి నొప్పు బ్రహ్మస్వరూపి వైన


(తేటగీతి)

నీకు మ్రొక్కెద నత్యంత నియమ మొప్ప
భవ్యచారిత్ర! పంకజపత్ర నేత్ర!
చిరశుభాకార! నిత్యలక్ష్మీవిహార!
యవ్యయానంద! గోవింద! హరి! ముకుంద!

iBAA పాట

4-553 అది గాన పద్మలోచన... (కందము).

iBAP పద్యము

అదిగాన పద్మలోచన!
సదమల భవదీయ ఘనయశము వినుటకు నై
పదివేల చెవులు కృప ని
మ్మదియే నా యభిమతంబు నగును ముకుందా!

iBAA పాట

4-581 నారాయణుండు జగదాధారుం... (కందము).

iBAP పద్యము

నారాయణుండు జగదా
ధారుం డగు నీశ్వరుండు; దలఁప నతనికిన్
లే రెందు సములు నధికులు
ధీరోత్తముఁ డతఁడు నద్వితీయుం డగుటన్.

iBAA పాట

No Audio

4-583 కర్మవశంబునన్ జగము... (ఉత్పలమాల).

iBAP పద్యము

కర్మవశంబునం జగము గల్గును హెచ్చు నడంగు నన్నచో
గర్మముఁ బుద్ధిఁ జూడ జడకార్యము; గాని ప్రపంచ కల్పనా
కర్మమునందుఁ గర్త యనఁగా విలసిల్లఁగఁ జాల; దీ జగ
త్కర్మక కార్యకారణము గావున నీశుఁడు విష్ణుఁ డారయన్.

iBAA పాట

No Audio

4-608 భువి నెవ్వనియెడ... (కందము).

iBAP పద్యము

భువి నెవ్వని యెడ విప్రులు
భవుఁడును విష్ణుఁడుఁ దదీయ భక్తులును బ్రస
న్నవదను లగుదురు వానికి
భువిని దివి నసాధ్యకర్మములు లే వనఘా.

iBAA పాట

No Audio

4-702 పంకజనాభాయ సంకర్షణాయ... (సీసము).

iBAP పద్యము

పంకజనాభాయ, సంకర్షణాయ, శాం;తాయ, విశ్వప్రబోధాయ, భూత
సూక్ష్మేంద్రియాత్మనే, సూక్ష్మాయ, వాసుదే;వాయ, పూర్ణాయ, పుణ్యాయ, నిర్వి
కారాయ, కర్మవిస్తారకాయ,త్రయీ;పాలాయ, త్రైలోక్యపాలకాయ,
సోమరూపాయ, తేజోబలాఢ్యాయ, స్వ;యం జ్యోతిషే, దురంతాయ, కర్మ


(తేటగీతి)

సాధనాయ, పురాపురుషాయ, యజ్ఞ
రేతసే, జీవతృప్తాయ, పృథ్విరూప
కాయ, లోకాయ, నభసేం, తకాయ, విశ్వ
యోనయే, విష్ణవే, జిష్ణవే, నమోస్తు.

iBAA పాట

No Audio

4-703 స్వర్గాపవర్గ సుద్వారాయ... (సీసము).

iBAP పద్యము

స్వర్గాపవర్గ సుద్వారాయ, సర్వర;సాత్మనే, పరమహంసాయ, ధర్మ
పాలాయ, సద్ధిత ఫలరూపకాయ, కృ;ష్ణాయ, ధర్మాత్మనే, సర్వశక్తి
యుక్తాయ, ఘన సాంఖ్య యోగీశ్వరాయ, హి;రణ్య వీర్యాయ, రుద్రాయ, శిష్ట
నాథాయ, దుష్ట వినాశాయ, శూన్య ప్ర;వృత్తాయకర్మణే, మృత్యవే, వి


(తేటగీతి)

రాట్ఛరీరాయ, నిఖిల ధర్మాయ, వాగ్వి
భూతయే, నివృత్తాయ, సత్పుణ్య భూరి
వర్చసే,ఖిల ధర్మదేహాయ, చాత్మ
నే, నిరుద్ధాయ, నిభృతాత్మనే, నమోస్తు.

iBAA పాట

No Audio

4-704 సర్వసత్త్వాయ దేవాయ... (తేటగీతి).

iBAP పద్యము

సర్వ సత్త్వాయ, దేవాయ, సన్నియామ
కాయ, బహిరంతరాత్మనే, కారణాత్మ
నే, సమస్తార్థ లింగాయ, నిర్గుణాయ,
వేధసే, జితాత్మక సాధవే, నమోస్తు.

iBAA పాట

No Audio

4-713 ఎనసిన భక్తియోగమున... (చంపకమాల).

iBAP పద్యము

ఎనసిన భక్తియోగమున నే భవదీయపదాబ్జ మూలము
న్ననయముఁ బొందువాఁడు చటులాగ్రహ భీషణ వీర్య శౌర్య త
ర్జనములచే ననూనగతి సర్వజగంబులు సంహరించు న
య్యనుపముఁ డైన కాలుని భయంబును బొందఁడు సుమ్ము కావునన్.

iBAA పాట

No Audio

4-718 సరసిజనాభ సత్పురుషసంగ... (చంపకమాల).

iBAP పద్యము

సరసిజనాభ! సత్పురుషసంగ సమంచిత భక్తి యోగ వి
స్ఫురణ ననుగ్రహింపబడి శుద్ధము నొందినవాని చిత్త మ
స్థిర బహిరంగముం గనదు; చెందదు భూరి తమస్స్వరూప సం
సరణ గుహన్ జిరంబు గనఁజాలు భవన్మహనీయ తత్త్వమున్.

iBAA పాట

No Audio

4-916 కేశవ సంతత... (సీసము).

iBAP పద్యము

కేశవ! సంతత క్లేశ నాశనుఁడవు; కోరి మనో వా గగోచరుఁడవు
నిద్ధ మనోరథ హేతుభూ తోదార; గుణనాముఁడవు సత్త్వగుణుఁడ వఖిల
విశ్వోద్భవస్థితి విలయార్థ ధారిత; విపుల మాయాగుణ విగ్రహుఁడవు
మహి తాఖి లేంద్రియ మార్గ నిరధిగత; మార్గుఁడ వతిశాంత మానసుఁడవు


(తేటగీతి)

తవిలి సంసారహారి మేధస్కుఁడవును
దేవదేవుఁడవును వాసుదేవుఁడవును
సర్వభూతనివాసివి సర్వసాక్షి
వైన నీకు నమస్కారమయ్య! కృష్ణ!

iBAA పాట

No Audio

4-918 తోయరుహోదరాయ... (ఉత్పలమాల).

iBAP పద్యము

తోయరుహోదరాయ, భవదుఃఖహరాయ, నమోనమః పరే
శాయ, సరోజ కేసర పిశంగ వినిర్మల దివ్య నవ్య వ
స్త్రాయ, పయోజ సన్నిభ పదాయ, సరోరుహ మాలికాయ, కృ
ష్ణాయ, పరాపరాయ, సుగుణాయ, సురారి హరాయ, వేధసే.

iBAA పాట

No Audio

4-950 చర్చింప నరుల... (సీసము).

iBAP పద్యము

చర్చింప నరులకే జన్మకర్మాయుర్మ;నో వచనంబుల దేవదేవుఁ
డఖిల విశ్వాత్మకుం డైన గోవిందుండు; విలసిల్లు భక్తి సేవింపఁబడును
నవియ పో, జన్మ కర్మాయు ర్మనో వచ;నములని ధరణి నెన్నంగఁ దగును
వనరుహనాభ సేవా రహితము లైన; జననోపనయన దీక్షాకృతంబు


(తేటగీతి)

లైన జన్మంబు లేల? దీర్ఘాయు వేల?
వేద చోదిత యగు కర్మ వితతి యేల?
జప తపశ్శ్రుత వాగ్విలాసంబు లేల?
మహిత నానావధాన సామర్థ్య మేల?

iBAA పాట

No Audio

4-956 అరయ న్నభ్రతమః ప్రభల్... (మత్తైభం).

iBAP పద్యము

అరయన్నభ్రతమః ప్రభల్ మును నభంబం దొప్పఁగాఁ దోచి క్ర
మ్మఱ వీక్షింపఁగ నందె లేనిగతి బ్రహ్మంబందు నీ శక్తులున్
బరికింపన్ ద్రిగుణప్రవాహమున నుత్పన్నంబు లై క్రమ్మఱన్
విరతిం బొందుచు నుండుఁ గావున హరిన్ విష్ణున్ భజింపం దగున్.

iBAA పాట

No Audio